శ్రీరాముని జీవితానికి దగ్గర పోలికలతో ఉండే కాకరాట్ అనే కార్టూన్ పాత్ర
రచన: ఋషివర్య
శ్రీరామాయణం నుంచి “శ్రీరాములవారి” జీవితానికి దగ్గర పోలికలతో ఉండే జపాన్ కార్టూన్ “డ్రాగన్ బాల్ జి”లో ప్రధాన పాత్ర “కాకరాట్”!
చిన్నప్పటి నుండి ఈ కార్టూన్ ని చూస్తూ పెరిగాను.. ఈరోజు ఋషివర్యగా మీ ముందు ఉన్నాను అంటే ఈ “కాకరాట్” పాత్ర నన్ను ఎక్కువగా ప్రేరణ చేసింది అని చెప్పవచ్చు.
ఈ కార్టూన్ చలనచిత్రం 1989వ సంవత్సరంలో జపాన్ లో ప్రసారం మొదలయ్యింది. 16వ శతాబ్దానికి చెందిన పురానతన చైనీయుడు అయిన ‘వు చెంగెన్’ వ్రాసిన Journey to the west నవల ఆదారంగా చేసుకుని ఈ అద్భుతమయిన పాత్రను తయారుచేసారు.
ఇక పాత్రల పోలికలను చూస్తే…
కాకరాట్: తాను ధర్మానికి, న్యాయానికి, మాటకి కట్టుబడి ఉంటాడు.
శ్రీరాముడు: తానే ధర్మం, ధర్మమే తాను అనే అవతారం రాములవారిది.
కాకరాట్: తాను దుష్టుల బారి నుండి లోకాన్ని కాపాడేందుకు అవసరాన్ని బట్టి 12 రకాల రూపాలను మార్చుకోగలడు.
శ్రీరాముడు: విష్ణు అంశ కనుక లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలాను స్వీకరించారు.
కాకరాట్: సయాన్ వంశానికి చెందిన వ్యక్తి. వీరి ధర్మం, యుద్దాలు చేసి ప్రజలను కాపాడడం.
శ్రీరాముడు: సూర్య వంశానికి చెందిన వ్యక్తి. క్షత్రీయులు కనుక వీరి ధర్మం కూడా యుద్ధాలు చేసి ప్రజలను, రాజ్యాన్ని కాపాడుకోవాలి.
కాకరాట్: చిన్న వయసులోనే తన స్నేహితుడితో ఒక వృద్దుడి దగ్గర యుద్ద నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండేవాడు.
శ్రీరాముడు: చిన్న వయసులోనే లక్ష్మణునితో విశ్వామిత్రుడి వెంట వెళ్లి ఎన్నో విద్యలు నేర్చుకున్నారు.
కాకరాట్: గురువుగారు విద్య నేర్పే సమయాలలో కొన్ని ప్రత్యేక శక్తులు ఇచ్చేవారు.
శ్రీరాముడు: విశ్వామిత్రుడు కూడా రామలక్ష్మనులకి కొన్ని ప్రత్యేక వరాలు ఇస్తూ ఉండేవారు.
కాకరాట్: వృద్ద గురువుగారు కాకరాట్ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు పోట్లాడే ఒక ఆటకు పంపుతారు.
శ్రీరాముడు: విశ్వామిత్రుడు రాముడిని జరుగుతున్న ఒక యజ్ఞానికి భంగం వాటిల్లకుండా కాపలాగా ఉండేందుకు పంపుతారు.
కాకరాట్: పోటీ సమయంలో ఒక స్త్రీతో పోరాటం చేయవలసి వస్తుంది. ఇద్దరి నైపుణ్యాన్ని ఒకరికి ఒకరు మెచ్చి వివాహం చేసుకుంటారు.
శ్రీరాముడు: స్వయంవరంలో రాములవారి నైపుణ్యం ద్వారా ఆయన, సీతమ్మను వివాహం చేసుకుంటారు.
కాకరాట్: తన భార్యని క్షణం కూడా వదిలి ఉండలేని ప్రేమ.
శ్రీరాముడు: సీతారాములు ఒకరినొకరు క్షణం కూడా వదిలి దూరంగా ఉండలేనంత ప్రేమ.
కాకరాట్: అనుకోని పరిస్థితిలో దంపతులు అడవిలో నివసించాల్సి వస్తుంది.
శ్రీరాముడు: రాములవారు, సీతమ్మ అరణ్యవాసానికి వెళతారు.
కాకరాట్: అడవిలో నివశిస్తున్నప్పుడు, మాట్లాడే కొన్ని జంతువులతో స్నేహం కుదురుతుంది.
శ్రీరాముడు: రాములవారికి ఆంజనేయస్వామి, జాంబవంతుడు ఇలా పలురకాల మంది పరిచయం అవుతారు.
కాకరాట్: ఏదైనా విషయం ఉంటే స్నేహితులతో చర్చిస్తూ ఉంటాడు. చర్చించకుండా నిర్ణయాలు తీసుకోడు.
శ్రీరాముడు: రాములవారు కూడా రోజూ స్నేహితులతో గడుపుతూ తగిన విషయాలపై చర్చిస్తూ నిర్ణయాలు తీసుకుంటారు.
కాకరాట్: ఇతనికి ఇద్దరు పురుష సంతానం.
శ్రీరాముడు: రాములవారికి లవకుశ ఇద్దరు పురుష సంతానం.
కాకరాట్: శత్రువుల నుంచి కొందరు నెమ్మదిగా తనకి స్నేహితులుగా మారతారు.
శ్రీరాముడు: శత్రువుల నుంచి సుగ్రీవుడు, విభీషణుడు మొదలయిన కొందరు నమ్మిన బంటుగా ఉంటారు.
కాకరాట్: ఒక శత్రువుని ఓడించేందుకు ఎంతో దూరం ప్రయనించవలసి వచ్చింది.
శ్రీరాముడు: రావణుడిని ఓడించేందుకు చాలా దూరం ప్రయాణించి వారధి నిర్మించారు.
ఇలా ఎన్నో విషయాలలో దాదాపుగా ఈ కార్టూన్ పాత్ర కాకరాట్ జీవిత ప్రయాణం, రామాయణం నుంచి శ్రీరాముని జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది.
నచ్చితే మీయొక్క భావనలను కామెంట్ చేసి పంచుకోండి!