తెలుగు, సంస్కృతి సాంప్రదాయం

స్త్రీయే ధర్మం!

స్త్రీయే ధర్మం!
Views: 0

ధర్మం నాలుగు విభాగాలుగా రూపాంతరం చెందింది. ఆ నాలుగు ఏమిటి?
1. సూర్యుడు
2.స్త్రీ
3. రాజు
4. యముడు

సూర్యుడు తనలోని తేజస్సుని ప్రసరింపజేసి లోకాలకు ఇచ్చి లోకాలను కాపాడుతూ ఉంటాడు.
స్త్రీ బయటి తేజస్సుని తనలోకి తీసుకొని జీవికి ప్రాణం పోసి ఈలోకంలోకి తెస్తుంది

అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించాలి. స్త్రీలకి ధర్మాచరణ ఎంత ముఖ్యమో, వస్త్రాధారణ కూడా అంతే ముఖ్యం. అటువంటి వస్త్రాధారణపై అనురక్తి పొందనినాడు కలిపురుషుని మాయకి లోబడిపోతున్నారు అని అర్ధం!
ఈ యుగం కలియుగం! సరైన వస్త్రధారణ పాటించకుండా శరీరమును బహిర్గంగా ప్రదర్శించడం వలన సమాజములో విశృంఖలత్వ కామము ఏర్పడిపోవడానికి, జుట్టు విరబోసుకుని తిరుగుతున్నందుకు దరిద్రం ఏర్పడడానికి వీళ్ళు కారణం అవుతారు.

“ఒకతెకు జగములు వణకున్;
అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్;
ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా;
పట్టపగలె చుక్కలు రాలున్” 
అని ఒక పద్యంలో అంటారు

అంటే.. ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము.

స్త్రీ తన ధర్మం ఎప్పటికీ తప్పలేదు. కాని బుద్ది మారిపోయి తన స్వభావాన్ని మార్చుకొంటుంది ఈ కాలములో!

ఆడపిల్లలలో దేవతలు ఉన్న మాట ఎంత నిజమో,
వారిలో కొందరిలో దెయ్యాలు ఉన్న మాట కూడా అంతే వాస్తవం…
దేవతా లక్షణాలు ఉన్న స్త్రీ ఎప్పుడూ పూజింపబడుతుంది!

యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాఃI
యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రా ఫలాః క్రియాఃII
(మనుస్మృతి 3-56)

స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారో, ఎక్కడ ఆదరించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు. ఎక్కడైతే స్త్రీలు అవమానింపబడతారో ఆక్కడ అన్ని కార్యాలు, అన్ని ఫలితాలు చెడిపోతాయి.కనుక స్త్రీలను గౌరవించాలి! వాళ్ళు కూడా అంతఃశుద్దిని బాహ్యశుద్దిని కలిగి ఉండాలి.

Leave a Reply