Blog
ఉగాది పండగ విశిష్టత మరియు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
జీవితంలో రాబోయే మంచి మరియు చెడుల గురించి తెలుసుకోవడం కోసం, ఒకవేళ చెడు జరుగుతుందనుకుంటే జాగ్రత్త వహించడం కొరకు మనకోసం ఉన్నదే పంచాంగ శ్రవణం. అదే తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ విశిష్టత. ఈ ఏడాది మన జరుపుకొబోయే ఉగాదిని “పరాభవ ” నామ సంవత్సరం అని పిలుస్తారు. తొలి పండుగగా, నూతన సంవత్సరంగా భావించి తెలుగువారు ఉగాదిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులు, ప్రత్యేక అలంకరణలు, రకరకాల పిండివంటలతో ఉగాది పండుగ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది.
అన్నింటికీ మించి షడ్రుచుల సమ్మేళనమయిన ఉగాది పచ్చడి ప్రాముఖ్యత మన సంస్కృతీ, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు అద్దం పడుతుంది. ఇక ఉగాది రోజున నిర్వహించే పంచాంగ శ్రవణం తెలుగు వారి జీవితంలో ఓ భాగం. ఉగస్య ఆదిని ఉగాదిగా పిలుస్తారు. జన్మ నక్షత్ర గమనం మొదలు కావడం దీని అర్థం. అలాగే యుగాది అనే సంస్కృత పదానికి తెలుగు పదం ఉగాది. హిందువులకు ఏడాదంతా ఏవో ఒక పండుగలు వస్తూనే ఉన్నప్పటికీ… ఉగాదికి ఉండే విశిష్టత, ప్రాధాన్యత మరే పండుగకూ ఉండదు.
చైత్రమాసం మొదటిరోజు
చైత్రమాసం మొదటిరోజును ఉగాదిగా జరుపుకుంటాం. వారం రోజుల ముందు నుంచే ఉగాది కోలాహలం మొదలవుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడాలులేకుండా, ప్రాంతాలకతీతంగా ఉగాది పండుగను తెలుగువారంతా జరుపకుంటారు. దేశవిదేశాల్లో స్థిరపడిన వారు సైతం కొత్త ఏడాదిని షడ్రుచులతో స్వాగతిస్తారు.
పురాణాల ప్రకారం
పురాణాల ప్రకారం ఉగాదికి ఎంతో విశిష్టత ఉంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజయిన ఉగాది నాడే శ్రీరామచంద్రమూర్తి, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయ్యారని భావిస్తారు. అలాగే బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించింది ఉగాది రోజునే అని నమ్ముతారు.
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజు కూడా ఉగాదే అని భావిస్తారు. ఆ క్రమంలోనే ఉగాది రోజు కొత్త పనులు మొదలు పెట్టడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం వంటివి చేస్తారు. ఏడాదంతా మంచి జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు.
పంచాంగ శ్రవణం
ఉగాది రోజు తెలుగువారు తప్పనిసరిగా చేసే కార్యక్రమం పంచాంగ శ్రవణం. వరాహమిహిరుడు పంచాంగాన్ని ఉగాదిరోజునే ప్రజలందరికీ అంకితం చేశారని భావిస్తారు. అలాగే ఏటా ఒక్కో పేరుతో ఉగాదిని పిలవడంపైనా రకరకాల కారణాలున్నాయి. నారదుడి సంతానం పేర్లే ఉగాది సంవత్సరాలని కొందరు చెబుతారు. దక్షప్రజాపతి కుమార్తెల పేర్ల పైన తెలుగు సంవత్సరాలు ఏర్పడ్డాయని భావిస్తారు.
వసంతకాలంలో వచ్చే ఈ పండుగకు, ప్రకృతికి అవినాభావసంబంధం ఉంటుంది. ఆకురాలే శిశిరం తర్వాత వచ్చే వసంత రుతువులో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంటుంది. చెట్లు చిగురిస్తాయి. సకల చరాచర సృష్టి కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది.
బెల్లం, వేపపువ్వు, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, కారంతో తయారుచేసే ఉగాది పచ్చడి ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారంతో షడ్రుచుల సమ్మేళనంగా ఉండే ఉగాది పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ పచ్చడి తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాల్లో ఓ భాగం.
జరగబోయే మంచి, చెడుల గురించి తెలుసుకోవడం, చెడు జరుగుతుందనుకుంటే జాగ్రత్త పడడం పంచాంగ శ్రవణం ముఖ్య ఉద్దేశం. సానుకూల దృక్ఫథంతో ఉండాలని, జాగ్రత్తగా నడుచుకోవాలని, పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనేందుకు మానసికంగా సంసిద్ధంకావాలని, జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడాలని పంచాంగ శ్రవణం సూచిస్తుంది.
ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
ఉగాదిలో ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు.
శ్రీ పరాభవ నామ ఉగాది: ఆత్మవిజయానికి ఒక ఆహ్వానం 🌿
“చీకటిని పరాభవిస్తేనే కదా.. వెలుగు ఉదయించేది!”
తెలుగు వారందరికీ శ్రీ ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 🌸
కాలచక్రంలో మరో వసంతం వికసించింది. ప్రకృతి తన పాత ఆకులను రాల్చి, పచ్చని చిగుళ్లతో కొత్త జన్మ ఎత్తుతున్న వేళ.. మన జీవితాల్లో కూడా ఒక ‘మహా పరివర్తన’కు సమయం ఆసన్నమైంది. 2026 మార్చి 19న అడుగుపెడుతున్న ఈ ఏడాది పేరు ‘పరాభవ‘.
చాలామంది ఈ పేరు విని ఆందోళన చెందుతుంటారు. కానీ, ‘పరాభవ‘ అంటే లోక రీత్యా ఓటమి కాదు.. అది ఆధ్యాత్మికంగా ఒక అద్భుతమైన విజయం!
ఏమిటీ ‘పరాభవ’ అంతరార్థం?
సంస్కృత భాషా సౌందర్యంలో ఈ పదానికి రెండు లోతైన అర్థాలు ఉన్నాయి:
భయానికి పరాభవం: రేపటి గురించిన చింతను వదిలి, ఈ క్షణంలో జీవిద్దాం.’ నామ సంవత్సరానికి ముగింపు పలికి ” నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరా (అత్యున్నతమైన) + భవ (స్థితి/పుట్టుక): అంటే సామాన్యమైన మానవ స్థితి నుండి, దైవత్వంతో కూడిన అత్యున్నతమైన స్థితిలో ‘పుట్టడం’ అని అర్థం.
పరాభవం (ఓడించడం): మనలోని అరిషడ్వర్గాలను, అజ్ఞానాన్ని, అహంకారాన్ని ‘పరాభవం’ చేసి (ఓడించి), ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఈ ఏడాది పరమార్థం.
అహంకారానికి పరాభవం: ‘నేను’ అనే భావనను వీడి, అందరిలో దైవత్వాన్ని చూద్దాం.
అజ్ఞానానికి పరాభవం: నిరంతర సాధనతో జ్ఞానదీపాన్ని వెలిగిద్దాం.
ఉగాది విశిష్టత
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగమనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాథ ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారాయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖీ’గా, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’ గా జరుపుకుంటారు.
ఒక చిన్న ఆలోచన: ఈ పచ్చని ప్రకృతి సాక్షిగా.. మీలోని ఏ బలహీనతను ఈ ఏడాది ‘పరాభవం’ చేసి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారు? మీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకోండి.
ఈ ‘పరాభవ’ నామ సంవత్సరం మీ ఇంటా, వంటా సిరిసంపదలతో పాటు, ఆత్మశాంతిని కూడా ప్రసాదించాలని కోరుకుంటూ..
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు 🙏
🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏