కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!
అంత గొప్ప పరమాత్ముని పరిపూర్ణ అవతారం “కృష్ణావతారం”.. అటువంటి అవతారం తరువాత వచ్చే అవతారం “కల్కీ” అవతారం! ఆ అవతారం వస్తుందనేది “వ్యాస” వాఖు ప్రమాణం. వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆ పదవ అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడే చెప్పారు.
కల్కి అవతారం రాబోయే ముందు లక్షణాలు!
అసలు ఎక్కడా స్వాహాకారము, వశత్కారము వినబడవు. అంటే ఇక యజ్ఞము, యాగము అనే క్రతువులు ఉండవు. ఆ మాట ఇక వినపడదు. గోవులు విశేషంగా వది౦పబడి వాటిని తినడం లోకములో విచ్చలవిడి అయిపోతుంది. ఇక గోవులు అనేవి లేనటువంటి సమయం వచ్చేస్తుంది. వివాహ వ్యవస్ధ నిలపడదు. అందువలన వావి వరస అనేవి ఉండవు. స్త్రీలు కేశపాశములను విరభోసుకుని తిరగడమే పెద్ద విశేశమయ్యిందిగా అయిపోయి, జట వేసుకునే సాంప్రదాయం విచ్చున్నం అయిపోతుంది. తల్లితండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భార్యని చూసుకునే భర్త, భర్తని గౌరవించే భార్య ఉండరు. లోకంలో పురుషుని యోక్క ఆయుర్దాయం పద్దెనిమిది(18) సంవత్సరములకు పూర్తయిపోతుంది.
ఇది కూడా చదవండి: కలియుగం యొక్క 50 లక్షణాలు

లోకములో ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పడిపోయేట్టు క్షీణించడం మొదలయ్యాక ఆ సమయములో “శంబలా” అనే గ్రామంలో విష్ణువ్యాసుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి “కల్కి” అన్న పేరుతో శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా జన్మిస్తారు. ఆయన పుట్టడానికి కొన్ని గంటల ముందే ఆయన తండ్రి మరణిస్తాడు. పుట్టాక తల్లి మరణిస్తుంది. అప్పుడు పరశురాముడు “కల్కిని” ఒక గుహలోనికి తీసుకువెళ్ళి, అక్కడే అన్ని వేదాలు విద్యలను నేర్పి౦చి, తరువాత శంబలాకి పంపిస్తాడు. ఆశ్వధాముడు దగ్గర యుద్ద నైపుణ్యాలను నేర్చుకుని, “కల్కి” శంబలాకి
ఇరవై అయిదవ రాజుగా ఉంటాడు. అది ఎప్పుడు అంటే… కలియుగం చిట్టచివర్లో కృత యుగానికి ప్రారంభానికి మధ్యలో.
ఆయన అవతరించారని గుర్తేమిటి అంటే.. పాపులకు “భంగదర”అనే వ్యాధి వస్తుంది. అంటే ఆసనము(మలద్వారం)నందు పుళ్ళు పుట్టి నెత్తురు కారిపోతుంది. ఆలా కారి వార౦తట వారే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రభలుతాయి. పరమపున్యాత్ములయినవారు ఎవరున్నారో వారు మాత్రమే శరీరాలతో ఉంటారు. “కల్కి” భగవానుడు పరమశివుని అంశతో పుట్టిన శ్వేతాశ్వాన్ని ఎక్కి అంటే తెల్లని గుర్రం, కాషాయ పతాకాన్ని పట్టుకుని, అధర్మంతో
మిగిలినటువంటి బలవంతులైన వారు, రాజ్యాలను ఆక్రమించినవారు, అధికారానికి తగిన అర్హత లేకపోయినా
సింహాసనాలమీద కూర్చుని పరిపాలన చేసే ప్రభువులందరినీ ధునుమాడతాడు. అలా ధునుమాడిన తరువాత కలియుగం పూర్తయిపోయి కృత యుగం ప్రారంభమవడానికి జల ప్రళయం సంభవించి నీళ్ళు వచ్చి భూమండలాన్నంతా కప్పేస్తాయి.
కలియుగం చిట్ట చివరన వచ్చే అవతారం అయినా సరే,ఆయనను ఒక్కసారయిన స్మరించినా, నమస్కరించినా పాప బుద్ది పోతుంది. అంత గొప్ప అవతారం అది.