ఆరోగ్యజీవనం

ఇంద్రియ నిగ్రహణ – సాధన

ఇంద్రియ నిగ్రహణ – సాధన
Views: 1

“ఇంద్రియ నిగ్రాహణ”కు నా ఆధ్యాత్మిక మార్గములో నేను తెలుసుకున్న కొన్ని విషయములు..

English Version: https://rushivarya.com/post/control-sense-organs

ఇంద్రియాల నియంత్రణ, జ్ఞానాంగాలు ఆధ్యాత్మిక సాధనకు ఎంతో అవసరం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి నియంత్రణ లేకపోయినా ఆధ్యాత్మికంగా వెళ్ళడంలో కాని, ధ్యానం చేయడంలో కాని, జీవితంలో కాని విఫలం తప్పక ఎదురవుతుంది.

♦ ఆత్మశోధన ద్వారా మీలో ఏ ఇంద్రియం మీ మనసుకు అలజడ కలిగిస్తుందో తెలుసుకుని, నెమ్మదిగా, నిర్దాక్షిణ్యంగా అదుపుచేయండి.

♦ ప్రత్యేకంగా చేయవలసినది ఇంద్రియాలని గ్రహించే వస్తువులను వదిలేయడం. మనసుకు అత్యాస కలిగించే వస్తువులను మరియు వాటిని కోరుకునే భావాలను పూర్తిగా పతనం చేయాలి.

► సత్యమును పలకండి. చిన్నగా మాట్లాడండి. రెండు గంటలు మౌనంగా ఉంటూ నిశ్శబ్దంగా ఉండడం సాధన చేయాలి. తియ్యగా, ప్రేమగా, మృదువైన పదాలను మాట్లాడండి. కఠినమైన మాటలు చెప్పుకోవద్దు. అటువంటి మాటలను ముమ్మాటికి దూరంగా ఉంచండి. అవి ఎవరినైనా మీకు దూర౦ చేస్తాయి. ఇది ప్రసంగ అవయయం “వాఖు” ఇంద్రియము యొక్క క్రమశిక్షణ.

► కామముతో (కోరికతో) దేనిని చూడవద్దు. మీరు వీధుల్లో వెళ్ళినప్పుడు ఎవరైనా ఎదురుగా వస్తున్నప్పుడు సామాన్యంగా ముఖాన్ని, లేదా శరీరాన్ని చూస్తాము. జ్ఞానేంద్రియాలు సహజంగానే ఆకర్షణకు గురవుతూ ఉంటాయి కనుక వాళ్ళ ముక్కు యొక్క కొన లేదా నడిచే కాళ్ళని చూడండి. ఇక ఎక్కడా చూడకండి. ఇది దృష్టి అవయవము “కంటి” ఇంద్రియము యొక్క క్రమశిక్షణ.

► సామాన్యంగా సువాసనలు వెదజల్లే సెంటును (Perfumes) ఎప్పుడూ వాడుతుంటారు. కొంతమంది అవిలేకుండా ఉండలేరు. కొన్ని సువాసనలు మనసును ప్రేరేపించి దృష్టిని మల్లిస్తుంటాయి. కనుక అటువంటివి ఉపయోగించవద్దు. ఒకవేళ ఉపయోగించినవలసన సందర్బం వస్తే చాలా తక్కువ మోతాదుగల సువాసన వచ్చేవి మాత్రమే చాలా చిన్నగా వాడండి. ఇది “వాసన” అవయవము ముక్కు యొక్క క్రమశిక్షణ.

► ఎప్పుడయినా ఒకసారి ఒక వారం పాటు ఉప్పు మరియు చక్కెరను వదిలేయండి. సాధారణ ఆహారం మాత్రం తీసుకోండి. బయట పదార్దములు తీసుకోవద్దు. వారానికి ఒక్కరోజైనా ఉపవాశం ఉండండి. అలా ఉండడం కష్టమయినప్పుడు కొంచం పాలు మాత్రమె త్రాగండి. కాని సాధన చేస్తూ వారానికి ఒకరోజు ఉపవాశం ఉండండి. ఇది “అభిరుచి” అవయవ౦ నాలుక యొక్క క్రమశిక్షణ.

► ఒక్కోసారి దంపతులు నిగ్రహించుకుని బ్రహ్మాచర్యాన్ని పాటించాలి. ఎప్పుడు మంచం మీదనే పడుకునే వాళ్ళు అప్పుడప్పుడు నేల పైన నిద్రపోవాలి. ఒక్కోసారి పాద రక్షలు లేకుండా నడవాలి. గొడుగును ఉపయోగించవద్దు. ఇది “స్పర్శ” అవయవ౦ చర్మం యొక్క క్రమశిక్షణ.

మీ ఇంద్రియముల యొక్క క్రమశిక్షణను పరీక్షించేందుకు ఒక ప్రశాంతమయిన చోట కూర్చుకుని మీ ఇష్ట దైవంపై మనస్సుని కేంద్రీకరించి, ఆ రూపాన్ని ధ్యానించండి. ఉదాహరణకి “చిన్ని కృష్ణుడిని” ఏకాగ్రతతో మనస్సును కేంద్రీకరించి ఆ పిల్లవాడిని గమనించండి. చిన్ని పాదాలు, చిన్ని పొట్ట, తామర పూవు రేకులవలే చిన్ని చేతులు, చిన్ని నెమలీక, ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ముఖం… ఇలా మీ ఇంద్రియములను క్రమశిక్షణలో పెట్టడం ఒక్కసారే కుదరదు కనుక నెమ్మదిగా సాధన అవసరం.

చివరిగా…………………

For him who has conquered the mind, the mind is the best of friends; but for one who has failed to do so, his very mind will be the greatest enemy. ~ Bhagavadgeeta
మనస్సును స్వాధీనం చేసుకున్న వ్యక్తికి తన మనస్సు ఎంతో ఉత్తమమైనది. కానీ అలా చేయడంలో విఫలమైన వ్యక్తికి అతని మనస్సు ఎప్పుడూ పెద్ద శత్రువుగానే ఉంటుంది ~ భగవద్గీత

 

Leave a Reply