డేవిడ్ ఫ్రాలే
Views: 0
డేవిడ్ ఫ్రాలే గారు అమెరికాలో ఒక కాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆయన సనాతన ధర్మంపై మక్కువతో భారతదేశం వచ్చి రచయితగా, జ్యోతిష్కుడుగా, ఉపాధ్యాయుడుగా మార్పుచెంది “పండిత వామదేవ శాస్త్రి”గా పేరు గాంచారు. అతను వేదాలు, హిందూ ధర్మం, యోగ, ఆయుర్వేదం, జ్యోతిష్యం వంటి అంశాలపై అనేక పుస్తకాలు వ్రాసారు. అతని రచనలు సామాన్య ప్రజలలో ఆదరణ పొందాయి. 2015లో భారతదేశంలో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.
డేవిడ్ ఫ్రాలేగారి కొన్ని మాటలు
- Hindu tradition is not one of mythology but of yogic symbolism and mantric language. Cannot be understood by the mere intellect.
హిందూ సాంప్రదాయం అనేది ఒక కల్పనా కాదు. అది యోగపరమయిన ప్రతీకవాదం మరియు మంత్రపరమయిన భాష. మామూలు బుద్దితో చేసుకోలేనిది. - భారతీయ చరిత్రను తిరస్కరించాలనే ప్రయత్నం యొక్క లక్ష్యం ధార్మిక సంస్కృతిని అణిచివేసి, దేశభవిష్యత్తుకు కీడు తలపెట్టడం.
- The effort to deny the history of India aims to suppress its dharmic culture and harms the country’s future.