తెలుగు, తంత్ర

Aghora Chapter 4 – Part 4 Telugu | రచయిత యొక్క ఉపసంహారం

Aghora Chapter 4 – Part 4 Telugu | రచయిత యొక్క ఉపసంహారం
Views: 0

🕉️ Aghora – At The Left Hand Of God
✍️ Written by Robert E. Svoboda
📖 తెలుగు అనువాదం by Rushivarya – The Vaidic Icon®

Aghora Chapter 4 – Rnanubandhana | Part 4: Author’s Postscript

అఘోరా అధ్యయనం 4 – ఋణానుబంధనం | భాగం 3: రచయిత యొక్క ఉపసంహారం

⚠️ గమనిక:
పుస్తకంలో మాట్లాడుతున్నది విమలానంద అఘోరి

Vimalananda Aghori meditating in a cremation ground with sacred ash and spiritual aura

రచయిత యొక్క ఉపసంహారం (AUTHOR’S POSTSCRIPT)

రాను కథ, విమలానందుడు చెప్పిన ృణానుబంధన బోధనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక జీవి ఎలా జన్మిస్తుంది, తన పాత్రను ఎలా పోషిస్తుంది, తన ఋణాలను తీర్చుకుని ఎలా వెళ్లిపోతుంది అన్నది ఈ కథ ద్వారా స్పష్టమవుతుంది. అయితే రాను కథ పూర్తవ్వాలంటే, విమలానందుడి తండ్రి కథను కూడా దీనికి జతచేయాలి. ఈ సంఘటనలో నేను వ్యక్తిగతంగా పాల్గొన్నందున, దీన్ని నా దృష్టికోణంలోనే మొదటి వ్యక్తిగా వ్రాస్తున్నాను.

AI generated portrait of Vimalananda’s father depicted as a wise elderly Indian spiritual figure with calm expression and traditional appearance inspired by Aghora philosophy.

1978 వేసవిలో విమలానందుడు తన తండ్రి ఆ సంవత్సరాంతానికి ముందే నిద్రలోనే మరణిస్తారని చెప్పాడు. అప్పటికే ఎవరి మరణ సమయాన్ని ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పగలడో నేను అనుభవించాను. అయినప్పటికీ సంవత్సరం ముగియబోతున్నా ఆ సంఘటన జరగకపోవడంతో నాకు ఆశ్చర్యం కలిగింది.

క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం మేము బొంబాయిలో ఉన్నప్పుడు, డిసెంబర్ 30 రాత్రి నేను విమలానందుడితో ఇలా అన్నాను:

“నీ తండ్రి ఈ ఏడాదిలోనే మరణిస్తారని నువ్వు చెప్పావు కదా? కానీ ఇంకా ఆయన బ్రతికే ఉన్నారు.”

విమలానందుడు ప్రశాంతంగా నవ్వి చెప్పాడు:

“సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక రోజు ఉంది కదా? అది గడిచాక ఏదైనా చెప్పు.”

Dark spiritual artwork of a dog howling under the moon near a silent street, symbolizing ominous signs, fate, spiritual intuition, and death omens from Aghora Chapter 4 Part 4.

అంతలోనే కింద వీధిలో ఒక కుక్క ఎంతో దయనీయంగా మొరిగింది. తరువాత తెలిసింది ఏమిటంటే, అది మా భవనం కింద ఉన్న పోస్టాఫీసులో పొరపాటున బంధించబడి, బయటకు రావడానికి మొరుగుతోందని. కానీ శకున శాస్త్రం ప్రకారం, రాత్రివేళ కుక్క అలా విలపించడం అత్యంత అశుభ సూచన.

మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఫోన్ వచ్చింది. విమలానందుడి తండ్రి రాత్రి నిద్రలోనే మరణించారని తెలియజేశారు. కుక్క మొరగడం మొదలైన సమయానికే ఆయన మరణించినట్లు తేలింది.

ఫోన్ పెట్టి విమలానందుడు నన్ను చూసి చిరునవ్వుతో అన్నాడు:

“ఇప్పుడు ఏమంటావు?”

మేము ఆయన తండ్రి గదిలోకి వెళ్లి చివరి దర్శనం చేసుకున్నాం. విమలానందుడు మృదువుగా నిట్టూర్చి నాతో అన్నాడు:

“ఆ ముఖాన్ని చూడు!”

అతను గోడపై ఉన్న ఒక చిత్రాన్ని చూపించాడు. అది వారి కుటుంబ గురువు “హరనాథ్ ఠాకూర్” యొక్క చిత్రం. ఆ చిత్రంలోని ముఖకవళికలు, ముందున్న మృతదేహంతో దాదాపు ఒక్కటే.

విమలానందుడు కొనసాగించాడు:

“నా తండ్రి ఎన్నో సంవత్సరాలు తన గురువు చిత్రాన్ని ధ్యానించడంతో, ఆయన శరీర రూపం కూడా గురువులానే మారిపోయింది. ఇది ‘కీట భ్రమరి న్యాయం’కి ప్రత్యక్ష ఉదాహరణ — నువ్వు ఏదిపై ధ్యానం చేస్తే, చివరికి నువ్వు అదే అవుతావు.”

Spiritual artwork depicting an elderly man lying peacefully while a divine guru portrait radiates energy, symbolizing guru sacrifice, rebirth, spiritual connection, and resurrection in Aghora Chapter 4 Telugu.

కొద్దిసేపు ఆలోచించి మళ్లీ అన్నాడు:

“ఇంకో కారణం కూడా ఉంది. 1927లో నా తండ్రికి మెనింజైటిస్ వచ్చింది. ఆయన నిజంగానే చనిపోయారు. ముగ్గురు డాక్టర్లు మరణ ధృవపత్రాలు కూడా ఇచ్చారు. అప్పుడు హరణాథ్ నుంచి సందేశం వచ్చింది:

‘పన్నెండు గంటల వరకు శవాన్ని తీసుకెళ్లకండి.’

మా బంధువులందరూ ‘అతను చనిపోయాడు, వెంటనే దహనం చేద్దాం’ అన్నారు. కానీ నా తల్లి తన గురువుపై అచంచల విశ్వాసంతో నిలబడ్డారు. ఆరు గంటల తరువాత శవం ఒక్కసారిగా లేచొచ్చింది. ఆయన ఇంకా యాభై ఒక్క సంవత్సరాలు బ్రతికారు.”

కొన్ని రోజుల తరువాత హరణాథ్ నుంచి ఒక ఉత్తరం వచ్చింది:

“నా కుమారుడా, నీకు దీర్ఘాయుష్షు ఉంటుంది. కానీ ఇకపై నన్ను చూడలేవు. నా బాలుడిని చూసుకో.”

అక్కడ “నా బాలుడు” అంటే విమలానందుడే. అప్పటికి అతనికి పదకొండు సంవత్సరాలు.

ఆ ఉత్తరంతో పాటు హరణాథ్ కుమారుడి నుంచి మరో లేఖ వచ్చింది. అందులో ఇలా వుంది:

“అదే రోజు, అదే సమయానికి హరణాథ్ గారు తోటలో విశ్రాంతి తీసుకుంటూ ‘విమలానందుడి తండ్రికి నా సహాయం అవసరం’ అని చెప్పారు. తరువాత ఆయన ఆ నిద్రలోనే శరీరాన్ని విడిచారు.”

హరణాథ్ నిద్రలోకి జారుకున్న సమయమే, విమలానందుడి తండ్రి మళ్లీ ప్రాణం పొందిన సమయమని తేలింది.

విమలానందుడు చెప్పాడు:

“ఆ సంఘటన తరువాత నా తండ్రి పూర్తిగా మారిపోయారు. వ్యాపారంపై ఆసక్తి తగ్గిపోయింది. ఎక్కువ సమయం జపం, ఆధ్యాత్మిక చర్చలకే కేటాయించేవారు. ఆయన పునర్జీవితం, గురువు మరణం మధ్య ఏదో లోతైన సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది.”

Spiritual artwork of a man silently watching a funeral pyre near a riverside cremation ground, symbolizing detachment, sacred fire, death rituals, and liberation in Aghora philosophy.

తరువాత ఆయన తన తండ్రి శవాన్ని గమనిస్తూ చెప్పాడు:

“శరీరంపై ఒక్క ఈగ కూడా లేదు. నియమబద్ధమైన జీవనం వల్ల శరీరం చిన్నపిల్లాడిదానిలా తేలికగా ఉంది.”

అతను దీనిని ఆయన పవిత్రతకు నిదర్శనంగా భావించాడు.

బంగంగా శ్మశానంలో విమలానందుడు స్వయంగా చితిని పేర్చాడు.

“మా కుటుంబంలో ఎవరు చనిపోయినా చితిని నేనే పేర్చుతాను. ఇది నా పని. శ్మశానం నా ఇల్లు. దీన్ని ఎలా చేయాలో నాకు బాగా తెలుసు.”

చితికి నిప్పంటించిన తరువాత అతను నన్ను పిలిచి, మేమిద్దరం నెయ్యి ఆహుతులు సమర్పించాము. అది ఒక యజ్ఞాగ్నిని ఆరాధిస్తున్నట్లే కనిపించింది. తన తండ్రి చితిపై కొడుకు పూజ చేయడం చూసి అక్కడి వారంతా దిగ్భ్రాంతి చెందారు. కానీ ఎవరూ మమ్మల్ని ఆపలేకపోయారు.

కొద్దిసేపటికి మేమిద్దరం నిశ్శబ్దంగా కూర్చుని చితి మండడాన్ని చూస్తూ పొగ తాగుతున్నాం. చుట్టూ కేవలం అగ్నిజ్వాలల శబ్దం, కాకుల అరుపులు, సముద్ర అలల గర్జన మాత్రమే వినిపిస్తున్నాయి.

Spiritual artwork of Vimalananda calmly conversing near a cremation ground after funeral rituals, symbolizing detachment, Aghora philosophy, death acceptance, and liberation.

అప్పుడు నేను అతనితో అన్నాను:

“నీ కుటుంబం ఇది చూసి షాక్ అయ్యింది.”

విమలానందుడు గట్టిగా నవ్వి చెప్పాడు:

“నా గురించి వాళ్లకు ఏమి తెలుసు? నేను చేయాల్సినదని అనిపించిన పని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. చాలా పనులు నేను కేవలం అనుభవం కోసం చేస్తాను. ఒకటి రెండు సార్లు చేసి, అది అలవాటు కాకముందే వదిలేస్తాను. కానీ అఘోరమే నా జీవితం. నేను ఎప్పుడూ శ్మశానంలోనే జీవించాను. అఘోరిగా ఉన్న నేను, నా తండ్రి చితి, వేరేవారి చితి అని తేడా చూడలేను. సాధన అంటే సాధనే. అఘోరిగా మారాలంటే అన్నిటినీ మర్చిపోవడానికి సిద్ధంగా ఉండాలి.”

కొద్దిసేపటి తరువాత మళ్లీ అన్నాడు:

“నా తల్లి అంత్యక్రియలప్పుడు కూడా ఇదే ఆలోచన వచ్చింది. ‘ఇక్కడ చిన్న సాధన చేస్తానా? మనకు ఎంతో భౌతిక లాభం వస్తుంది’ అని నా స్నేహితులను అడిగాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు.”

ఆ తరువాత అతను నిశ్శబ్దంగా మారిపోయాడు.

రెండు గంటల తరువాత విమలానందుడు హఠాత్తుగా లేచి నవ్వుతూ అన్నాడు:

“పాతమనిషి బూడిద అయ్యాడో లేదో చూద్దాం రా!”

చితి దగ్గరకు వెళ్లి చూడగా, కొద్దిపాటి ఎముక ముక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొన్ని ఎముక తునకలను తరువాతి క్రియల కోసం తీసుకుని మేము కారులోకి వెళ్లాము.

కారులో కూర్చుంటూ విమలానందుడి ముఖం ప్రకాశించింది.

“ఈ రాత్రి షాంపేన్‌తో న్యూ ఇయర్ జరుపుకుందాం! నాకు నిజంగా సంబరపడడానికి కారణం ఉంది. నా తండ్రి తన సాధనలో విజయవంతమయ్యాడు. ఆయనకు గొప్ప మరణం లభించింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, ఆయన కొత్త జీవితంలోకి ముందుగానే ప్రవేశించారు — శ్మశానంలో జీవించే మాకు బాగా తెలిసిన ఆ కొత్త జీవితం.”


న్యూ ఇయర్, క్రిస్టమస్, షాంపేన్" అనేవి ఎందుకు ప్రస్తావన వచ్చింది అనే ఆలోచన మీకు రావచ్చు..

ఈ పుస్తక రచయిత విమలానందుడి ఏకైక శిష్యుడు మరియు పాశ్చాత్త దేశస్తుడు... భారతదేశంలో ఆయుర్వేద శాస్త్రం పూర్తి చేసుకున్నా కూడా అతని సంస్కృతి వేరు కనుక వాటి ప్రస్తావన వచ్చింది...

తన కుమారుడి మరణంతో అఘోరి బాబా పూర్తిగా విరిగిపోయాడు. శ్మశానంలో నెలల తరబడి కుమారుడి అస్థికలతో కూర్చుని, తిరిగి బ్రతికించడానికి ప్రయత్నించాడు. కానీ తర్వాత గురువు అతనికి ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేయించాడు:

“అది నిజమైన శాశ్వత ప్రేమ కాదు. అది కేవలం ఋణానుబంధం — ఒక జన్మల బంధం మాత్రమే.”

ఈ సంఘటన తర్వాత విమలానంద అఘోరి తెలుసుకున్నది:

  • ప్రతి వ్యక్తి మన జీవితంలోకి ఒక కారణంతో వస్తాడు.
  • ఎవరి బంధమైతే పూర్తవుతుందో, వారు వెళ్ళిపోతారు.
  • మరణం అనేది శాపం కాదు; ఒక ప్రయాణ మార్పు మాత్రమే.
  • నిజమైన ఆధ్యాత్మికత అంటే “నా వ్యక్తి” అనే భావన దాటి, ప్రతి జీవిలో అదే దైవాన్ని చూడటం.

చివరికి ఆయన చెబుతున్న సందేశం:

“ఒక్క రానును కోల్పోయాను… కానీ ప్రతి మనిషిలో రానును చూడగలిగినప్పుడు, లక్షల రానులను పొందాను.” 🙏🏻🕉️

జై శ్రీ తారా మాత! 🔱
జన్మ మరణాల రహస్యాలను దాటి, ప్రతి బంధం వెనుక ఉన్న ఋణానుబంధ సత్యాన్ని గ్రహించినప్పుడే జీవితం నిజమైన అర్థాన్ని చూపిస్తుంది.

What’s your response?
0 responses
Love
Love
0
Smile
Smile
0
Haha
Haha
0
Sad
Sad
0
Star
Star
0
Weary
Weary
0

Leave a Reply