మీరు మంచి వ్యక్తిగా ఉండేందుకు, మంచి జీవన శైలిని పొందేందుకు 10 అలవాట్లు...

మీరు మంచి వ్యక్తిగా ఉండేందుకు, మంచి జీవన శైలిని పొందేందుకు 10 అలవాట్లు...

 

ప్రతీ ఒక్కరు మేము మంచిగా ఉండాలి అనే అనుకుంటారు. కాని అందుకు తగిన సాధన మాత్రం చాల మంది చేయరు. కనుక మనం ప్రతీ రోజు కొన్ని పాటించాలి. అప్పుడే మనం మన జీవితంలో ఏమి కోల్పోతున్నామో తెలుస్తుంది. మంచి జీవితం, జీవన విధానం కోసం ఈ 10 విషయాలను అలవాటు చేసుకోండి.

1. పుస్తక పఠణ౦:Related image
నకు చదవడానికి చాలా పుస్తకాలు ఉంటాయి. కల్పనలు, సైన్స్ ఫిక్షన్, స్వీయ సహాయ పుస్తకములు, ఆధ్యాత్మికం, పురాణాలు, కథలు, గొప్ప పురుషులుమ చరిత్ర మరియు అనేక ఇతర కళా ప్రక్రియలు ఉన్నాయి. మనం ఒక పుస్తకాన్ని చదివినప్పుడు, మన స్వభావాన్ని ఒక పాత్రగా ఊహించుకుని మన గురించి మనమే తెలుసుకోవచ్చు. అలానే మనం ఆ పాత్ర యొక్క కష్ట సమయాలను గురించి, వారు ఎలా  వాటిని ఎదుర్కొన్నారో, వారు ఎలాంటి పరిష్కారం చేసేవారో తెలుసుకోవచ్చు. పుస్తకాలు చదవడంతో మన వ్యాకరణం మరియు పదజాలం మెరుగవుతుంది.

2. ఇతర ఊర్ల నుంచి పరిచయాలు పెంచుకోండి:
క్కొక్క ఊర్లో ఒక్కోలా సంప్రదాయాలు, పండుగలు అనేవి ఉంటాయి. మనం వేరే ఊర్ల నుంచి పరిచయాలు పెంచుకుని స్నేహం అనేది పొందితే, వారు వాటిలో చేసే పనుల గురించి మనం వారి నుండి నేర్చుకుంటే మానసికంగా మరింత బాగుంటుంది. ఇది ఇరువురి మధ్య ఉన్న బాషబేదాలను అధిగమిస్తుంది.Related image

౩. కృతజ్ఞతను చూపించండి:
నం ఎప్పటికప్పుడు, ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి. "ధన్యవాదాలు" అనే చెప్పుకునే లక్షణం ఒక వ్యక్తి యొక్క ప్రతీరోజు వెలుగుతో నిండుతుంది. అటువంటి లక్షణం అవతలివారు మీపై గౌరవం చూపుతారు మరియు మీయొక్క జీవన మార్గం సంతోషంగా ఉంటుంది. ఆ ఒక్క "పదం" ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.

4. చర్చించండి:
మౌనంగా ఉండకుండా, ఎప్పుడు "మంచి విషయాలను" ఇతరులతో చర్చిస్తుండండి. ఎంత మీరు చర్చిస్తారో, మీరు ఇతరుల నుండి మరింత జ్ఞానం పొందుతారు. ఇది మెరుగైన వ్యక్తిగా ఉండే ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు చర్చ చేస్తున్న వ్యక్తి మీ విజ్ఞాన నైపుణ్యాలకు ఆకర్షితుడవుతాడు. ఈ నైపుణ్యం అనేది మీమ్మల్ని ఏది ఎక్కడికి తీసుకునివెళుతుందో మీకు ఎప్పటికీ తెలియదు.Related image

5. మంచితనం మరియు సహాయం:
మీ చుట్టూ ఎవరికైనా సహాయం కావాలనుకున్నప్పుడు దయ కలిగి ఉండండి. ఇది మంచి అలవాటు. మీరు దారిలో చూడండి, ఆకిలో అనారోగ్యంతో కుక్కలు కనిపిస్తాయి, బిస్కెట్లు లేదా ఆహరం కొని వాటికి పెట్టండి. రోడ్డుపై వెళ్ళడానికి వృద్ధులకు అందులకు సహాయం చెయ్యండి. మీ ప్రతీ సహాయం ఒకరకమైన మంచి భావన కలిగిస్తుంది. మీ ప్రతీ చర్య పుణ్యాన్ని మీ ఖాతాలో పడేట్టు చేస్తుంది.

6. ఆధ్యాత్మికం, వ్యాయామం: Related image
రోజువారీ "వ్యాయామం" మీమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. అనారోగ్యం వచ్చే ముప్పును తగ్గిస్తుంది. భవిష్యత్తులో మీరే గర్వపడతారు, ఎందుకంటే మీ జీవితం ఔషధాలపై ఆధారపడదు కనుక. అలానే ఆధ్యాత్మిక జ్ఞానంతో "మానిసాక వ్యాయామం" అనేది అయి మానసికంగా దృడత్వం అనేది పొందుతారు. మానసిక ఆరోగ్యమే మంచి జీవనానికి మూలం.

7. అభినందించుకోండి,  పలకరించండి:
యట ఎందరో తినడానికి తిండి దొరకక, ఉండడానికి చోటు లేక, కనీసం చిన్న చిన్న ఆనందాలు, మాట్లాడడానికి  ఒకరు కూడా దొరకక ఇబ్బందిపడుతున్నారు. మీకు ఈ జీవితంలో అటువంటి లోటు లేకుండా ఉన్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. స్నేహితులను తరచూ పలకరిస్తుందండి, వీలైన సమయంలో వారి వారి కుటుంబాలను కలుస్తుండండి. పైవాడికి కృతజ్ఞత ఎల్లప్పుడు తెలుపుకోండి. ఉన్నవాటితో తృప్తి చెందండి. లేనివాటి కోసం Related imageదిగులుపడకండి. 

8. ప్రోత్సహించండి:
కరికి ఒక పని చేయడం రానప్పుడు "ప్రోత్సాహించండి" కాని నిరుత్సాహపరచవద్దు. అది ముమ్మాటికి చెడు అలవాటు. ఒక చిన్న ప్రోత్సాహమే అవతలివారిలో ఎంతో మానసిక బలం నింపుతుంది.
ఒకరు తమ పరీక్షలో విఫలం అయితే, అతనిని  ఇంకా బాగా చదువుకునేలా ప్రోత్సాహించి మళ్ళీ పరీక్షలో విజేతగా నిలిచేలా కనీస ప్రయత్నం చేయండి.

9. నవ్వండి:
ల్లప్పుడూ సంతోషంగా ఉండండి, అందరిని అలానే ఉంచండి. మీరు ఎప్పుడు భయపడినా జీవితం అనే ఆటలో ఓడిపోయే దిశకు వెళ్ళిపోతారు. సవాళ్ళని ఎదురుకోండి. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. ఆ ఒక్క లక్షణం ఎన్నో మంచి మార్పులకు కారణం అవుతుంది.

10. మీ ప్రయాణం ఆపవద్దు:
మీరు కోరుకున్నదాన్ని పొందలేకపోయినందున దానినే తలుస్తూ, ఎవరో ఏదో అన్నారని దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోవద్దు. జీవితంలో మీ ప్రయాణం ఆపకుండా వెళ్ళడం నేర్చుకోండి. మనం అనుకున్నది దొరకలేదు అంటే దానికన్నా మరింత విలువైనది మనకోసం భవిష్యత్తులో ఉందని తెలుసుకోండి. మనకు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరు ఏదైనా అన్నా మన "విజయం"తో వారికి సమాధానం చెప్పండి. కానీ మనము ముందుకు సాగితేనే ఆ అవకాశాలు అందుకోవచ్చు.