మనం సంకల్పం అని ఒకటి చేస్తూఉంటాం. ప్రతీ రోజూ పూజ చేసేటప్పుడు "దేశకాలసంకీర్తనమూ" అంటారు.
అందులో "భరత వర్షే, భరత ఖండే" అని చెప్తూంటం. దేశమూ, కాలమూ ఈ రండూ ప్రధానంగా దేనికొరకు అంటే ధర్మానుష్ఠానం కొరకు.
"సనాతన ధర్మం".... ఈ పదం వింటేనే ఏదో తెలియని ఊహలోకి వెళ్ళిపోతా౦. ఎందుకంటే "సనాతన ధర్మం" అనేది మతం అని ఎప్పుడూ అనుకోవద్దు.. అది జీవితం! "భరతఖండం"లో పుట్టిన ప్రతీ మనిషి వేదాన్ని ప్రమాణంగా స్వీకరిస్తూ ఊపిరి తీసుకుంటాడు.