పురుషుడు భార్యని ఎలా చూసుకొవాలి?

పురుషుడు భార్యని ఎలా చూసుకొవాలి?

పురుషుడు భార్యని ఎలా చుసుకోవాలి?


స్త్రీ వివాహమైన వెంటనే కోటి ఆశలతో అత్తవారింట్లొ అడుగుపెడుతుంది. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, స్నేహితులను, బంధువులను అందరిని విడచి వివాహము చెసుకొన్న భర్తపై నమ్మకంతో అత్తవారింట్లొకి అడుగుపెడుతుంది. భర్త ,భార్యని భద్రంగా, రక్షణగా మాత్రమే చూసుకొంటాడు. కానీ భార్య భర్త గౌరవాన్నీ, సంతానాన్నీ, ధనాన్నీ, కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహుతురాలిగా, మంత్రిగా, వీటన్నింటికి మిoచి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుది.
అందువలన భార్యను హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు.
భార్య వడ్డించిన పదార్ధాలను తినకుండా విమర్శించరాదు.
ఇంటిని భార్య జైలులా భావించే పరిస్తితులు లేకుండా వారానికి ఒక్కసారైనా బైటికి తీసుకెళ్ళాలి. 
పిల్లలతొ సరళ సంభాషణలు చేయాలి.
పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండరాదు. 
ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలని గమనించి కలవాలి. 
భార్యకి ఎంతో కొంత ఆర్ధిక స్వేచ్హ ఇవ్వాలి. 
ఆమె అభిప్రాయలను గౌరవించాలి.
భార్యను పరులముందు అవమానించే విధంగా ప్రవర్తించరాదు.
భార్యను ఇంటి యజమానిరాలుగా చూడాలి గాని, అనుమానించే వ్యక్తిగా చూడగూడదు.
భర్త తను తుదిశ్వాస వదిలేవరకు, భార్యను కంటికి రెప్పలాగ, సంతొషంలోనూ, బాధలలోను చేదొడువాదోడుగా ఉండాలి. 
భర్త తను మరణించిన తరువాత గూడ, భార్య ఇతరుల మీద ఆధారపడకుండ, కష్ఠాలు పడకుండా ముందు జాగ్రతలు తీసుకొని ఆమెకు తగిన భద్రత మరియు జీవనోపాది కొరకు తగిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయలి.

Source: Web