కనిపించే పెద్ద గీత – సీత | దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ
లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే, కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !