Vedic Science

బొడ్డు తాడు – Umbilical Cord

బొడ్డు తాడు – Umbilical Cord
Views: 0
Related image

పురాతన కాలంలో పిల్లల బొడ్డు తాడును పెద్దలు దాచి పెట్టేవాళ్ళు. తాయత్తుని మనం చాలా అవహేళన చేస్తున్నాం, వెక్కిరిస్తున్నాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డును (Umbilical cord) ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు “బొడ్డు తాయత్తు” మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండి తాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే “తాయత్తు మహిమ” అనేవారు. ఈ “తాయత్తుమహిమ” అనే పదానికి అసలైన అర్థమిదే. ఈ బొడ్డుతాడు ను పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాలా క్యాన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేము. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపాత్సమయంలో వెతికే అవసరం ఉండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.

ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెం సెల్స్ క్యాన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయల పైనే ఉంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది, వెక్కిరించబడుతు౦ది.

అతి ప్రాచీన కాలంలో కూడా పిల్లల బొడ్డుతాడుని దాచి పెట్టేవాళ్ళు. కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు. చెప్పగలిగిన పెద్దవాళ్ళు కనిపించలేదు. పూర్వ కాలంలో అలా ఎందుకు చేసేవాళ్ళో తెలియదు. అందుకేనేమో ఆ తర్వాత మూఢ నమ్మకాలు ప్రబలాయి. పిల్లల్లేనివాళ్ళు ఈ బొడ్డు తాడు మింగితే వారికి సంతానం కలుగుతుందని కొందరు సంతానం కోరి దీనిని మింగేవాళ్ళు. కొందరు దీనిని తాయత్తులలో వేయించి పిల్లలకి కట్టేవాళ్ళు.

అనేక పరిశోధనల తర్వాత ఈ మధ్య బొడ్డు తాడు విలువను గుర్తించి వాటిని దాచి పెట్టటానికి ఒక Bank పెట్టారు. దీనిలో 40 సంవత్సరాల వరకూ బొడ్డుతాడుని దాచిపెట్టవచ్చు. అయితే ఇప్పుడు మనకు కారణాలు తెలుసు. ఆధునిక పరిశోధనలలో తేలింది ఏమిటంటే, బొడ్డు తాడులో వున్న మూల కణాల సహకారంతో ఆ వ్యక్తికి భవిష్యత్తులో ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినప్పుడు వైద్య చికిత్స చెయ్యవచ్చు, దానితో అద్భుతమైన ఫలితాలు రాబట్టచ్చని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.

పూర్వకాలంలో (అప్పుడు మన దగ్గర కేవలం ఆయుర్వేద వైద్యం మాత్రమే వుండేది) మన పెద్దలు, మన వైద్యులు ఎంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగి వున్నారో తెలుస్తోంది. బహుశా వాళ్ళు ఈ వైద్యం చేసేవాళ్ళేమో. అయితే మనకి ఆధారాలు లేవు.

 

సేకరణ: కొండూరు వాసుదేవరావు గారు, గోపురం కార్యక్రమంలో సంధ్యాలక్షి గారు

Leave a Reply