ఆ ఆరుగురు “ధర్మ భిక్షకులు”
Views: 0
|| ధర్మచారీ యతిశ్చైవ విద్యార్దీ గురుపోషకః
అధ్వగః క్షీణవృత్తిశ్చ షడతే భిక్షుకాః స్మృతః ||
యాత్రికుడు, నిరుద్యోగి, విద్యార్ధి, గురువును పోషించువాడు, సన్యాసి, బ్రహ్మచారి.. ‘ధర్మ భిక్షకులు‘గా చెప్పబడ్డ ఈ ఆరుగురు ఏ సమయంలో వచ్చినా గృహస్దు అన్న పానాదులిచ్చి గౌరవించాలి. అడుక్కునే సామాన్యులకు ఇచ్చేది ‘ముష్టి‘గా చెప్పబడుతుంది కానీ అది భిక్ష కాదు. ముష్టి అంటే ‘పిడికిలి‘తో వేసేది.