పండుగలు

వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం

వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం
Views: 1

వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం

రవి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.  ఉత్తాన ఏకాదశి తరువాత సరిగా నెలరోజులకు మార్గశిర శుక్ల ఏకాదశి రాగలదు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వం తూర్పుటాకాశంలో విష్ణువునక్షత్ర శరీరంలో కి ప్రదేశం వరకు కనిపిస్తుంది. ఈ రోజు మంచి రోజు కాబట్టే కృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. కాబట్టి ఈ ఏకాదశిని భగవద్గీత ఏకాదశి అని కూడా పేరు వచ్చింది.

విభూతియోగంలో ముప్పయైదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాసానాం మార్గశీర్షోహమ్‌ అంటే పన్నెండు మాసాల్లో మార్గశిర మాసం నేనే సుమా అని ఢంకామీద దెబ్బక్టొటినట్లు చెప్పాడు. కృష్ణడే స్వయంగా ఈ విషయాలు చెప్పినట్లు ఉన్నది. అర్జుని రథసారధిగా అర్జునుని రథంపై కూర్చుండి గీతామృతాన్ని ఉపదేశించాడు. కృష్ణుడి కి ప్రదేశం వరకు గల పై భాగమే ముఖ్యంగా కనబడుతుంది. ఈరోజున శ్రీ మహావిష్ణువు మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని భక్తుల నమ్మకం. కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఇది మూడు కోట్ల ఏకాథులతో సమానం.

వైకుంఠ ఏకాదశి విశిష్టత పూజా విధానం

స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం వరకు ఉన్న నక్షత్రాలను విష్ణుపదం అనే పేరుతో పిలుస్తారు. వైదిక మంత్రం కూడా ఉంది. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః అని. అంటే పండితులైన జనులు చూస్తుటాంరు అని అర్థం.

ఆషాఢమాసం నుంచి ఇప్పివరకు వచ్చే ఏకాథులకు ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. చాతుర్మాస దీక్ష ప్రారంభించే వారు ఆషాఢ ఏకాదశి నుంచి ప్రారంభం చేస్తారు ఆ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ రోజు కూడా ఉపవాసం  చేస్తారు. శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదైకాదశి అంటారు. అంటే సంతానంకోసం ఆలోచించేవారు ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టి  ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేస్తారు. వారికి సంతానం కలుగుతుంది. భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తనేకాదశి అంటారు. ఈ ఏకాదశిరోజు విష్ణువు ఎడమనుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటారుడు అని అర్థం. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశికి పాశాంకుశైకాదశి అంటారు. ఈ వ్రతం చేసినవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని కొన్ని గ్రంథాలలో చెప్పారు. కార్తీక శుద్ధ ఏకాదశి. ఇది ఉత్తాన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు నిద్రనుండి మేల్కొటాండని అర్థం. తర్వాత వచ్చేది ముక్కోటి ఏకాదశి.

ఒక పురాణకథ ప్రచారంలో ఉంది. మురాసురుడనే రాక్షసుడు దేవతలను హింసిస్తుంటే విష్ణుమూర్తి అతని పైకి దండెత్త డానికి వెళతాడు. అప్పుడు ఆ రాక్షసుడు తప్పించుకుంటారుడు. విష్ణువు అతన్ని రప్పించడంకోసం ఒక గుహలో దాక్కొంటాడు. ఆ రాక్షసుడు వస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి దుర్గాదేవి అవతారంలో ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుంది. అసలు ఇందులో అర్థం ఏమిటంటే ఆ విష్ణువు ఎక్కడో లేడు. మన హృదయమనే గుహలోనే ఉన్నాడు. మనం అతన్ని జయించాలంటే కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1 ఈ 11 ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని అర్థం. వీటిని అదుపులో పెట్టుకునే మార్గం, జపం, దాన, ధ్యానాదులు. కాబట్టే ఈ రోజుల్లో ఉపవాసాలు ఉండడం, దాన ధ్యానాదులు చేస్తూ దేవుడితో ఎక్కువ సేపు గడపడం చేయమని చెప్పేది. అసలు ఈరోజున ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు. మానవ శరీరంలో80 వరకు నీరు ఉంటుంది. చంద్రకిరణాల ప్రభావం ఈరోజున ఉదర ప్రాంతం అంటే పొట్టపై ఎక్కువగా పడతాయి. అందుకే తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం కాదు. అక్కడ ఆహారం ఉంటే ఆ కిరణాలు జీర్ణశక్తిని పోగొడతాయి. కాబట్టి ఉపవాసం ఉండమని చెపుతారు. ఉపవాసం ఉంటూ ఏమి చేయాలి అంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. భగవద్గీతద్వారా ఎవరికి కావలసిన జ్ఞానం వారు సంపాదించుకోవచ్చు. అది అన్ని వయసులవారికి అర్థమౌతుంది కాబట్టి ఈ రోజు ఎక్కువగా జ్ఞానాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేయడం ప్రారంభిస్తే తొందరగా జ్ఞానం సంపాదించుకోవచ్చని ఆ పనిని మొదలుపెట్టమని చెపుతారు.

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు:

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు మాత్రం శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని అంటారు

వైకుంఠ ఏకాదశి నాడు పూజ ఎలా చేయాలి?

వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

అందుచేత వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
ఇకపోతే… వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

Leave a Reply