పురాణం - భాగం 4 || ప్రవచన కర్తల కర్తవ్యం ఏమిటి?

పురాణం - భాగం 4 || ప్రవచన కర్తల కర్తవ్యం ఏమిటి?

"పురాణం"లో ప్రవచన కర్తల కర్తవ్యం ఏమిటి?

• పురాణంలో కధలు కొన్ని చాలా సాధారణంగా కనిపిస్తాయి. మనకు చిరపరిచితంగా అనిపిస్తాయి. కాని వాటి అంతరార్ధం ఆలోచించి తెలుసుకోకుండా అవగతం కాదు. సామాన్య శ్రోతకు అంతసామర్ధ్యం కాని, సావకాశం కాని ఉండకపోవచ్చు. అందువల్ల వాళ్ళకొక మధ్యవర్తి కావాలి. పురాణాన్ని, అంటే పురాణంలోని కధను మాత్రమే కాదు, దానిలోని అంతరార్ధం కూడా శ్రోతలకు అందించవలసిన వ్యాఖ్యాత అవసరమౌతాడు. ఈ భాద్యతను భారతీయ సంప్రదాయంలో పౌరాణికులు, హరికథలు, ప్రవచన కర్తలు పారంపరికంగా నిర్వహించారు.

• పురాణాన్ని ఒక ప్రాచీన కధగా, నాటి ప్రజాజీవన నియమాల నిర్వచన పత్రంగా వ్యఖ్యానించినంత మాత్రాన చేకూరే ప్రయోజనం తక్కువ. దాన్ని నమకాలీన జీవనంలో మానవ సంబంధాల దృష్ట్యా, విలువల దృష్ట్యా నేటి మనిషికి అన్వయించ గలిగినప్పుడే సార్ధక్యం. ఇప్పుడు ఏ విలువలను ఈ సమాజం అనుసరించాలి అన్న విషయం చెప్పగలగాలి. ఆ వైపు ప్రజల నడవడిని తిప్పగాలగాలి. ఇది ప్రవచన కర్త కర్తవ్యం.