ఆధ్యాత్మికత అంటే ఏంటి?
ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు.