తెలుగు, మాసములు

మాఘ మాసం విశిష్టత

మాఘ మాసం విశిష్టత
Views: 3

మాఘ మాసం విశిష్టత

హిందూ పురాణాలను అనుసరించి చాంద్రమానం ప్రకారం 11వ మాసమే ఈ మాఘమాసం. ‘ మఘం’ అనగా సంస్కృతంలో ‘ యజ్ఞం’ అని అర్థం. అంటే పాపాలను నశింపచేయునదని అర్థము. యజ్ఞ యాగాది క్రతులకు ఈ మాఘ మాసాన్ని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీక మాసం తర్వాత అంతా ప్రశస్తం కలిగిన మాసం ఈ “మాఘమాసం” .

మాఘ మాసం విశిష్టత

మాఘస్నానం ఎందుకంత ప్రత్యేకమైనది??

భారతీయులు మాఘ మాస స్నానాన్ని పవిత్రస్నానంగా భావిస్తారు. కార్తీకంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో, మాఘ మాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ఈ మాఘ మాసంలో స్నాన విశిష్టత గురించి చెప్పాలంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయ సంధ్యల్లో స్నానాలు ఆచరించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ మాఘ స్నానాలు సకల దోషాలను క్షయం చేస్తాయని హిందువుల నమ్మకం. మాఘ మాసం స్నాన మహత్యాన్ని బ్రహ్మాండపురాణం ఈ విధంగా తెలియజేస్తుంది. మృకండుముని, మనస్వినుల మాఘమాస స్నాన పుణ్యఫలమే వారి పుత్రుడైన మార్కండేయని అపమృత్యు దోషం నుండి రక్షించిందని పురాణ గాధ. ఈ మాసంలో సూర్యుడు ఉండే రాశిని బట్టి ఉషః కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. ఆ సమయంలో సూర్యుని కిరణాల్లోని అతినీలలోహిత – పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. సూర్యోదయ కాలంలో చేసే స్నానాలు చాలా ఆరోగ్యకరమైనవని, ఆ సమయంలో చేసే స్నానాలు ఎంతో శ్రేష్టమని పేర్కొన్నారు.

అని శ్లోకాన్ని పఠిస్తూ బావులు, చెరువులు , నదుల్లో స్నానం చేయడం ప్రశస్తం. ఈ ప్రదేశాల్లో స్నానం కుదరని పక్షంలో కనీసం గృహంలోనైనా స్నానం చేస్తున్నప్పుడు గంగ, యమునా, గోదావరి , సరస్వతి , కావేరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ స్నానం ఆచరించాలి.
మాఘమాసంలో తెల్లవారుజామున చేసే గృహ స్నానం 6 సంవత్సరాల ఆఘమర్షణ స్నాన ఫలాన్ని, బావినీటి స్నానం 12 సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణమని, నదీ స్నానం చాతుర్గుణమని, మహానది స్నానం శతగుణమని, గంగానది స్నానం సహస్రగుణం అని, త్రివేణి సంగమస్నానం శతగుణ ఫలాన్ని ప్రసాదిస్తాయని పురాణ సూక్తి. ఇలా మాఘ మాస స్నానంలో పవిత్ర తీర్థాలను స్మరిస్తూ పాపనాశనం కోరుకుంటూ స్నానం చేయాలని సంప్రదాయం తెలియజేస్తుంది. స్నాన సమయంలో ‘ ప్రయాగ’ ను స్మరించినంత మాత్రాన ఉత్తమమైన ఫలం లభిస్తుందని హిందువుల నమ్మకం. మాఘ పూర్ణిమను ‘మహామాఘి ‘ లేక ‘ మహామాఘం ‘ అని కూడా అంటారు. ఎంతో మహిమాన్వితమైన ‘ పూర్ణిమ’ స్నానాలకు, దానాలకు, జపాలకు అనుకూలమైన రోజు.

ఈ రోజున చేసే సముద్ర స్నానం ఎంతో మహిమాన్వితం . స్నానానంతరం దేవాలయ దర్శనం మంచిది. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన ఉత్తమం. మాఘ మాసంలోని ఆదివారాలు సూర్య భగవానుని ఆరాధించుటకు ఎంతో ప్రశస్తమైనవి. ప్రతివారు స్నానానంతరం సూర్యనారాయణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఉపనయనం అయిన వాళ్ళు మంత్రంతో అర్ఘ్యం సమర్పిస్తారు. అలా కుదరని పక్షంలో సూర్యోదయ పూర్వం సూర్యుడి నామాలు చెబుతూ ‘అర్ఘ్యం’ ఇవ్వవలెను. ప్రతి ఆదివారం వేకువజామున ఖచ్చితంగా సూర్య భగవానుడిని ఆదిత్య హృదయంతో స్తుతించాలి . అన్ని రకాల అనారోగ్యాలు నశిస్తాయి. సూర్యోపాశన వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్ర వచనం. ఈ మాసంలో ఎన్నో విశేషమైన రోజులు ఉన్నాయి .. అవి రథసప్తమి, వసంత పంచమి, వర చతుర్దశి, వరుణషష్ఠి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి మరియు మాఘపూర్ణిమ.

What’s your response?
0 responses
Love
Love
0
Smile
Smile
0
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply