నాసదియసూక్తం
చాలా దూరం ప్రయాణం చేసాం. చాలా ప్రయాసపడ్డాం. చాలా ప్రశ్నలు అడిగాం. చాలా అభిమతాలు (Theories) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు పరిశీలించచాం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, న్యూటన్, మేక్‌స్వెల్, అయిన్‌స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించాం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహస్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసాం.