నీతి

చాణక్య నీతులు

చాణక్య నీతులు
Views: 0

చాణక్యుడిని కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రంలో నిపుణత కనబరిచాడు. ఇతడు తన సూక్ష్మబుద్దితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకం లో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆ నీతిశాస్త్రం నుంచి విషయాలు కొన్ని భాగాలుగా మీకోసం…

1. ప్రజల సుఖమే పాలకులకు సుఖము. ప్రజల హితమే పాలకులకు మంచి.

2. పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రదేశములలో గృహములను నిర్మించాలి. ఆ గ్రామములలో తటాకములు నిర్మించాలి. దీనివలన నీటి కొరత ఉండదు . రెండవ పంటకు కూడా ఈ తటాకాలు ఉపయోగపడతాయి.

3. ఆనకట్టల నిర్మాణం జరపాలి. నీటిని వృధా కానీయరాదు. ప్రతి చుక్కా విలువైనదే.

4. వ్యవసాయానికి నీటి సౌకర్యం కల్పించాలి. కాలువలు, చేరువుల ద్వారా వ్యవసాయానికి అనూకూల పరిస్థితులు కల్పించాలి.

5. పచ్చిక బయళ్ళు ఏర్పాటు చేయలి. దీనివలన పశువులకు గ్రాసం లభించి పాడి అభివృద్ధి చెందుతుంది.

6. వ్యాపర మార్గాలు ఏర్పాటు జరపాలి. వాణిజ్య సౌకర్యాలు మెరుగుపడటం వలన దేశ ఆదాయం పెరుగుతుంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశం ఉండదు.

7. విదేశీ వ్యవహారాలలోనూ, దేశ రక్షణలోనూ అప్రమత్తత కలిగిఉండాలి. లేదంటే ఇతరులు చొరబాట్లకు అవకాశం కల్పించినట్లు అవుతుంది.

8. దేశక్షేమం కోరే పాలకులు క్లిష్ట పరిస్థితులలో శత్రువులతో కూడా స్నేహం చేయవలసిన పరిస్థితి ఉంటుంది.

9. దేశానికి ఆదాయాన్ని ఇచ్చేదే అయినా ప్రజలకు నష్టం కలిగించే వాటిని వదిలేయాలి. (కాని నేటి పాలకులు ప్రజలను నాశనం చేసే ఎన్నిటినో దేశంలోకి అనుమతులు మంజూరు చేశారు. చేస్తూనే ఉన్నారు.)

10. ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు పాలకుడు అనుక్షణం ప్రజల యోగక్షేమాలు విచారించి తగిన రక్షణ కల్పించాలి.

11. ధర్మరక్షణకు రాజు కఠినముగా ప్రవర్తించాలి. (నేడు అధర్మ రక్షణ బాగా పెరిగిపోతుంది. కూనీలు, కుట్రలు, చేసినవారికి, గజదొంగలకి, రక్షణగా అనేక చట్టాలు వత్తాసు పలుకుతున్నాయి.)

12. పాలకుడు ప్రజలను ఆకారణముగా దండిస్తే ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది. (ఈ విషయంలో ప్రజలు ఒకడుగు ముందుకేసి పొతేపోనివ్వండి అనుకుంటూ దిక్కుమాలిన బ్రతుకులు బ్రతికేస్తున్నారు.)

13. పాలకులు ప్రజాగ్రహానికి గురికాకుండా ప్రజాభీష్ట ప్రకారం పరిపాలించాలి. (ప్రజల ఉదాసీనతని అలుసుగా తీసుకుని పాలకులు చేయని ఘోరం లేదు.)

14. విదేశీయులు పరిపాలిస్తే ధనము వారి దేశమునకు తరలించుకుని పోతారు. (ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం అదే చేసింది. నేడు సోనియా పాలనలో(2006 నుండి -2014 వరకు) ఇదే జరుగుతుంది.)

15. మంత్రులు ఉన్నతాదికారులలో విదేశీయులను నియమించరాదు.

16. విదేశీయులు లాభార్జన దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించవచ్చు. (వరల్డ్ బ్యాంక్ మరియు మల్టినేషనల్ సంస్థలు దేశానికి చేస్తున్న మేలు ఏంటో?)

17. మానవుడు సంఘంలో ప్రతి ఒక్కరితో మిత్రత్వం సలపాలి.

18. వ్యవసాయం చేసే రైతులు, పశు పోషకులు, వ్యాపారస్థులు కూడా ఆయుధ శిక్షణ పొందాలి. దీనివలన వీరు శత్రువుల నుండి తమనుతాము రక్షించుకోవడమే కాకుండా దేశ రక్షణ సమయంలో సైనికులుగా మారి శత్రువులపై విరుచుకు పడతారు.

19. విదేశీ పాలకులు తమకు లాభం లేదనుకున్నప్పుడు దేశాన్ని నిర్లక్ష్యం చేసి తమదేశానికి వెళ్లిపోవచ్చు.

(అలాద్దిన్ ఖిల్జీ అనే క్రూరుడు పోతూ పోతూ ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రంధాలయం ఆయన తక్షశిలని తగలేబెట్టేశాడు. అది పూర్తిగా ద్వంశం కావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. దీనిలో ఉన్న ఎన్నో విలువైన గ్రంధాలు కాలి భూడిద అవ్వడం వలన దేశ భవిష్యత్తు, దేశ తలరాత మారిపోయి ప్రజలు దిక్కుతోచని చదువులతో అల్లాడి పోతున్నారు. అతడివల్లనే మన సైంటిఫిక్ గ్రంధాలన్నీ తగలబడిపోవడం వలన హైందవ పరిశోధనలు ఆగిపోయాయి. మన శాస్త్రాల్లో ఉన్న సైన్సుని సరైన జవాబులు చెప్పడానికి ఇబ్బంది అవుతోంది. అంతేకాదు, వాడు 1500మంది ఆచార్యులు అంటే ఇప్పటి యూనివర్సిటీ ప్రొఫెసర్లనికూడా అక్కడే ఒకేసారి దారుణంగా చంపాడు. మన విజ్ఞానానికి సర్వర్ లాంటిది ఆ యూనివర్సిటీ మరియూ నలందా విశ్వవిద్యాలయమూనూ.)

20. ఉన్నత వంశంలో జన్మించడం (గుణం తక్కువ వాడికి పదవి అప్పగిస్తే అటు దేశానికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఋతువులు సక్రమంగా రావు. తద్వారా వాతావరణ వ్యవస్థ దెబ్బతిని దేశం కరువు కాటకాలు పాలౌతుంది.)
21. దైవభక్తి కలిగి ఉండాలి. (దైవభక్తి గలవానికి తను చేసే పనులను భగవంతుడు చూస్తుంటాడు అనే భావంతో చేడుపనులు చేయడానికి దూరంగా ఉంటాడు)
22. మంచి బుద్ధి కలిగిఉండాలి.
23. బలము కలిగి ఉండాలి. తనను తాను రక్షించుకొనడంతో బాటు ఇతరులను రక్షణ కల్పిస్తాడు)
24. ధర్మతత్పరులైన పెద్దలను కలవడం. (పెద్దలను కలవడం వలన వారి అనుభవముల నుండి సలహాలు స్వీకరించి దేశాన్ని సుస్థిరం చేయగలుగుతాడు)
25. సత్యభాషణ.
26. అనవసరపు వాదనలు చేయకుండా ఉండటం. అతిగా మాట్లాడకపోవడం. (ఈ రెండింటి వలన మీలోని లోటుపాట్లు కనిపెట్టి మీతోబాటు వ్యవస్థకి చేటు చేసే అవకాశం ఉంటుంది)
27. పొందిన మేలు మరచిపోకుండా ఉండాలి.
28. పని పని వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి.
29. చేసే పని యందు ఉత్సాహం కనబరచాలి.
30. ఎప్పటికప్పుడు కొత్తవిషయాలను తెలుసుకోవాలి. జాతీయ గంధాలు పరిశీలన చేస్తుండాలి.
31. అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండాలి. పాలకునికి మతిమరపుతో చాలా ప్రమాదం.

Leave a Reply