“ఆత్మావైపుత్రనామాసి“ శాస్త్రీయత ఏమిటి?

“ఆత్మావైపుత్రనామాసి“ శాస్త్రీయత ఏమిటి?

“ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది. మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు. మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?

రచన: Kiran MVA