పరశురామ కార్తవీర్యార్జునుడి యుద్ధ కథ
శ్రీక్రిష్ణులవారు “శుద్ధ సాదులందు, సురులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదివియందు వెళ్ళిన నాడు హింస పొందువు” అన్నారు..
అంటే.. వేదాన్ని ప్రమాణం చేసుకుని ఉన్న బ్రాహ్మణుల జోలికి, దేవతల జోలికి, ఆవుల జోలికి, ధర్మంగా బ్రతికే వాళ్ళ జోలికి వెళ్ళిన నాడు హింస పొందేస్తావు…
► కార్తవీర్యార్జునుడు వేయిచేతులతో ఉంటాడు. ఎందుకో ఒకరోజు వేటాడడానికి అరణ్య్నానికి వచ్చాడు. “విధి” అని ఒకటి ఉంటుంది కదూ… అప్పుడే ఆయనకి ఆకలి, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారు అని వేతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో “జమదగ్ని” మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పటికి పరశురాముడు ధర్భలకి, కట్టెలకోసం అడవికి వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకా దేవి, నలుగురు కొడుకులే ఉన్నారు.
► కార్తవీర్యార్జునుడు అన్నాడూ… “నేను మధ్యాహ్నం వేటకోసం వచ్చాను. ఆకలేస్తుంది ఆతిద్యం ఇవ్వండి అని అడిగాడు”.
అప్పుడు జమదగ్ని”ఇంటికొచ్చిన అతిదికి లేదనకూడదని వెంటనే తన దగ్గరున్న కామదేనువును పిలిచి కార్తవీర్యార్జునుడుకి, తన సైన్యానికి పదార్ధములను శ్రుజించమన్నారు.”
కామదేనువు వెంటనే ఇచ్చేసింది. అవన్నీ వడ్డించారు. రాజు అన్ని తిన్నాడు.
“రాచ బుద్ది రాచ బుద్ది కదూ”!! ఆయనన్నాడు…
|| రత్నహారీచపార్ధివా || అన్నాడు. అంటే… లోకంలో ఏది అందంగా, విలువైందిగా కనపడితే అది నాదీ అని పట్టుకుపోతుంటాడు రాజు. అదేమిటండి అని అడగడానికి ఉండదు.. కాబట్టి రాజు ఎవరు అంటే రత్నహారీచపార్ధివా. నేను “కామదేనువుని” తీసుకుపోతా అని కూడా అనకుండా.. “వీళ్ళని అడిగేదేమిటిరా!! ఈ ధేనువు మనదే! రాజరికం నాది… వీళ్ళ దగ్గర ఎందుకు, హోమం చేసుకోవడానికి తప్ప ఏమి ఉపయోగం వాళ్ళకి..”ఎంతమందికైనా అన్నం పెట్టే ఈ కామదేనువు నా దగ్గరుండాలి. తోలుకురండి అని వెళ్ళిపోయాడు.
► జమదగ్ని కార్తవీర్యార్జునుడిని శపించగలడు. కాని బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనను తాను ఉద్దరించుకోవడానికి, పదిమందిని రక్షించడానికే తప్పా, పది మందిని పాడుచేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్ని శపించలేదు, సహనం పట్టారు!
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
ఎప్పుడయినా ఒక దేశం గాని, ఊరు గాని, ఒక ఇల్లు గాని సర్వనాశనం అయిపోతు౦దనడానికి గుర్తేమిటంటే, “ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం”. అదే పనిగా పెట్టుకుని ఆవుల్ని కొడుతుండడం, తోస్తుండడం, సంహరించడం, బాధపెట్టడం లాంటి పనులు చేస్తే కట్టి కుదిపేస్తుంది. అది రాజ్యమయితే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు. సర్వనాశనం అయి తీరుతాయి! మీరు ఎక్కడ వాంగ్మయం చూడండీ.. గోవు పరదేవతా స్వరూపం. గోవు జోలికి వెళ్ళకూడదు!
నిష్కారణంగా గోవు జోలికి వెళ్ళారో.. “గోదూముక దోషం” అంటే ఎలాంటి దోషము మీ ఖాతాలో వేస్తారో తెలుసా…?
ఏ “శంకరాచార్యుల” వంటి మహానుభావుడో ఇంటి ముందుకి వచ్చి నిలబడితే, బిక్షం వేయకపొగ తిట్టి పంపించిన ఫలితం వేస్తారు. అది మామూలుగా విడిచిపెట్టదు. వంశాన్ని కట్టి కుడుపుతుంది!!
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
► “కామ దేనువు” జోలికి వెళ్లి ఎత్తుకుపోతున్నాడు కార్తవీర్యార్జునుడు. దాన్ని డొక్కలో కొట్టుకుంటూ తీసుకుపోతుంటే, ఆ ఆవు ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అది ఇంకా పెద్ద పాపమై కూర్చు౦ది. “కామ దేనువు”కి కార్తవీర్యార్జునుడిని చంపయడం పెద్ద విషయం కాదు. చంపేస్తుంది. కానీ, “ఈశ్వర శాశనం” ఒకటి ఉంది కదూ.. “పరశురాముని” యొక్క ఆవేశం వేరుగా మారాలి! అందుకే ధేనువు అలా వెళ్ళింది.
► అది వెళ్లిపోగానే పరశురాముడు ఇంటికి వచ్చాడు. దూడ అరుస్తుంది, తండ్రి బాధగా కూర్చున్నాడు. “నాన్నగారు ఏమైంద౦డి. మన ఇంట్లో ఉన్న ఆవు ఏమైంది” అని అడిగాడు.
► “కార్తవీర్యార్జునుడు వచ్చాడ్రా.. నేను ఆతిద్యం ఇచ్చాను. ఆతిద్యం అంతా తీసుకుని చెప్పనయినా చెప్పలేదు, ఆవుని తోలుకురండి అని దూడని వేరు చేసి ఎత్తుకుపోయాడురా” అన్నారు జమదగ్ని మహర్షి.
పరశురాముని ఆవేశంగా: అంత పని చేస్తాడా నాన్నగారూ, నేను వెళ్లి తీసుకువస్తా అని వెంటనే తన పరశూవు తీసుకుని భుజం మీద పెట్టుకుని రాజ్యం వైపుగా పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
► పరశురాముడు కార్తవీర్యార్జునుడి చుట్టూ ఉన్న అనేకమంది రాజులు, సైన్యం చూసి..
“ఏరా.. నువ్వు ఆవుని విడిచిపెడతావా లేక నాతో యుద్ధం చేస్తావా” అన్నాడు.
కార్తవీర్యార్జునుడు: “బ్రాహ్మణుడు వెర్రివాడు.. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్ముణివోలె ఉండలేక భూపాలురితోడా భూరిభల సత్త్యులతోడా భయంబుతక్కీ కయ్యాలకోచ్చినాడు… మనయందిక పాపము లేదు, లెండు లెండు, ఏల ఉపేక్షి౦పగనీభూసురిని, నేయుడు వేయుడు కూర్చుడుంమహిం” అని అన్నాడు.
బ్రహ్ముడంటే అంత చులకనా.. గర్వం ఎక్కువైపోతే ఎమవుతుందీ. || ఇదం క్షాత్రం ఇది౦ బ్రాహ్మం || అనీ.. ఆకరికి ఆయన విజ్రు౦భి౦చిన తరువాత తెలిసింది. ఒక్క ఆవు వలన పరశురామ అవతారం అంత క్రౌర్యానికి వెలిపోయి౦ది. పరశురామ అవతారం ఇరవైయోక్క మాట్లు భూమి అంతటా దండయాత్ర చేసి క్షత్రీయులని చంపడానికి కారణం కేవలం “గవు” జోలికి వెళ్ళడమే.
• బ్రాహ్ముడు వెర్రివాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు:
వాడు బ్రాహ్మణుడు. ఏమీ తెలియదు.
• బ్రాహ్ముణివోలె ఉండలేక:
ఎవడైనా ఎత్తుకుపోతే ఏడుస్తూ కూర్చోవాలి.
• భూపాలురితోడా భూరిభల సత్త్యులతోడా భయంబుతక్కీ కయ్యాలకోచ్చినాడు:
పిరికివాడు కనుక, యుద్దాలకి రావడం ఏమిటి!!
• మనయందిక పాపము లేదు:
బ్రాహణుడిని మనం చంపితే పాపం గాని, వాడే మనతో యుద్దానికి వస్తే తప్పేమిటి. చంపేయండి.
• లెండు లెండు:
కాబట్టి, లేవండి లేవండి.
• ఏలఉపేక్షి౦పగనీభూసురిని నేయుడు వేయుడు కూర్చుడుంమహిం:
ఎందుకు ఈ భూసురుడిని క్షమించడం. చంపేసేయండి ఈ బ్రాహ్మణుడిని.
అనేటప్పటికి… రాజులు, సైన్యం అందరూ కలిసి ఆయనపై భాణ ప్రయోగం చేసారు.
► అప్పుడు పరశురాముడిలో ఉన్నటువంటి “శివకేశవుల” యొక్క ఆగ్రహం, ఆవేశం బయటకి వచ్చి, తన యొక్క పరశువితో మొత్తం సైన్యాన్ని పడగొట్టి, ఒక్క దూకు దూకి కార్తవీర్యార్జుడి కంఠం, వెయ్యి చేతులను నరికి ఆయన్నీ నరికేసాడు. కార్తవీర్యార్జుడు చనిపోయాడు. ఆ నెత్తురుతో ఉన్న పరశువుని, ఆవుని పట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు.
► నాన్నగారండి, రాజులను, సైన్యాన్ని తేగటార్చి కార్తవీర్యార్జుడి వేయి చేతులను నరికి చంపేసాను. ఆవుని తీసుకువచ్చాను అన్నాడు.