వజ్రకిలయ || Phurba

వజ్రకిలయ || Phurba
వజ్రకిలయ || Phurba
వజ్రకిలయ || Phurba
వజ్రకిలయ || Phurba

వజ్రకిలయ || Phurba

దీన్ని సంస్కృతంలో వజ్రకిలయ అని, టిబెట్ దేశంలో Phurba అని అంటారు.. మనం అంజి సినిమాలో చూడవచ్చు..

వజ్రకిలయ || Phurba

పూర్వం, టిబెట్ దేశంలో ఉన్న సాధకులు దీన్ని తయారుచేసి, కొన్ని రహస్యమైన మంత్రాలతో "తామస" గుణంతో ఉన్న శక్తిని ఆహవం చేసి వాడేవారు. దుష్టశక్తులను దరిచేరనివ్వకుండా, సాధకులకు అడ్డంకులు కలగకుండా ఇది అడ్డుకుంటుంది. మంచి సాధకులను కూడా క్షుద్ర సాధకులని అనుకునే ప్రజలు, తమను దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కనుక, వాళ్ళకి ఇది కాపలా. వజ్రకలియ ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో తెలీదు. ఎవరినైనా చంపడానికి వెనుకాడని దీన్ని చూస్తే ఎవరూ సాధకుల జోలికిపోరు.

వజ్రకిలయ || Phurba

అంజి సినిమాలో చూస్తేగనక, శివుడి ఆత్మ లింగాన్ని కాపాడేవిదంగా ఇది కాపలా ఉంటుంది. ఎవరైనా ఆత్మలింగం జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటుంది, అవసరమైతే చంపేస్తుంది కూడా.

దీంతో మంచితో పాటుగా మరొక పెద్ద సమస్య ఉంది. "తామస" శక్తి చేత అవహించబడిన వజ్రకిలయను నియంత్రించే సాధకుడు బ్రతికున్నంతకాలం అది బాగానే ఉంటుంది, కానీ ఆ సాధకుడి మరణానంతరం దానియొక్క నియంత్రన కోల్పోయి విచ్చలవిడిగా ఎగురుతూపోయేది.

 

వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా చూస్తే.... టిబెట్ దేశంలో దీనికి ప్రాణ ప్రతిష్ట చేసిన ఒక సాధకుడు మరణం చెందాక దీని విజృంభన విపరీతంగా పెరిగి చుట్టూ ఉన్నవారిని కారణం లేకుండా చంపడంవజ్రకిలయ || Phurba మొదలుపెట్టింది. ఎట్టకేలకు కొందరు తాంత్రీకులు దీన్ని నియంత్రించి ఒక పెట్టెలో బంధించి దూరంగా ఎక్కడో ఒక రహస్యమైన కొండ గుహలో దాచేసారు. వెనక్కి చూడకుండా తిరిగి వెళ్లిపోతున్న ఆ తాంత్రీకులకు చాలా భయంకరమైన శబ్దాలు, అరుపులు వినిపించాయని వాళ్ళు చెప్పడం జరిగింది.

 

తరువాతి కాలానికి ఇలాంటివి వెళ్లకూడదని దాన్ని తయారుచేసే విద్యను కాలగర్భంలో కలిపోయేలా చేసారు కానీ, ఇప్పటికీ ఈ విద్య గురించి తెలిసినవాళ్లు ఉన్నారని 1959లో తెలిసింది. కాకపోతే అది కేవలం విద్యగా చెప్పేవాళ్ళేగాని, హింసకు కారణం కాకుండా చూసుకున్నారు..!