శ్రీకృష్ణుడిని నిందించవద్దు

శ్రీకృష్ణుడిని నిందించవద్దు

#ఋషివర్య #శ్రీకృష్ణపరమాత్మ

శ్రీకృష్ణుడిని నిందించేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో హిందువులు కూడా ఉన్నారు. కొంతమందిని నేను చూసాను కూడా. సరైన జ్ఞానం లేకపోవడమే అందుకు కారణం.

ఏ మాట అన్నా ఒక్కటే విషయాన్ని పట్టుకుని వేలాడతారు,పదహారు వేల మంది భార్యలు అని.

ఆయన లీలలు సామాన్య బుద్దికి అందనివి, మాములు మనసుతో అర్ధం చేసుకోలేనివి. "భాగవతం" ఎంత పెద్దదో ఆ ఈశ్వరుడికి కూడా తెలియదని మన పురాణాలు చెప్పడం మనం గమనించాలి. అందుకే జీవితంలో అనకూడని మాట ఏమిటంటే "భాగవతం అయిపొయింది అని".

• స్వచ్చమయిన ప్రేమను మనపై చూపేవాడే "శ్రీ కృష్ణుడు"!
• నీకు తోడుగా ఎవరు లేకపోయినా నేను నీకోసం ఉన్నాను అని భుజాన్ని తట్టేవాడే కన్నయ్య.
• ఎదురుగా ఉన్నది శరీరంగా కాకుండా ఉన్నది ఒక ఆత్మ అని చూసేవాడే ఆ పరమాత్ముడు. 
• కష్టాలలో కూడా తన చిలిపి చేష్టలతో నవ్వించేవాడే ఆ వెన్న దొంగ.
• తన వేణువుతో మనసు ఉల్లాసపరిచేవాడే ఆ గోపాలనందనుడు. 
• పదహారు వేల మంది గోపికలు కూడా మాకు ఎవరూ లేకపోయినా కృష్ణుడు ఒక్కడు మా జీవితాలలో ఉంటే చాలు అనుకునేంతగా భరోసా తెచ్చుకున్నవాడే ఆ అందరి వాడు.
• కాల చక్రం నుంచి, ఈ సంసార దుఖాల నుంచి విముక్తిని మోక్షాన్ని పొందేందుకు జగద్గురువుడై యుగయుగాలకు "శ్రీమద్బగవద్గీతని" సర్వ ఉపనిషత్తుల సారాన్ని కలిపి భోదించినవాడే ఆ పరమాత్ముడు"
• ఆకరికి కర్మకి కూడా తలొంచినవాడేనయా ఆ శ్రీమన్నారాయణుడు 

అందుకే ఆ పరమాత్ముని పాదపద్మములపై మన మనసుని ఎల్లప్పుడు ఉంచాలి గాని ని౦దించకూడదు!