తెలుగు
“చేతులారా శివుని బూజింపడేని” శ్లోకం
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
ఆచారాలు అభీష్టసిద్ధులు
"భారతీయ ఆచారంలో" గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!
అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం
చక్షుర్దద్యాత్ మనోర్దద్యాత్ వాచం దద్యాచ సూనృతం |
అనుప్రజేదుపాసిత స యజ్ఞః పంచాదక్షిణః ||
ఇంటికి వచ్చిన అతిధులను ఆప్యాయంగా చూసుకుంటే యజ్...
మహా మ్రిత్యుంజయ మంత్రం
ప్రమాదల నుంచి భయాల నుంచి రక్షించే మహామృత్యుంజయ మంత్రం!
మకార మననం ప్రాహుస్త్ర కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ
తొలి ఏకాదశి విశిష్టత
వర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల తడిచి, చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని `తొలి ఏకాదశి`గా పేర్కొన్నారు. ఆ రోజున పాలేళ్లని పిలిచి, పొలం పనులని మొదలుపెట్టించేవారు.
భోగి పండుగ విశిష్టత
పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.
కనుమ పండుగ విశిష్టత
సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి కారణభూతం అయిన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకి ఈ కనుమ రోజు పూజ చేయడం జరిగింది.
పరమాత్మునికి వందనం
"వైకుంఠ౦"లో ప్రశాంతంగా సేదతీరే అవకాశం ఉండి కూడా యుగయుగములందు అవతార స్వీకరణములు చేస్తూ, తను కష్టపడుతూ చెడు నుంచి, రాక్షసుల నుంచి మనుష్యులను కాపాడుచున్న ఆ పరమాత్మున్ని "కలియుగములో" మనమే త్రికరణశుద్ధితో కూడిన భక్తి శ్రద్ధలతో ఆయనను కాపాడాలి.
వివిధ రకాల దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
ఏ దానము వలన ఎలాంటి ఫలితము పొందవచ్చో తెలుసుకోండి
సనాతన ధర్మంలో ఉన్నవారికి ఉండవలసిన లక్షణాలు
సత్యం దమః తపః శౌచం సంతోషోహ్రీః క్షమార్జవమ్l
జ్ఞానం శమో దయా ధ్యానం ఏష ధర్మ స్సనాతనః ll