పూజలు-వ్రతాలు

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే మంచిది?

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే మంచిది?
Views: 5

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటి అనగా చొల్లంగి అంటే గోదావరి నది, సాగరం, బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం మరియు చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామమే “చొల్లంగి”. తెలుగు క్యాలెండర్‌ ప్రకారం, పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు. మన సంప్రదాయం ప్రకారం, పవిత్ర నదుల్లో స్నానం చెయ్యడం వలన పుణ్యం కలుగుతుంది. అలాగే మౌని అమావాస్య రోజున పూర్వికులకి తర్పణం, పిండ ప్రధానం, దానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందచ్చు. వీటికి నంబంధించిన ముఖ్య విషయాలను మనం తెలుసుకుందాం.

చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే మంచిది?

చొల్లంగి అమావాస్య నాడు పూర్వికుల కోసం ఎందుకు దీపం వెలిగించాలి?

  1. మన పురాణాల ప్రకారం, అమావాస్య రోజున పూర్వికులు భూమిపైకి వస్తారు. ఈ రోజు వారసుల నుంచి జల సమర్పణ, దానాలు, పిండాలని కోరుకుంటారు.
  2. పూర్వికులకు ఆ రోజు పిండ ప్రధానం చెయ్యడం, దానాలు చెయ్యడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెప్తారు.
  3. పూర్వికులు సంతోషంగా ఉన్నట్లయితే తమ కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి.
  4. ఆ రోజు సాయంత్రం వేల పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు కనుక అలాంటి పరిస్థితుల్లో చీకటి లేకుండా దీపాలని వెలిగించడం వలన పూర్వికులు తమ లోకానికి సులభంగా తిరిగి వెళ్తారని భావిస్తారు.
  5. అలా పూర్వీకులకు దీపం వెలిగించినవారికి విశేష ఫలితాలను పొందగలరు. అందుకే అమావాస్య నాడు పూర్వికులకు దీపాలను వెలిగిస్తారు.
చొల్లంగి అమావాస్య ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే మంచిది?

ఎప్పుడు దీపాలను వెలిగించాలి, దీపారాధన ఎలా చేయాలి?

చొల్లంగి అమావాస్య రోజు సూర్యాస్తమయం తర్వాత, అనగా ప్రదోష కాలంలో పూర్వీకులకు దీపాలను వెలిగించాలి.

  1. దీపారాధన చేసేముందు ఒక మట్టి ప్రమిద తీసుకుని, శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టాలి.
  2. ఆ ప్రమిదిలో కొంచెం ఆవనూనె వేసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.
  3. దీపాన్ని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచడం మంచిది.

రాత్రి అంతా దీపాన్ని వెలిగేటట్టు చూసుకోండి. ఆవనూనె లేకుంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చెయ్యవచ్చు. మీ పూర్వీకుల ఫోటో ఉంటే దాని ముందు కూడా దీపారాధన చెయ్యొచ్చు.

పుష్య అమావాస్య శుభ ముహుర్తం..

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెలా కృష్ణపక్షంలో ఆఖరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే పన్నెండు (12) అమావాస్య తిథులలో చొల్లంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ పవిత్రమైన రోజున జపం, దానం, పూజలు చేయడం, మౌనం వంటివి పాటిస్తారు.

Leave a Reply