సులువుగా ఇంట్లోనే హోలీ రంగుల తయారీ

హోలీ పండుగనాడు రంగులు లేకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. కానీ దుఖానాల్లో దొరికే రంగులు దాదాపుగా రసాయనాలతో తయారవ్వడం వలన చర్మం మరియు జుట్టుకు చాలా హాని కలుగుతుంది. కనుక ఈ రసాయన రంగుల వలన చర్మం ఎరుపెక్కడం, దురదలు, వాపు మరియు చర్మం సంబంధిత సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు మరింత ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కునే అవకాశమూ లేకోపోలేదు. అంతే కాకుండా చర్మం మరియు జుట్టు పొడిబారటంలాంటి సమస్యలు కూడా రావచ్చు. కొంచం కష్టమైనా సరే సులువుగా ఇంట్లోనే హోలీ రంగుల తయారు చేసుకోవడం ఉత్తమం.
You May Like: హోలీ రంగులు సహజంగా పువ్వులతో ఇలా తయారు చేసుకోండి
సులువుగా ఇంట్లోనే హోలీ రంగుల తయారీ
హోలీ ఆడుతూ చర్మాన్ని మరియు జుట్టును కాపాడుకోవడానికి సహజసిద్ధమైన రంగులతో హోలీ ఆడడం ఎంతో ఉత్తమం. సహజంగా హోలీ రంగులను పువ్వులు మరియు కూరగాయలతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందువలన మనకు ఎలాంటి హాని కలగదు మరియు రంగులను శుభ్రం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. సులువుగా ఇంట్లోనే హోలీ రంగుల తయారీ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
పింక్ కలర్
పొడిగా ఉండే గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, తర్వాత రోస్ ఫ్లవర్ పేస్ట్, గంధం మరియు పొడి పిండిని ఒక పాత్రలో వేసి బాగా కలపితే హోలీ ఆడటానికి పింక్ కలర్ సిద్ధమయినట్టే.
పసుపు రంగు
పసుపు పొడి చర్మానికి ఎంతగానో మేలు చేస్తుందని దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే హోలీ రోజున చర్మాన్ని సంరక్షించుకోవటానికి పసుపు పొడి నుంచి యెల్లో రంగును తయారు చేసుకోవచ్చు. పసుపు కొమ్ములను తీసుకుని అందులో శనగపిండిని కలపడం ద్వారా పసుపు రంగును తయారు చేసుకోవచ్చు.
ఆకుపచ్చ రంగు
బచ్చల ఆకుల ద్వారా ఆకుపచ్చ రంగు తయారు చెయ్యవచ్చు.హోలీ ఆడుకోవడానికి ఆకుపచ్చ రంగు చేసుకోవాలంటే ఎండు బచ్చలికూర మరియు కొత్తిమీర తరుగును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. వేప ఆకులను కూడా కొంచం వేస్తే రంగుకి ఔషద గుణాన్ని ఇచ్చినట్టు కూడా అవుతుంది. ఇలా సహజసిద్దంగా ఆకుపచ్చ రంగును తయారు చెయ్యవచ్చు.
నారింజ రంగు
నారింజ రంగును తయారుచెయ్యడానికి ఎండిన బంతి పువ్వులను మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. నారింజ పండు తొక్కలను కూడా ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి కూడా నారింజ రంగును తయారు చేసుకోవచ్చు.
ఎరుపు రంగు
చాలా మంది ఎరుపు రంగును ఇష్టపడుతుంటారు. బీట్రూట్ నుండి ఎరుపు రంగును సహజసిద్దంగా తయారు చెయ్యవచ్చు. బీట్ రూట్ ని బాగా కడిగి ఆరిన తర్వాత గ్రైండ్ చేసి కలర్ తయారు చేసుకోవచ్చు.