ధ్యానం ఎలా చేయాలి మరియు ప్రయోజనాలు
‘ధ్యానం’ అనగానే దాని గురించి లోకంలో రకరకాల తప్పుడు అభిప్రాయాలున్నాయి. మెడిటేషన్ అనే ఇంగ్లీషు మాటకు పెద్ద అర్థమేమీ లేదు. మీరు కళ్లు మూసుకొని కూర్చుంటే చాలు అది మెడిటేషన్ అయిపోతుంది. మీరు కళ్లు మూసుకొని కూర్చొని కూడా చాలా పనులు చేయవచ్చు. దానికి ఎన్నో కోణాలున్నాయి. మీరు జపం చేయవచ్చు, తపం చేయవచ్చు. ధారణ చేయవచ్చు, ధ్యానం, సమాధి, శూన్యం ఏదైనా చేయవచ్చు. లేదా అలా కూర్చొని నిద్రించే విద్యలో ప్రావీణ్యం సాధించవచ్చు. అంటే మెడిటేషన్ అనే మాటకు అర్థమేమిటి?