ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి

ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి
Views: 1

మీ అందరికి చిన్ని చిన్ని విషయాలతో “వైదిక మార్గంలో” సులువుగా వెళ్లేట్టు చేయడమే “ఋషివర్య” యొక్క కర్తవ్యం కనుక ఈ విషయాన్ని తప్పకుండా ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి మీరు.

“భక్తి”ని భారంగా కాకుండా సులువుగా చేసుకుని అంతటా బ్రహ్మమును చూస్తున్నవాడే నిజమయిన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అని అర్ధం!
మరి అది ఎలా కుడురుతుందండి?

ఆధ్యాత్మిక మార్గాన్ని సులభం చేసుకోండి

భక్తికి కావాల్సింది నిర్మలమయిన “మనసు”. మీరు ఋషులను, మునులను గమనిస్తే మనసును కేంద్రీకరించి ప్రశాంతమయిన ప్రపంచంలో ఉంటూ ఉంటారు. మరి యాంత్రిక జీవనంలో కుదురుతుందా? కుదురుతుంది!

❌ఆర్భాటాలు, ఒకటి ఆశించి ఉండడం, వివిధ విషయాలపై, రాగద్వేషాలపై అనురక్తి కలిగి ఉండడం చేత భక్తి మార్గంలో మీరు ఉన్నారు అనుకుంటే అది ముమ్మాటికి అసాధ్యం. భక్తిని “నీరు” అనుకుంటే, అటువంటి మనసు కలిగిన వాళ్ళు ఆ నీటిపై గాలి ఎటు వీస్తే అటు తేలుతూ వెళ్ళిపోయే “ఆకులాంటి” వారు అనేది నా మాట.

కలియుగంలో తరించటానికి సులువైన మార్గాలు అనేకం ఉన్నాయి. అటువంటివి మనం తెలుసుకోవాలి. వాళ్ళు వీళ్ళు చెప్పేవి కాకుండా ఒక్కరిని మీ గురువుగా, లేదా ప్రోత్సహించే వారిని అనుసరించేట్టు మీరు ముమ్మాటికి ఉండాలి. వాళ్ళ యొక్క మాటల చేత అప్పుడే మనసు రకరకాల మర్గములోకి వెళ్లి కలుషితం మరియు గందరగోళంలో ఇరుక్కుపోకుండా ఉండి భగవంతుని యందు విశ్వాసాన్ని సులువుగా పెట్టడానికి వీలు ఉంటుంది.

అందుకే పది ముఖ్యమయిన ఉపనిషత్తుల్లో మొదటిదైన “ఈశావాస్యోపనిషత్” మన యొక్క మంచిని కోరి ఒక అద్భుతమయిన రహస్యం చెబుతుంది.

✔️ఎటువంటి ఆలోచనా లేనప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అటువంటి నిర్మలమైన మనసే ఈశ్వరుని యందు పెట్టేందుకు వీలు ఉంటుంది సుమా! మనసు అలా ఉన్నందుకు ఇక చెడుకి చోటు ఉంటుందా? అందుకు వారికి ఆయన

“సులభః సువ్రతః సిద్ధః” అంటే.. “సులభుడు”! వారి వెనుకే దగ్గరగా ఉంటాడు.

❌కోరికల వెంట ఉండే మనసుకు కలుషితమై ఉంటుంది. చేడుగుణములు ఉండుటం చేత అటువంటి మనసు కలిగిన వారికి ఆయన “దుర్లభః దుర్గమో దుర్గః” అంటే.. “దుర్లభుడు”. దూరంగా ఉండడమే కాకుండా కన్నెత్తి కూడా చూడడు.

♥కనుక భక్తికి కావలసినది శ్రద్ధ, శాంతి అనేది ప్రతీ ఒక్కరికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు! అటువంటి వాళ్ళే ధన్యులు!

Leave a Reply