Aghora Chapter 3 – Part 3 Telugu | సాగల్ షా & మహాకాల రహస్యం
🕉️ Aghora – At The Left Hand Of God
✍️ Written by Robert E. Svoboda
📖 తెలుగు అనువాదం by Rushivarya – The Vaidic Icon®
Aghora Chapter 3 – Shiva | Part 3: Sagal Sha
అఘోరా అధ్యయనం 3 – “శివ” | భాగం 3: సాగల్ షా
⚠️ గమనిక:
పుస్తకంలో మాట్లాడుతున్నది విమలానంద అఘోరి
ముందుగా ఒక ముఖ్యమైన విషయం 🙏🏻
ఈ అధ్యాయంలో ఉన్న విషయాలు సాధారణ ఆధ్యాత్మిక రచనలలా ఉండవు. అఘోర సంప్రదాయం చాలా ప్రతీకాత్మకంగా, లోతైన తాత్విక దృష్టితో మాట్లాడుతుంది. అందుకే ఇందులో కనిపించే శ్మశానం, మరణం, శవసాధన, బలి వంటి పదాలను నేరుగా అక్షరార్థంగా తీసుకోవద్దు.
ఇవి హింసను ప్రోత్సహించే విషయాలు కాదు. మనిషిలో ఉన్న భయం, మోహం, అహంకారం, “నాది” అనే బంధాన్ని చెరిపివేయడానికి ఉపయోగించిన ఆధ్యాత్మిక ప్రతీకలు. ఈ గ్రంథం అసలు చెప్పదలచింది — జీవితం తాత్కాలికం, మరణం సహజం, భయం దాటి సత్యాన్ని చూడాలి అనే విషయాన్ని.
అలాగే ఇందులో వచ్చే అనుభవాలు, టెలిపాథీ, శవసాధన, అఘోర సాధనలు వంటి విషయాలను అనుకరించడానికి కాదు; అవి ఒక ప్రత్యేక సాధనా మార్గానికి సంబంధించిన అంతర్ముఖ అనుభవాలుగా మాత్రమే చూడాలి.
ఈ అధ్యాయాన్ని భయంతో కాదు, ఓపెన్ మైండ్‌తో, తాత్విక దృష్టితో చదవండి. 🕉️
సాగల్ షా | Sagal Shah
భారతదేశంలో ఎవరైనా ఒక్కసారిగా భయపడినా, గాఢమైన భావోద్వేగానికి లోనైనా తమ ఛాతీని తాకుతూ “రామా రామా రామా” అని అంటారు. “హర హర హర” అని సాధారణంగా ఎవరూ అనరు. ఎందుకంటే రాముడు విష్ణువు యొక్క అంశం — జీవాన్ని కాపాడేవాడు. కానీ హరుడు అంటే శివుడు — జీవాన్ని తీసుకుపోయేవాడు. చాలా అరుదుగా మాత్రమే ఎవరో “హర” అని పలుకుతారు. ఈ విషయం నాకు ఎప్పుడూ నా తల్లిని గుర్తు చేస్తుంది.
ఈ విషయం నాకు ఎప్పుడూ నా తల్లిని గుర్తు చేస్తుంది. నా తల్లి మరణించే సమయానికి తన గురువు హరనాథ్ ఠాకూర్ పేరును జపిస్తూ ఉండేది — “హరా, హరా, హరా, నన్ను తీసుకెళ్ళు” అని. మరణ దేవుని నామాన్ని చివరి శ్వాసలో పలికిస్తూ చనిపోయిన వారు ఎంతమంది ఉంటారు? అందుకే నేను ఎప్పుడూ నా తల్లిని పొందడం నా అదృష్టమని చెబుతాను.
“హర” అనే పదం “హృ” అనే మూల పదం నుండి వచ్చింది. దాని అర్థం “లాక్కోవడం”. మహాకాలుడు అంటే నీ ప్రాణాన్ని లాక్కునేవాడు. అందుకే ఆయనను “దొంగల ప్రభువు” అని కూడా అంటారు, ఎందుకంటే మనకు అత్యంత విలువైనదైన జీవితం ఆయన తీసుకుపోతాడు.
అసలు జీవితం అంటే ఏమిటి? ఈ లోకాలు, దేవతలు, రాక్షసులు — ఇవన్నీ ఋషుల సృష్టి. ఇది మొత్తం వారి లీలా. పాతది నశించినప్పుడే కొత్త సృష్టి వెలువడుతుంది. అందుకే ఋషులు మరణాన్ని ఎప్పుడూ ఆగనివ్వరు. లేకపోతే వారి లీలా కొనసాగదు. జీవితం కొనసాగడానికి మరణం తప్పనిసరి.
ఋషులు నేరుగా జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. మీ సంతానం తప్పు చేసినా మీరు వారిని నాశనం చెయ్యరుగా? అలాగే వారు కూడా . అందుకే పాత రూపాలను తొలగించే పని మహాకాలుడికి అప్పగించబడింది.
ఇక్కడ ఒక లోతైన తాత్విక భావం ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ నుంచే ఋషులు ఉద్భవించారు. కానీ అఘోర/తాంత్రిక దృష్టిలో “ఋషులు” అనేది కేవలం మనుషులే కాదు — విశ్వ చైతన్యాన్ని దర్శించిన మహా ద్రష్టలు. అందుకే రచయిత “నియంత్రణ మాత్రం ఋషుల చేతుల్లోనే ఉంటుంది” అని చెప్పాడు.
ఇది ప్రభుత్వ అధికారంలా కాదు. దాని అంతరార్థం:
విశ్వం ఒక నియమం ప్రకారం నడుస్తోంది; సృష్టి, స్థితి, లయం అన్నీ కాస్మిక్ ఆర్డర్‌లో భాగాలు. ఆ లయశక్తిని శివ తత్వం ద్వారా వ్యక్తీకరించారు.
అందుకే ఈ గ్రంధం రచయిత:
“వారు తాళ్లు లాగుతారు, విశ్వం నాట్యం చేస్తుంది”
అని చెప్పారు. ఇది అక్షరార్థం కాదు, విశ్వ చైతన్య సూత్రాల ప్రతీక.
నేను ఎప్పుడూ రూపంతో ఉన్న దేవుని ఆరాధనను సమర్థిస్తాను. కానీ దాని అర్థం రూపానికే పరిమితం కావడం కాదు. ఆ రూపం ద్వారా వ్యక్తమవుతున్న పరమసత్యాన్ని ఆరాధించాలి. అన్ని దేవతలూ ఒకే పరమాత్మ యొక్క విభిన్న రూపాలు మాత్రమే.
అందువల్ల “ఓ శివా! ఎంత కరుణామయుడివి” అని చెప్పడం కన్నా, “ఓ ప్రభూ! నీ సృష్టిలో శివుడు కరుణకు ప్రతిరూపం” అని చెప్పడం మరింత సూక్ష్మమైన అవగాహన. ప్రతి దేవత కూడా విశ్వనాటకంలో తనకు అప్పగించబడిన పాత్రను పోషిస్తోంది. వారి పాత్రను గౌరవించాలి; కానీ వారిలో వ్యక్తమవుతున్న ఆ ఒకటినే ప్రేమించాలి. రూపంతో ఉన్న దేవుని ద్వారా ఆ పరబ్రహ్మాన్ని చేరడం చాలా సులభం.
మహాకాలుడు శివుని సంపూర్ణ ప్రకటన. కానీ ఆయనతో సమానంగా భయంకరమైన ఇతర రూపాలు కూడా ఉన్నాయి. శివుని అన్ని రూపాల సాధన పూర్తిచేయడానికి నాకు మరలా రెండు సార్లు శవసాధన చేయాల్సి వచ్చింది.
చివరిసారి నేను శవసాధన చేసినది గంగానది డెల్టాలోని సుందర్‌బన్స్ అడవుల్లో. అక్కడికి నేను ఆసక్తితో కాదు — ఒక టెలిపాథిక్ పిలుపుతో వెళ్లాను. కొన్ని రోజుల పాటు ఆ పిలుపును నిర్లక్ష్యం చేశాను. కానీ అది అంత బలంగా మారింది కాబట్టి చివరకు వెళ్లక తప్పలేదు.
టెలిపాథిక్ అంటే మాటలు లేకుండా, మనస్సు ద్వారా వచ్చిన ఒక బలమైన పిలుపు లేదా అంతర్గత సందేశం. యోగ, తంత్ర సంప్రదాయాల్లో దీన్ని సూక్ష్మ చైతన్య కమ్యూనికేషన్‌గా భావిస్తారు.
అక్కడ నేను ధూని దగ్గర కూర్చుని ఉండేవాడిని. ధూని అంటే సాధువులు వెలిగించే పవిత్ర అగ్ని — సాధన, జపం, తపస్సుకు కేంద్రం. అఘోర సంప్రదాయంలో అది అంతర్గత వికారాలను దహించే ప్రతీక.
ఆ రాత్రే పూర్ణానందుడు వచ్చాడు. పూర్ణానందుడు. ఇదే పూర్ణానందుడు సర్వానందుని శిష్యుడు; తరువాత జస్టిస్ వుడ్రోఫ్‌కి దీక్ష ఇచ్చినవాడు. ఆయనే నన్ను మళ్లీ శవసాధన చేయమని ఒత్తిడి చేశాడు. అప్పటికే నేను శక్తి సాధన కోసం మూడు సార్లు శవసాధన చేసి ఉండటంతో ఇది నాకు కొత్తేమీ కాదు. కానీ బటుక భైరవ సాధనకు అది అవసరం.
ఆ శవం ఒక అందమైన యువకుడిది. సాధన ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయింది. మహాకాలుని అన్ని రూపాల సాధన పూర్తి చేయడానికి అవకాశం కల్పించినందుకు నేను ఇప్పటికీ పూర్ణానందుడికి కృతజ్ఞుడిని.
బహుశా మహాకాల సాధన నా విధి అయి ఉండాలి. ఎందుకంటే నేను సాగల్ షా వంశానికి చెందినవాడిని. అతను ఒక వ్యాపారి, శివభక్తుడు. అతనికి ఒక చిన్న కుమారుడు ఉండేవాడు. నమ్మినా నమ్మకపోయినా — ఆ కుమారుడే మహాకాలుడు అవతరించిన రూపం.
అఘోర పుస్తకం : Aghora Chapter 3 – Part 2 Telugu | మరణం మరియు శ్మశానం
సాగల్ షా ప్రతిరోజూ ఒక సాధువుకు భోజనం పెట్టకుండానే తినకూడదని వ్రతం పెట్టుకున్నాడు. ఒకసారి భారీ వర్షాల వల్ల మూడు రోజుల పాటు ఏ సాధువూ వారి దీవికి రాలేదు. అతను కూడా తినలేదు.
నాలుగో రోజు ఒక అఘోరి ఆ దీవికి వచ్చాడు. వాస్తవానికి ఆ అఘోరి వేషంలో ఉన్నది స్వయంగా శివుడే.
అఘోరి అన్నాడు: “నాకు మాంసం కావాలి.”
సాగల్ షా జీవితంలో ఎప్పుడూ ఇంట్లో మాంసం వండలేదు. అయినా అతిథిని దేవుడిగా భావించి అంగీకరించాడు.
కానీ అఘోరి ఇంకా ముందుకెళ్లాడు: “నాకు మనిషి మాంసం కావాలి” అన్నాడు
సాగల్ షా తనను తాను బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. కానీ అఘోరి అన్నాడు — “నీ మాంసం వృద్ధమైంది. నాకు చిన్న పిల్లాడి మెదడు కావాలి.”
ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది.
విమలానంద అఘోరి మాటల్ని నేరుగా అక్షరార్థంగా తీసుకోకూడదు. అలా అని అవి హింసను ప్రోత్సహించే మాటలు కాదు. తాంత్రిక సంప్రదాయంలో ఇవి భక్తి, త్యాగం, అహంకార విరమణకు సంబంధించిన ప్రతీకలు.
ఈ మాటలు అడిగే అసలు ప్రశ్న:
“నీవు ‘నాది’ అనే భావాన్ని ఎంతవరకు విడిచిపెట్టగలవు?” అనే దాని గురించి.
సాగల్ షా తన పాఠశాలలో ఉన్న కుమారుడిని తీసుకురావడానికి బయలుదేరాడు. అతని భార్య కూడా వ్రతం నిలబెట్టుకోవాలంటే ఇదే మార్గమని అంగీకరించింది. కుమారుడు చెలయ్యను తీసుకురాగానే అతడు ముందే అన్నాడు — “ఆ వృద్ధుడు నా మెదడును వండి తినాలనుకుంటున్నాడా? సరే, చూద్దాం.” తండ్రి ఆశ్చర్యపోవాల్సింది. కానీ కుమారుడి మరణవేదనలో అది గమనించలేదు. చెలయ్యను బలి ఇచ్చి అతని మెదడును వండి అఘోరి ముందు పెట్టారు. ఇప్పటికీ ఆ మెదడు నూరిన రోకలి ఆ దీవిలో ఉందని చెబుతారు.
అయితే అఘోరి మళ్లీ కోపంగా అన్నాడు — “బంజర స్త్రీ వండిన ఆహారం నేను తినను.”
అది వినగానే గర్భవతిగా ఉన్న సాగల్ షా భార్య ఆగ్రహంతో — “నేను బంజరురాలిని కాదు. ఇప్పుడు నిన్ను తినిపించి నేను చూస్తాను” అంది. అప్పుడు ఒక్కసారిగా అఘోరి చనిపోయిన బాలుడితో — “లేచి నిలుచో!” అన్నాడు.
అప్పుడు ఒక్కసారిగా చనిపోయిన బాలుడితో: “లేచి నిలుచో!” అన్నాడు.
వెంటనే బాలుడు బ్రతికి లేచాడు.
ఆ తర్వాత అఘోరి స్వయంగా “చెలయ్యకు” నమస్కరించాడు. తరువాత సాగల్ షాతో: “ఒక వరం కోరుకో” అన్నాడు.
సాగల్ షా ఇలా కోరుకున్నాడు: “నా వంశంలోని వారందరికీ పవిత్రమైన బుద్ధి ఉండాలి. దుర్బుద్ధి కలిగిన వారు నశించాలి.” అని 🙏🏻
సాగల్ షా గురించి చెప్పాక విమలానంద అఘోరి తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు.
“మా కుటుంబం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏజెంట్. ఒకప్పుడు బొంబాయిలో చాలా భాగం మా సొంతం. మేము మోసం చేయకపోవడం వల్ల ఆస్తులు పోయాయి. కానీ మాకు ఉన్న అసలు సంపద — దేవుని ఆశీర్వాదం — అది మాత్రం ఎప్పటికీ మిగిలింది” అని.
తన తండ్రి గురువును అంతగా ధ్యానించేవాడని, చివరకు గురువుతో రూపసామ్యం వచ్చిందని కూడా చెబుతాడు. కోట్లాది జపాలు చేసిన ఆ కుటుంబంలో తాను ఇలా మారడం ఆశ్చర్యమా..!? అని ముగిస్తాడు.
“రూపసామ్యం” అనే పదాన్ని కేవలం శారీరక రూపం మారిపోయింది అనే అర్థంలో చూడకూడదు. భారతీయ తత్వంలో:
“నువ్వు దేనిని నిరంతరం ధ్యానిస్తావో చివరకు అదే అవుతావు”
అనే భావన ఉంది.
కోట్లాది జపాలు, జీవితాంతం గురుభక్తి, ఒకే భావంలో జీవించడం వల్ల:
- మనస్సు మారుతుంది,
- వ్యక్తిత్వం మారుతుంది,
- చూపు, మాట, నడవడి కూడా మారుతాయి.
అందుకే రచయిత చివర్లో:
“అలాంటి జపం, సాధన, గురుభక్తి వాతావరణంలో పెరిగిన నేను ఇలా మారడం ఆశ్చర్యమా?”
అని ముగిస్తాడు.
అంటే:
“నేను ఒక్కరోజులో అఘోరి కాలేదు. తరతరాల సాధన నన్ను ఇలా మలిచింది”
అనే భావం 🙏🏻