తెలుగు, పండుగలు

ఉగాది పచ్చడి తయారీ విధానం

ఉగాది పచ్చడి తయారీ విధానం
Views: 5

ఉగాది (Ugadi 2025) తెలుగు సంవత్సరం యొక్క తొలిరోజు అని అర్థం. ఆంగ్ల దేశాల్లో జనవరి 1కి ఎంత ప్రాముఖ్యత ఉందో, తెలుగు రాష్ట్రాల్లో ఉగాది (Ugadi) కి అంత ప్రాముఖ్యత ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉగాది పర్వదినాన్ని వేడుకలా జరుపుకుంటారు. ఆ రోజు ఇష్ట దైవాన్ని పూజించుకుని ప్రసాదంగా ఉగాది పచ్చడి తయారు చేసుకుని (Ugadi pachadi) తింటారు. ఉగాది పచ్చడి (Ugadi Pickle) యొక్క తయారీ కాలాన్ని బట్టి మారుతూ ఒక్కొక్కరూ ఒక్కో రకంగా తయారుచేస్తుంటారు .అయితే దానిలో ఆరు రుచులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. సంవత్సరంలో ఎదురయ్యే మంచి చెడులు మరియు కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి తయారీ విధానం చూద్దాం..

ఉగాది పచ్చడి తయారీ విధానం

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

మామిడికాయ1
వేప పువ్వు1/2 కప్పు
సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు1/2 కప్పు
కొత్త చింతపండు100 గ్రాములు
కొత్త బెల్లం100 గ్రాములు
మిరపకాయలు2
అరటిపండు1
చెరకు రసం1/2 కప్పు
ఉప్పుసరిపడేంత
నీళ్లుసరిపడేంత

అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.

ఉగాది పచ్చడి తయారీ:

వేపపువ్వుని కాడల నుంచి వేరు చేసి పెట్టుకుని, చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల అలా నే ఉంచిన తర్వాత దాని గుజ్జును వేరు చెయ్యాలి. మామిడికాయ, మిరపకాయలు, కొబ్బరిని మరియు మిగతా పళ్లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. చెరకు రసం మరియు తురిమిన బెల్లాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. అంతే.. ఉగాది పచ్చడి సిద్దం!

Leave a Reply