శతమానం భవతి శ్లోకం

శతమానం భవతి శ్లోకం

"శతమానం భవతి శతాయుః
పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”

అందరికి సుపరిచితమైన వేద మంత్రం. ఋషులు మన కందిచిన వేదాలలో నుండి గ్రహించబడినది. వివాహ మైన లేదా ఏ హందూ శుభ కార్యమైన ఆశీర్వచనంతో ముగించటం ఆనవాయితీగా వస్తోంది.

నూతన దంపతులను నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించమని క్లుప్తంగా అర్థం.
ఈ మంత్రానికి అంత శక్తి ఉందాయని సందేహం కలగక మానదు. నిష్టాగరిష్టులైన ఋష్యాదులు, పురో హితులు, విద్య భోదించిన గురువులు, జన్మ నిచ్చిన తలిదండ్రులు ఇతర పెద్దలు ఇచ్చిన ఆశీర్వచనాలు, దీవెనలు అత్యంత శక్తి వంతమైనవి. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఆశీర్వచనం పొందుట ఆవశ్యకరం.

సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడింది. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి.

శతమానం భవతి అని వివాహమే కాక ఇతర సందర్భాలలో కూడా ఆశీర్వదించవచ్చును. ఆశీర్వదించ వలసివచ్చినపుడు చాలా మందికి సందర్భోచితమైన మాటలు రాక అక్షతలు వేసి ఊరుకుంటారు. పసి పిల్లలను చిరంజీవ, ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యా ప్రాప్తిరస్తు యని దీవించ వచ్చును. సుమంగళియైన స్త్రీలను దీర్ఘ సుమంగళీ భవ యని దీవించ వచ్చు.

ఆయుష్మాన్ భవ అనేది ఉత్తమమైన ఆశీర్వచనం. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు లేనపుడు ఎంతటి సంపదలున్న యేమి ప్రయోజనం.

చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పినట్లు ఈ రోజుల్లో పెళ్ళి, జన్మదినం వంటి శుభ కార్యాలలో శ్రద్ధ అంతా ఫొటోలమీదనే ఉంటుంది. ఫొటోలకోసం మళ్ళీ తాళి కట్టినట్లు భంగిమలు పెట్టించిన సందర్భాలు సర్వ సాధారణం. వచ్చిన అతిథులు కూడ భోజనం చేసి నూతన దంపతులను ఆశీర్వదించకుండా వెళ్లి పోయే సందర్భాలు సర్వసాధారణం.

శతమానం భవతి” అంటూ పెద్దల ఆశీస్సులు పొందటం ఎంతైనా శ్రేయస్కరం.