నలదమయంతుల చరిత్ర - భాగం 1

నలదమయంతుల చరిత్ర..

కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య
చ ఋతుపర్ణస్య రాజరిష్యేహే కీర్తనం కలినాశనం..

ఈ నల దమయంతుల చరిత్ర భక్తితో వింటే కలిదోషాలు తొలగిపోతాయి. సాక్షాత్తు కలిపురుషుడే నలుడికి ఈ వరం ఇచ్చాడు. ఎవరైనా ఈ నీ కథని విన్నా, ఆదర్శ దంపతులైన మీపేర్లు, రాజర్షి అయిన ఋతుపర్ణుడి పేరు తలచుకున్నా తక్షణం వారిని విడిచిపెడతాను అని నలుడికి వరం ఇచ్చి అదృశ్యమయ్యారు. కనుక ఈ కథని తప్పక విని తరించండి. వినిపించి తరింపజేయండి. తద్వారా విన్నందు వలన మీకు కలిపురుషుడి బాధ తొలగుతుంది. వినిపించినందుకు పుణ్యం మీకు వస్తుంది..