శబ్ద విజ్ఞానము
వేద మంత్రం – శబ్ద వైద్యము మరయు అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గములు.
రేడియో నుండి శబ్ద తరంగాలు విద్యుశ్చక్తి సంమిస్రణము వల్ల చాల దూరము వేల్లగలుగుతాయి. వాటిని ప్రపంచమంతా వినగలుగుతుంది.విద్యుశ్చక్తి తో కలవని మన మాటలు వెయ్యి గజాల దూరము కంటే ఎక్కువ దూరము వినిపించవు .అదే విదముగా మంత్రోచ్చారణ ప్రచండము ,వ్యాపకము చేయుటకు వ్రుదయము యొక్క విద్యుద్దారమును ఉపయోగించాలి .శ్రద్ద ,విశ్వాసము,భక్తి లను సమన్వయ పరచి జప సబ్ధావలిని ఒక శక్తీ ప్రవాహముగా అవిర్బ వింప చేసి అభిష్టమును సాదించ వలెను.
మంత్రానికి వినిపించే ధ్వని ,వినిపించని ధ్వని ఉంటాయి సబ్ద్దోచారణ తోపాటు ఒక ప్రతి ధ్వని ఉత్పన్న మౌతుంది .అది ప్రత్యక్ష ఉచ్హారణ కంటే అదిక సుక్ష్మం అవుట వల్ల ఎక్కువ శక్తీ వంతముగా ఉంటుంది
శరీరములో సందేశ వాహక నరాలు రెండు రకాలుగా ఉంటాయి మస్తిష్కము వైపు సందేశాన్ని తీసుకేలతాయి. మస్తిష్కమునుండి సందేశాలు తీసుకొస్తాయి .వీటిని ఎఫిరెంట్ మరియు ఇఫరెంట్ నరాలు అంటారు .ఒకచోట ఒక నరము తెగితే ఆ అవయమునుంచి సంబందము తెగి పోయి అక్కడ నుండి సందేశము రాదు.లేక అక్కడికి సందేశము వెళ్ళదు.సవితా శక్తితో ఉపాసన ద్వారా ఏర్పడే సంబందము విచేదితమగుట వలన నేడు ప్రపంచములో అశాంతి అవ్యవస్తలు కనిపిస్తున్నాయి.
శబ్ద బ్రహ్మ -నాద బ్రహ్మ
బౌతిక జగత్తులో అనేక శక్తులు ఉన్నాయి .వాటిలో 5 శక్తులు ప్రాముక్యత ఉన్నది .
నిత్య జీవితములో ఈ శక్తులను పరస్పరము ఒకదాని నుండి ఒక దానికి రుపంతరణ చేయవచు .సృష్టి యొక్క శాశ్వత నియమము ఏమిటంటే శక్తి నశింప బడదు.ఇది రుపంతరణ చెందుతుంది .
చేతనత్వ విజ్ఞానము యొక్క ఆధారము, శబ్ద శక్తి,చేతనత్వ క్షేత్రములో శబ్ధము లేక ధ్వని ఇందనము లాంటిది .దీనిని శబ్ద శక్తీ -ధ్వని ఊర్జ -అనాహత నాదము -శబ్ద బ్రంహ నాద బ్రంహ అనే పేర్లతో పిలుస్తారు .వీటికి అనేక రుపాలున్నాప్రత్యక్షముగా మనము నత్య జీవితములో దీనిని పరస్పరము మాట్లాడుకొనే ప్రక్రియలో ఉపయోగిస్తాము .దీనినే వైకరీ వాణి అంటారు ఉత్శాహము ,ప్రేరణను కలుగ చేసే రెండు మాటలు నిరుత్సాహ వంతులలో నూతన ప్రాణమును నింప గలవు .
వ్యక్తి యొక్క మస్తిష్కములో 50%నుంచి 60% భాగము ధ్వని కొరకు సురక్షితమై ఉన్నది. దీనిని బ్రోకాస్ క్షేత్రము [Broca ‘s Area ]అంటారు .మనవ మస్తిష్కములో సేరేబ్రెల్ కార్దిక్స్ లో ఎక్కువ భాగము ధ్వనికి సంబంచిన కేంద్రాలున్నవి.వాటిలో ముక్యమైనవి
[1] బ్రోకాస్ క్షేత్రము [Broca ‘s Area ] ఇది ధ్వని ఉత్పాదన కేంద్రము,
[2] వేర్నిక్స్ క్షేత్రము [Vernicke”s Area ]ఇది ధ్వనిని అవగాహనా చేసు కొనే క్షేత్రము ,
[3] పెరెఫ్రంటల్ కార్టెక్స్ [Perefrontal cortex ] ఇది ఆలోచనల విస్తరణకు ఉపయోగపడుతుంది ,
[4] విజువల్ అసోసియేషన్ కార్టెక్స్ [Visual Association cortex]
.ఇది శబ్దమును చూడటానికి ఉపయోగ పడుతుంది .ఈనాలుగు వాణి యొక్క పరా,పశ్యన్తి ,మాద్యమ మరియు వైకరీలకు ప్రతీకలుగా అర్ధం చేసు కోవాలి .
సబ్ధముల స్తూల ఉపయోగము భాష,జ్ఞానము మరియు అనుభవాలను ఇచి పుచు కొనుటకు ఉపయోగపడుతుంది .సాదారణముగా సంబాషణలో సత్యత ,నమ్రత ,శిష్టత తమ ప్రభావాన్ని చూపిస్తాయి .నిజానికి వాక్ శక్తీ ఒక శక్తీ శాలి ఇందనము.ఇది శరీరములోసుక్ష్మ శక్తీ కేంద్రాలని ప్రభావితం చేస్తుంది.
జపము చేస్తున్నప్పుడు సబ్ధముల ప్రభావము షట్ చక్రముల మరియు గ్రందుల యొక్క సుక్ష్మ స్తానముల మీద పడుతుంది .అంటే కాక మనస్సు ,ఆత్మ శక్తులని కూడా వికసింప చేస్తుంది.కృత్రిమమైన స్వార్ద పూరితమైన కపటపు మాటలు అంతః కరణముల మీద మాలిన్య పొరలను రూపొందిస్తాయి .
స్వరములను మన సుక్ష్మదర్శి ఋషులు ఎంత దివ్య దృష్టి తో రచించారంటే వాటి ఉచ్హరణ, వినటము మన శరీరము ,మనస్సుల మీద అత్యంత ఉత్తమమైన ప్రభావము కలుగ చేస్తుంది .వ్యన్జనములతో [హల్లులు ] స్వరముల కలయికల వల్లనే సబ్దోచారణ సంబవము .ప్రపంచములోని ఇతరుల భాషకంటే సంస్కృత భాష యొక్క విశేషత ఏమిటంటే దీనిని ఉచ్హరణ చేసినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ సుక్ష్మ వ్యౌగికవ్యాయామము కూడా జరుగుతూ ఉంటుంది .వినే శక్తీ ,మాట్లాడే శక్తీ యొక్క శారీరక ,మానసిక ఆరోగ్యము మీద ఉత్తమ ప్రభావము పడ్తుంది అందు వలన వేదములోని వేద సూక్తములు పటించిన లేక వినిన అనారోగ్యము కుదుట పడ గలదు ఇది మన ఋషులు పాటించి ఫలితము పొంది మనకు తెలిపి యున్నారు .
శబ్దము వాటి ప్రభావము
అ
యొక్కఉచ్హరణ కంథము ద్వరా జరుగుతుంది .దీని ప్రభావము హృదయము మీద పడుతుంది .అందువలన “అ” అని ఎన్ని సార్లు ఉచారణ చేసినా వినినా అన్ని సార్లు హృదయము మీద ప్రభావము పడుతుంది .శరీరములో రక్తమును సుద్ది చేసే క్రియ హృదయము ద్వారానే జరుగుతుంది .హృదయము చెడు రక్తమును ఉపిరి తిత్తులకు పంపుతుంది .అక్కడ సుద్ది చేయబడిన రక్తము మళ్లీ హృదయానికి వెళ్లి అక్కడి నుండి రోగ గ్రస్తమైన అంగానికి వెళ్లి నప్పుడు రోగ నివారణ జరుగుతుంది “అ “అనే అక్షరము శుద్ద రక్తమును సంచారము చేస్తుంది .మంత్ర శాస్త్రములో “అ “అనే స్వరము “రచనాత్మక శక్తీ సంపన్నముగా” చెప్పా బడుతుంది .దానిని నిర్మాణాత్మక శక్తీ అని కూడా అంటారు .”అ”క్షారాణం అకారోస్మి ,అని శ్రీ కృష్ణుడు గీతలో చెప్తాడు .
ఆ
యొక్క ఉచ్హరణ ప్రభావము ఊపిరి తిత్తుల పై భాగము మీద ,చాతి మీద పడుతుంది రిబ్ కేజ్ [ribcege ] యొక్క పై మూడు ఎముకలకు పుష్టినిస్తుంది .యుసోఫాగాస్స్[oesophagus ] -కడుపుకు ఆహారము తీసుకు వెళ్ళే నాళికను సుద్దము చేస్తుంది .మస్తిష్కమును వికసింప చేస్తుంది .బద్దకాన్ని పోగొడుతుంది .ఊపిరి తిత్తులను ఉత్తెజము చేసి దాని పై బాగామును సుద్దము చేస్తుంది .దీని అబ్యాసము వలన దగ్గు, ఆయాసము తగ్గిపోతాయి.చీకటిలో వంగి పని చేసేవారు ,క్షయ రోగులు .క్షయ రోగ సంభావన ఉన్నవారు దీనిని తప్పని సరిగా అబ్యాసము చేయుట ఎంతైనా చాల మంచిది .
ఇ – ఈ
ఈ స్వరము దీర్గ ఉచ్హరణ మెడ ,మస్తిష్కమును ప్రభావితము చేస్తుంది .వీటి ఉచ్హరణ వలన గొంతుక ,తాలు ,ముక్కు మరయు హృదయముల యొక్క పై బాగములు క్రియా కలాపాలు విశేషముగా ఉత్తెజితమవుతాయి .శ్వాస ఇంద్రియములో ఏకత్రితమై ఉన్న కఫమును బైటకు నెట్టి ఈ అంగమును సుబ్రపరుస్తాయి .వీటి ప్రభావము శరీరము యొక్క పై భాగముల మీద కూడా పడుతుంది .తలనొప్పి మరియు హృద్రోగాలకు లాభదాయకము .ఉదాసీనత ,నిర్లిప్త స్వభావము గల వారికి ,క్రోధము వచ్చే వారికీ ఇది చాల ఉపయోగ కారిణి
ఉ – ఊ
ఈస్వరము ఉచారణ వల్ల కడుపు ,కాలేయము,జీర్నా శయము మీద వీటి ప్రభావము పడుతుంది గర్బా శయము యొక్క బారమును తగ్గించును వాటి నిమ్న బాగాములో బాధపడే స్త్రీలు “ఉ-ఊ ” ఉచ్హరణ చేసిన చేసేటప్పుడు వినిన ఖచితముగా లాభమును పొంద గలుగుతారు .ఎంత దీర్గ కాలిక మల బద్ధకం ఉన్నా దీని ద్వరా దూరము చేసుకోన వచ్చు .ఇది స్త్రీల యొక్క గర్బ సంచి [Uterus ] కి సంబంచిన బాధల నివారణకు బాగా ఉపయోగ పడుతుంది .
ఏ – ఐ
ఈ అక్షరముల స్వరముల ఉచారణ ప్రభావము మెడ మరియు శ్వాస నాలికలు ఉద్భవస్తానము మీద పడుతుంది .ముత్ర పిండాలు ఉత్తెజమవుతాయి .దీనిని అనేక సార్లు ఉచరించటం వల్ల లేక వినుట వల్ల మూత్ర సంబందమైన అనేక రోగాలు దూరమవుతాయి .మూత్రము రాక బాధపడే వారికీ ఇది ఒషదముగా పని చేస్తుంది .పాటలు పడే వారికీ ,అధ్యాపకులకు ,ఎక్కువ మాట్లాడే వారికీ ఈ స్వర ప్రయోగము విశేష లాభ దాయకము .నాలిక లోపల ఉన్నజిగట పొరలను ఆరోగ్య వంతము చేస్తుంది .
ఓ – ఔ
ఈ అక్షర స్వర ప్రభావము ఉపస్తేన్ద్రియము మరియు జననేంద్రియము ల మీద ఉంటుంది ఈ స్వరములు అవి స్వబవికముగా మరియు సహజముగా పని చేయుటకు సహాయ పడతాయి. దీని ఉచారణ బాగా అబ్యాసిన్చినప్పుడు బల హీనమైన నరాలు శక్తి వంతమై హాయిగా తమ స్వాబావిక క్రియా కలాపాలను చేయగలుగుతాయి .ఇది చాతి యొక్క మద్య భాగమును ఉత్తెజితము చేస్తుంది.న్యుమోనియా మరయు ఫ్లురసీ లాంటి రోగాలు నివారణలో ఇది చాల లాభ దాయకము .
అం
ఈ అక్షరాల ఉచరనలొ నాసిక ద్వరా తీసుకొనే శ్వాస తో పాటు ఆక్సిజన్ మరియు ప్రాణ శక్తి శరీరము లోకి వెళుతుంది .అది చెడు రక్తమును సుద్దముగాను మరియు యర్రగాను చేస్తుంది నాసిక ద్వారా శ్వాసను తీసుకొనుటలో నాసిక మరియు శ్వాస నాలికలను ఉపయోగించు కోవాలి .అందు వల్ల ఈ అంగములు వికార రహితము మరియు రోగ రహితముగా ఉండుట అత్యావశ్యకము ఈ అభిప్రయముతోనే మన మహర్షులు ప్రీతీ భీజ మంత్రము చివరిలో “మ్”లేక అనుస్వర [అం] మును పెట్టారు .దానిని చాలాసేపు సాగ దీసి ఉచ్చారణ చెయ్యమన్నారు ..స్వరముల ఉచ్చారణ సమయములో నోరు తెరుచుకుంటుంది అనుస్వర ఉచ్చారణ సమయములో పెదవులు మూసుకుంటాయి .
అః
ఉచ్చారణ వలన జిహ్వ ,అంగిలి యొక్క అగ్ర బాగాన్ని సృశిస్తుంది .దీని ప్రభావము వలన మస్తిష్కములో సంచాలన ముత్పన్నమై ఒక విదమైన రసము స్రవిస్తుంది దానిని సెరేబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు .అది కంటము ద్వారా లోనికి వెళ్లి శరీరము యొక్క అన్ని వికారములను దూరమ్ చేస్తుంది .చాతి మరియు గొంతుకను ఉత్తెజింప చేసి వాటిని శక్తీ వంతముగా ,పుష్టి వంతముగానుచేస్తుంది .
12 స్వరాలూ శరీరము యొక్క హృదయము మొదలైన ముక్య అంగాలను కుదిపి ఉత్తెజము చేస్తాయి .ర్కతమును సుద్ది చేసి ,ప్రాణ వంతము చేసి సమస్త వికారములను దూరం చేస్తాయి.రక్తము యొక్క తీవ్ర ప్రసరణవలన ,నదులు,ఇంద్రియాలు తమతమ క్రియా కలాపాలను సహజ ఆరోగ్యముతో చేయగలిగినప్పుడు బాహ్య రూప ,స్వరూప, ఆకార ,బలములో ఉన్నతి అగుటయే కాక రోగనిరోదక శక్తీ మరయు సాహిష్టుతను కుడా పెంచుకొని ఆద్యాత్మిక వైపుకు ప్రవ్రుత్తమౌతాయి .
స్వర యోగముతో దివ్య జ్ఞానము
ప్రకృతి అంతరాళములోఅనంత ప్రాణ శక్తీ యొక్క వైభవము సర్వత్రా వ్యాపించి ఉంది .యోగులు దీనిని తమలో దారణ చేసుకొని అనేక సిద్దులు పొంద గలుగుతారు .స్వర విజ్ఞానము ,ప్రాణ విద్య అన్యోన్యాశ్రితములు.స్వర విగానమును ఆదారము చేసుకొని ప్రాణ యోగ సాదనలన్ని నిర్మించ బడ్డాయి .
వ్యక్తిగత ప్రాణము ,సమిష్టి గత మహా ప్రాణ ప్రవాహములు 5 రకములు .
అవి 1 ప్రాణ 2 అపాన 3 సమాన 4 వ్యాన 5 ఉదాన
1 ప్రాణము : శరీర ధారణకు కావలసిన శ్వాస, ఆహారము,శబ్ద ఉచ్చారణ మరియు శరీరములోబలము చేకూర్చే క్రియాకలాపాలకు ప్రాణ శక్తీ ఆధారము.
2 అపానము : మల – మూత్రములు ,కఫము ,వీర్యము ,రజము మొదలగు వాటి విసర్జన క్రియల్లో ప్రముక పాత్ర వహించే శక్తీ
3 సమానము : అరుగుదల దానికి సంబందించిన ఎంజైమ్స్ రసాన్ని ,రసములను ఉత్పాదన చేసి శరీరము అంతావితరణ చేసే శక్తీ
4 వ్యానము : రక్త సంచార వ్యవస్తను ,సంవేదనలను గ్రహించే నాడీజాలములో ప్రవహించే విద్యుద్దారలు,మొదలగు వాటిని తెలియ చేసే ధారణా శక్తి .
5 ఉదానము : శరీరము లోని దాతువులను ధారణ చేసి ,శరీరమునకు బలమునిచ్చి ఉన్నత స్తితిలో ఉంచే శక్తీ ,దీని గతి ముఖము ,నాసిక ద్వారా జరుగుతుంది .నాసికాగ్రము నుండి హృదయము వరకు దీని కార్య క్షేత్రము ,దీని క్షేత్రం హృదయము నుండి నాభి వరకు వ్యాపించి ఉంటుంది.