ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగమవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం వల్ల, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. ఈ దురుపయోగం కారణంగా అందరిలో ఎంత గందరగోళం ఏర్పడిందంటే అందరూ దానివల్ల ప్రయోజనమేమైనా ఉందా, లేదా అని సందేహించడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా విషయము తెలియాలంటే, అప్పటివరకు మనిషి ఆ విషయంమీద చేసిన పరిశోధనలని తెలుసుకొని దానిని ఒక క్రమబద్ధీకరణలో అర్థం చేసుకోవాలి. అప్పుడే మనిషి కొత్త విషయాలను కనుగొనగలడు.
కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే. కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని, మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!
మూర్ఖత్వానికి, అజ్ఞానికి అనేక రూపాలు..... కానీ జ్ఞానికి ఉన్నది ఒకే రూపం ఎటువంటి విషయాన్నైనా స్వచ్చమైన మనస్సుతో తెలుసుకోవడం లేదా విశ్లేషిస్తూ బుద్దిపూర్వకంగా నేర్చుకోవడం !
కోరికచే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మఫలితాలు విడిచి పెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన, తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.
భక్తికి కావాల్సింది నిర్మలమయిన "మనసు". మీరు ఋషులను, మునులను గమనిస్తే మనసును కేంద్రీకరించి ప్రశాంతమయిన ప్రపంచంలో ఉంటూ ఉంటారు.
మరి యాంత్రిక జీవనంలో కుదురుతుందా? కుదురుతుంది!