ఆధ్యాత్మికం, తెలుగు

“ధీర” అని వీరిని మాత్రమే అంటారు!

“ధీర” అని వీరిని మాత్రమే అంటారు!
Views: 1

సహనాన్ని పరిక్షించే పరిస్థితులచేత తన మనసును కలవరపడనివకుండా లేదా భావోద్వేగాల ద్వారా మనస్తాపానికి గురికాకుండా అన్నింటిని అధిగమించే వారిని మాత్రమె “ధీర” అని పరిగణిస్తారు!

గవద్గీతను   పూర్తిగా అభ్యసించలేక పోయినా అందులో ఒక్క శ్లోకం తీసుకొని మనం నేర్వగలిగినా అది మన జీవితానికి మహత్తర ఉపకారం చేస్తుంది. భగవధ్గీతలో శ్రీకృష్ణుడు ధీరుడి లక్షణాలు చెప్పాడు. ధీరుడంటే మంచి బుధ్ధిమంతుడు అని అర్ధం. బుధ్ధిమంతుడెప్పుడూ కష్టాలను చూసి కదిలిపోడు సుఖా:లని చూసుకొని పొంగిపోడు, ఐతే ధైర్యం కలవాడిని ధీరుడు అంటారు, దైర్యం అంటే? ధైర్యం అంటే గట్టిగా నిలబడటం అని కాదు అర్ధం,ఎటువంటి సమస్య ఎదురైనా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం సమస్యలకి బెదిరి పారిపోకుండా ఉండగలగడం. ధైర్యంతో నిలవగలగడానికి ఏమి చేయాలి? ఇది అర్జునుడి ప్రశ్న. దానికి రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు 15వ శ్లోకంలో, అసలు మానవుడి కి అదే ప్రధాన లక్షణం అని మనం తీసుకోవచ్చుకూడా.  ఏలక్షణాన్ని బట్టి ఒక వ్యక్తిని మనిషి అంటాం? ఒక సింహాన్ని గర్జనని బట్టి గుర్తిస్తాం,  ఏనుగుని ఘీంకారాన్ని బట్టి గుర్తిస్తాం, ఒక కోతిని దాన్ని శబ్ధాన్ని బట్టి ఒక కుక్కని దాన్ని శబ్ధాన్ని బట్టి గుర్తిస్తాం.  మనిషిని దేన్ని బట్టి గుర్తించాలి? మానవుడికి లక్షణమేమి? భగవధ్గీతలో 2వ అధ్యాయం 15 వ శ్లోకంలో భగవంతుడు మానవ జాతికి ఒక లక్షణాన్ని ప్రసాదించాడు. పదకొండువేల సంవత్సరాలకాలం తాను రాముడిగా చేసిన ఆచరణకి ఒక శ్లోక రూపాన్ని కల్పించి భగవద్గీత లో కృష్ణావతారంలో శ్రీ కృష్ణుడు ఉపదేశంచేసాడు. అది ధీరుడు కావటం ఐతే ఎలా ధీరుడు అవుతాడో దాంట్లో తాను చెప్పాడు. మనందరికి ధైర్యం కావాలని ఉంటుంది. మనం ధీరుడిగానే గుర్తింపు పొందాలని ఉంటుంది కాని ఎట్లా? శ్లోకాన్ని మనం అందరం ముందు నేరుద్దాం,దాని అర్ధాన్ని ఏమి చెప్పాడో గుర్తిద్దాం,దాన్ని ఆచరించే ప్రయత్నంచేద్దాం.

కొత్త కారు కొనుక్కున్నాం, బ్రహ్మాండంగా ఒక చోటికి వెళ్ళాలి అని ప్రయాణం ప్రారంభం చేసాం, వెళ్ళిపోతున్నాం, ఆ ముందు రోజో, తరువాత రోజో బాగా వాన కురిసింది కాబోలు రోడ్డంతా బురద బురద అయ్యింది. ఈ కారు వెళ్ళుతుంటే ఈ కారు చెక్రాల ఒరిపిడికి బురద ఎగరడం ప్రారంభించింది క్రిందంతా బురద అయిపోయింది. కొత్తగా రోడ్లు పెద్దవి వేస్తున్నారు, మనం చూస్తున్నాం, ఆ రోడ్లు వేసేటప్పుడు అంతా తారు, దాంట్లో చిన్న చిన్న రాళ్ళు, ఇవన్ని కలిపి పోస్తుంటారు, అప్పుడప్పుడే పోస్తుండే చిన్న గ్రామపు రోడ్డు మీంచి ఈ కారు వెళ్ళుతోంది. ఆ కరిగించిన తారుతో కలిసిన రాళ్ళన్ని టైర్లకి అంటుకోవడం ప్రారంభించాయి, వీడు కార్లో కూర్చున్నాడు ప్రయాణం చేస్తున్నాడు, అయ్యయ్యో నా టైర్లన్నీ పాడైపోతున్నాయే, నా టైర్లకి ఈ తారంతా అంటుకుపోతోందే అని వీడు అనుకోడు. కొంత దూరం ఈ టైర్లు తారు మీద ప్రయాణం చేసిన తరువాత ధుమ్ము రోడ్డు వచ్చింది. ఆ ధుమ్ము మీద ఈ టైర్లకి అంటుకున్నటువంటి తారుకు ఆ దుమ్ము బాగా అంటుకోవడం ప్రారంభించింది. అది కారంతా అంటుకుంటోంది. సరే అంతకుముందు వాన పడింది కదా కొంచెం ముందరకు వెళ్ళితే బురదలో వీడి కారు వెళ్ళుతుంటే, పక్కనుంచి వచ్చే ఇంకో కారు ఆ నీళ్ళల్లోంచి వెళ్ళడం వల్ల ఈ కారు నిండా ధుమ్ము పడింది, బురదంతా అంటుకుంది. అయ్యో నా కారు అంతా బురదైపోయిందే, నేను అంతా బురదైపోయానే అని మనిషి ఏడవటంలేదే దాన్ని కనీసం పట్టించుకోవట్లేదే, నామీద పడలేదు కదా, హమ్మయ్య అనుకుంటున్నాడు, ఆ తారు మట్టి ధుమ్ము ధూళి నాకు అంటుకోలేదు కదా హమ్మయ్య అని అనుకుంటున్నాడు, ప్రయాణం మానలేదు తాను ముందుకి సాగుతూనే వెళ్ళుతున్నాడు కాని ఆ సాగే యానంలో తాను వాహనంగా చేసుకున్నటువంటి ఆ కారుకి అంటుకునేవాటిని తాను పట్టించుకోవటంలేదు ఐతే పట్టించుక్కోవట్లేదని కాదు దాని మీద మధ్యలో అంటుకునేవి ఏమిచేస్తాం తప్పదు కదా ప్రయాణం చేస్తున్నాం రోడ్లు వేస్తున్నారు అంటుకోక తప్పదు. సరే ప్రయాణం చేస్తున్నాం మట్టి రోడ్డు ఒక ఏడాది తిరిగితే మంచి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కాస్త ధుమ్ము అంటుకోక ఏంచేస్తుంది కనక ధుమ్ము లేవక ఏం చేస్తుంది కనక, అద్దం వేసుకుందాం అని అనుకుంటాడు వీడు వేసుకుంటాడు, అవకాశం ఉంటే ఏసి వేసుకుంటాడు, ధుమ్ము దాటేంతవరకు కూడ జాగ్రత్తగా సర్దుకుంటాడు, జోరున వాన కురుస్తోది, బైటంతా కురిసిపోతోంది, నా పైన పడటంలేదు కదా సరే కారు తడుస్తోంది, తాత్కాలికంగా తప్పదు కనుక సరే తడవని అనుకుంటాడు దాన్ని ఓర్చుకుంటాడు.

వాహనానికి ఏర్పడే వేడి స్పర్శ చల్లటి స్పర్శ, దుమ్ము స్పర్శ, తారు స్పర్శ ఇలాంటి వాటన్నిటిని తాను తట్టుకుంటూ తన గమనంలో ముందుకు సాగుతూ తన యాత్రను సాగిస్తూ వాటిని తాను ఓర్చుకుంటున్నాడు ఐతే కారుకి అవన్ని తగులుతున్నాయి తప్పదు కనుక కాని తనకి అవేం తగిలించు కోవట్లేదు వాటిని తట్టుకో నేర్చినవాడు అలాంటి సమయంలో కూడా యాత్రలు సవ్యంగా చేయగలుగుతాడు, కారుకి కాస్త అంటుకోగానే అయ్యో నాకింత అంటుకుపోయిందే అని ఏడ్చేవాడు కాదు,కారు తుడిచి అబ్బా ఏంత నీటుగా పేట్టుకున్నానో అని దాని యొక్క అందాన్ని ఎక్కడ భంగపడిపోతుందో అని వాడటం మాని వేసినవాడు కాని దాని వల్ల పొందాల్సిన ప్రయోజనం పోందలేడు చేరాల్సిన గమ్యన్ని చేరలేడు అది వాడికి వ్యర్ధం కూడా ఐతే గమనంలో ఏర్పడే వాటిని మాత్రం వాడు తట్టుకోగలుగుతున్నాడు తట్టుకునే ప్రయత్నంచేస్తుంటేనే వాడు చేరడం లక్ష్యం ఏదో అక్కడికి చేరడం జరుగుతోంది.

మానవుడికి జ్ఞానమున్న వ్యక్తికి చేరాల్సిన గమ్యమేది అంటే ఆనందాన్ని పొందడం ఎట్లాంటి ఆనందాన్ని? అందరితో పంచుకోగలిగే ఆనందం అది తనని ఏడిపించకూడదు,ఎదుటివాడిని ఏడిపించకూడదు, ఏదుటివాడ్ని కష్టపెట్టేది కాకుండా ఉండాలి అందులో ఏ రకమైనటువంటి కాలుష్యంలేకుండా మంచి ఆనందాన్ని పొందడం మానవ జీవితానికి లక్ష్యమైతే దాన్ని అమృతత్వం అంటాం ఇది ఎవడికి కలుగుతుంది? ధీరుడెవ్వడో ఆతడికి కలుగుతుంది, ఎవడైతే సమబుద్దిని కలిగి ఉంటాడో అలాంటి వాడు మాత్రమే ధీరుడు అనిపించుకుంటాడు వాడికి అమృతత్వం లభిస్తుంది అని భగవంతుడు చెప్పాడు.

కారు మీద పడ్డవాటిని నువ్వు సహిస్తున్నట్టే, వీటిని కూడా సహించడం నువ్వు అలవాటు చేసుకో, ఎండ, వాన, చలి  వచ్చినప్పుడు సహించడం అలవాటుచేసుకుంటున్నావా లేకపోతే ఎండ వచ్చినప్పుడు ఎందుకొచ్చావ్ ఎండ?  అని ఎండ మీద దెబ్బలాడుతున్నావా? వాన వచ్చినప్పుడు నాకిప్పుడు వాన రావల్సిన అవసరం లేదు నేను బట్టలు ఆరేసుకుంటే, ఏదో ఏండ బెట్టుకుంటే ఎండకుండా ఎందుకువచ్చి ఇబ్బంది కలిగిస్తున్నావు అని వాన మీద నువ్వు ఏడుస్తున్నావా?  శీతా కాలంలో బ్రహ్మాండమైన మంచు కురిసి చలి వేస్తుంటే,ఎందుకు మంచు కురుస్తున్నావ్, ఎందుకీ పొగ మంచు,ఎందుకు నాకీ చలి వెయ్యాలి అని అనుకుంటూ చలిని నువ్వు దూరంగా జరిపి వేసే ప్రయత్నంచేస్తున్నావా?  లేదే దానిని మానాన దాన్ని ఉండనిస్తున్నావ్, నీ మానాన నువ్వు పని చేసుకుంటున్నావ్, కాని అది నిన్ను ఏడిపించకుండా ఉండగలిగేట్టుగ, వాన వస్తే గొడుగు అడ్డు పెట్టుకుంటున్నావ్, ఎండ వస్తే విసిన కర్ర్ర తీసుకుంటున్నావ్, చలి వేస్తుంటే దుప్పటి కప్పుకుంటున్నావ్, లేదా కోటు వేసుకుంటున్నావ్ పని చేసుకుంటున్నావ్,  సుఖః దుఖాలని ఎవడైతే వాటిని సమానంగా భావిస్తాడో వాడు ధీరుడంటాం, వాడు అమృతత్వాన్ని పొందగలుగుతాడు.

క్కడొక రహస్యం ఉంది ఏమిటది? సాధారణంగా సుఖాలొస్తే సంతోషం దుఃఖాలొస్తే ఏడుపు మనకి వస్తాయి, సుఖం పోతోంది అంటే ఏడుపు వస్తోంది, దుఃఖం పోతోంది అంటే సుఖం వస్తుంది కాని కృష్ణుడు చాలా తమాషాగా ఒక ప్రయోగం చేసాడు దుఃఖాన్ని నీవు ఎలాగైతే వద్దు అని అనుకుంటున్నావో అంతే తేలికగా సుఖాన్ని కూడా వద్దు అని అనుకోగలవా? సుఖం ఎట్లాగైతే కావలనుకుంటున్నావో, దుఃఖాన్ని కూడా అట్లా కావలనుకోగలవా? లేదా వద్దూ అనుకుంటే రెండిటిని వద్దు అని అనుకోగలుగుతున్నావా? అంటే సుఖం కావాలనే పట్టింపు మనసులో ఉంది కనుక అది పోతే ఏడుపు వస్తోంది దుఃఖం వద్దు అనే భావం మనసులో ఉంది కనుకు అది వస్తోంది. అంటే నీకు ఏడుపు వస్తోంది .సుఖం కావాలనుకున్నది వచ్చినప్పుడు నీకు సుఖం కలుగుతోంది కావాలని అనుకోనప్పుడు వచ్చినా నీకు ఏ భావన ఉండదు. అది పోయినా నీకు ఏ భావన ఉండదు, దుఃఖం వద్దు అనుకుంటున్నావు కనుక అది వచ్చి మీద పడితే ఏడుపువస్తోంది అది పోతే సంతోషం కలుగుతోంది, అదే  నీకు దాని యందు ఏ రకమైనటువంటి మానసిక అటాచ్మెంట్ లేకపోతే అది వచ్చినా పోయినా నీకు పెద్దగా పట్టింపు ఉండదు. అంటే సుఖం, నీకా పట్టింపులేనప్పుడు ఏలా ఉండదు అని అనడానికి రాముడు ఒక చిన్న ఉదాహరణ, రాజ్యం ఇస్తానోయ్! అని నాన్నగారు చెప్పారు.

సరే వచ్చే అదృష్టం ఉంటే వస్తుంది అని అనుకున్నాడు. సరే ఏర్పాట్లు చేసారు, కాని తెల్లవారేటప్పటికి కైకమ్మ కోరిక చేత, అడవికి వెళ్ళాలి ఆజ్ఞ అయింది, ఏమి చేస్తాడు తను కావాలి అని అనుకుంటూ వచ్చినప్పుడు పొంగిపోలేదు కనుక, రాజ్యం పోయింది అనుకునప్పుడు ఏడుపుతో కృంగి పోలేదు, సమానంగా భావించగలిగాడు, ఇది మనిషికి కావలిసింది, నీకు దుఃఖం వద్దు అని ఎలాగైతే అనుకోగలుగుతున్నావో సుఖాన్ని కూడా వద్దు అని అనుకోగలవా? దుఃఖాన్ని ఎట్లాగైతే వద్దు అని అనుకుంటున్నావో సుఖాన్ని కూడా వద్దు అని అనుకోగలిగితే, అవి వచ్చినా పోయినా నీకు బెంగ ఉండదు. సమ భావన అనుకూలమైనవాటి యందు ప్రతికూలమైన వాటి యందు భావించ నేర్చిన వాడికి ధైర్యం అంటే మంచి బుద్ది ఏర్పడుతుంది, అలాంటి వాడే శారీరక భూత భౌతిక స్పర్శ లైనటువంటి మాత్రా స్పర్శలని తట్టుకోగలుగుతాడు, అలాంటివి తట్టుకోగలిగే ధీరుడికే అమృతత్వం సిద్దిస్తుంది అని శ్రీ కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో ఉపదేశం చేసాడు.

Leave a Reply