గోవింద గోవింద యని కొలువరే - అన్నమాచార్య కీర్తన

Download Audio File MP3: http://bit.do/eRmG5

గోవింద గోవిందయని కొలువరే
------------------------------------

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

హరియచ్యుతాయని పాడరే 
పురుషోత్తమాయని పొగడరే |
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు ||
(.........గోవింద గోవిందా ...... గోవింద గోవిందా ......)
పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే |
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు ||
(.........గోవింద గోవిందా ...... గోవింద గోవిందా ......)

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే |
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు ||
(.........గోవింద గోవిందా ...... గోవింద గోవిందా ...... )