సంస్కృతి సాంప్రదాయం

ఆచారాలు అభీష్టసిద్ధులు

Views: 1

“భారతీయ ఆచారంలో” గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమైనది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!

గృహస్దుయొక్క ఆతిద్యం అందక అతిధి నిరాశతో వెళ్తే, అతిధి చేసిన పాపములు ఏమైనా ఉంటె అవి గృహస్దుకి సంక్రమించి, గృహస్దు చేసిన పుణ్యాలు ఆ అతిధికి చెందుతాయి.

ఆత్మార్ధం భోజనం యస్య సుఖార్ధం యస్య మైధు |
వృత్త్యర్ధం యస్య చాధీతం నిష్ఫలం సత్య జీవనం ||

కేవలం తనకోసం మాత్రమే వండుకునే వాడు, ధర్మబద్దం కాక సుఖం కోసమే మైధునమాచరించే వాడు (రతి), ధన సంపాదన కోసం మాత్రమే విద్యను అభ్యసించేవారి జీవితం వ్యర్దం!

|| పాద్యమాసనమేవాధ  దీపమన్నం  ప్రతిశ్రయం
దద్యాత్  అతిధి  పూజార్ధం  సయజ్ఞః  పంచదక్షిణః ||

అతిధికి కాళ్ళు కడుక్కోవటానికి నీరు, కూర్చోవడానికి అనువైన ఆసనం, ఉన్నచోట వెలుగునిచ్చే దీపం, తృప్తికరమైన భోజనం పెట్టడం, ఉండడానికి అనువైనస్థలం ఏర్పాటు చెయ్యడం. ఈ ఐదు ‘పంచదక్షిణ యజ్ఞం‘గా పుణ్యాన్ని కలుగజేస్తాయి.

Leave a Reply