కలియుగ లక్షణాలు – శివపురాణం
ఇది యుగం కలియుగం. కలిపురుషుడి ఉత్పత్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది! "క్రుద్దుడు" అనబడే వాడు "హింస" అనబడే తన తోడబుట్టిన చెల్లెల్నే వివాహమాడాడు. వారికి కలిగిన కుమారుడే "కలిపురుషుడు". అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది.
"ధర్మమా"! అంటే ఏమిటి? అనేవాడే కలిపురుషుడు. అటువంటి వాడు కలియుగ పాలకుడు అయితే ఇంకెంత అధర్మంగా పలిస్తాడో ఆలోచించండి.