హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి?

హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి? అనే అంశాలు ఇప్పుడు చూద్దాం.. హోలీ పండుగ అనగా రంగుల పండుగ. అదొక ఆనంద కేళీ. ప్రజలు ఎంతగానో ఇష్టంగా హోలికా దహనం మరియు రంగోలీల్లో పాల్గొనే పండుగ.
Also Read: Holi – Celebration of togetherness
Table of Contents
హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్ట ఏంటి?
హోలీ పండుగ వస్తుందంటే దేశ వ్యాప్తంగా ఒక పెద్ద పండుగే. దీపావళి తర్వాత దేశంలో పెద్ద వేడుకగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఈ పండుగ యుగాల క్రితం కూడా జరుపుకున్నారని హైందవ పురాణాల ద్వారా తెలుస్తుంది. హోలీ అనగా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’ అని కూడా అంటారు. ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఈ హోలీ పండుగను జరుపుకుంటారు.
హోలీ పండుగ యొక్క పుట్టుపుర్వోత్తరాల గురించి పురాణాల్లో భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన ఒక కథ ఏంటంటే…
హోలికా దహనం రోజునే..
రాక్షస రాజు హిరణ్యకశపుని కుమారుడు “ప్రహ్లాదుడు”. నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశపునికి ఏమాత్రం నచ్చేది కాదు. అందుకని కుమారుడైన ప్రహ్లాదుడినే మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు. ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి వెళ్ళిపోతుంది. అయితే, విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా, హోళిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో కాలిపోయి మరణిస్తుంది. హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.
హోలీ పండుగను జరుపుకోవడంలో హోలికా దహనం యొక్క కథ మాత్రమే కాదు, మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శివుడు తపస్సులో ఉన్నప్పుడు ఆ దేవదేవుడికి ఆటంకాలు కలిగించడానికి కామదేవుడు పూల బాణాలు వేస్తాడు. శివుడు ఆగ్రహాన్ని పొంది కామదేవుడి శరీరాన్ని నాశనం చేస్తాడు. మూడవ కన్నుని తెరిచి అతడి శరీరాన్ని బూడిద చేస్తాడు. రతీ దేవి తన భర్తయిన కామదేవుడిని బతికించమని శివున్ని ప్రార్థన చెయ్యగా, కరుణామయుడైన శివుడు చివరకు కామదేవుడికి ఊపిరి ఊదుతాడు. హోలీ ముందురోజు కాముడి దహన వేడుకలు జరుపుకుంటాం.
శాస్త్రీయ కారణాల ప్రకారం హోలీ
శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకోవాలంటే, వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీని వల్ల వైరల్ జ్వరాలు, జలుబులాంటి వ్యాధులు పెరుగుతాయి. కనుక కొన్ని ఔషధ మొక్కల ద్వారా తయారు చెయ్యబడిన మరియు సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఇలాంటి వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది పూర్వకాలం ద్వారా తెలుస్తుంది. కుంకుమ, పసుపు, బిల్వాలను తీసుకుని ఆయుర్వేద వైద్యులు ఔషధ మూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కొరకు మోదుగ పువ్వుల్ని రాత్రం మొత్తం మరిగించి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు. అప్పుడు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అలా సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుంది.
విదేశాల్లో కూడా హోలీ వేడుకలు
కాలంలో సంవత్సరాలు గడిచేకొద్దీ ప్రవాస భారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాల్లో, అనగా ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు. మతాలు ఏవైనా సరే రంగుల పండుగ హోలీ అంటే చాలు అందరికి ఎంతో ఉత్సాహం వచ్చేస్తుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా స్నేహితులు, బంధువులతో ఎంతో ఆనందరంగా ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటారు.
హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ విశిష్టత ఏంటి?