కవులు మహాపురుషులు

కిరాతార్జునీయం – మహాకవి భారవి

కిరాతార్జునీయం – మహాకవి భారవి
Views: 1

కిరాతార్జునీయం 6వ శతాబ్దంలో మహాకవి భారవి చే రచింపబడిన సంస్కృత పద్య కావ్యం. ఈ కావ్యం అర్జునుడు మరియు మారు వేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్దాన్ని తెలుపుతూ రాయబడింది. సంస్కృతంలోని ఆరు మహా కావ్యాలలో ఒకటిగా కిరాతార్జునీయం కొనియాడబడింది. ఈ కావ్య రచనా శైలి పద ఎన్నిక మరియు అద్భుత వర్ణన, సంస్కృత పండితుల ప్రశంసలు పొందింది. ఈ కావ్యంలో ఎక్కువగా వీర రసం బాగా వర్ణించబడింది. ఇందులో కవి మహాభారతంలో వనపర్వంలోని ఒక చిన్న భాగాన్ని తీసుకుని వర్ణించాడు.

పాండవులు వనవాసానికి వెళ్ళినపుడు ద్రౌపది, మరియు భీముడు కౌరవులతో యుద్ధం ప్రకటించమని ధర్మరాజును బలవంతం చేస్తారు. కానీ ఆయన అందుకు అంగీకరించడు. చివరగా ఇంద్రుడి సలహాతో అర్జునుడు అడవిలో తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు. శివుడు అందుకు ప్రీతి చెంది ఏమైనా వరం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.

కిరాతుడు – శివుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడు:

అదే అరణ్యం ప్రాంతంలో మూకాసురుడు అనే రాక్షసుడు ఎలుగుబంటి రూపంలో తిరుగుతుంటాడు. అది ఒకసారి అర్జునుణ్ణి చూసి మీదకు దూసుకురాబోతుంది. అప్పుడు శివుడు కిరాతుడి రూపంలో అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి దానివైపు ఒకేసారి బాణం వేస్తారు. అది చనిపోతుంది. అయితే ఎవరు బాణం ముందు వేశారో సందిగ్ధం మొదలౌతుంది. చివరకు వివాదంగా మారి యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధంలో ఎంతసేపైనా అర్జునుడు కిరాతుని ఓడించలేక పోతాడు. చివరకు తప్పు తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుకుంటాడు. శివుడు అతని పరాక్రమానికి మెచ్చి చాలా శక్తివంతమైన పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఆ ఆయుధమే అర్జునుడు *మహాభారత యుద్ధ* సమయంలో కర్ణుని సంహరించడానికి వాడాడు.

Leave a Reply