పరస్త్రీలలో అమ్మతనాన్ని చూడాలి...

పరస్త్రీలలో అమ్మతనాన్ని చూడాలి...

#ఋషివర్య #జీవన_విజ్ఞానం

మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, పరస్త్రీలో అమ్మతనాన్ని చూడడం (భార్యను తప్ప).

అందుకే || మాత్రువత్ పరదారేషు || అని సనాతన ధర్మ వాఖు. అంటే పరస్త్రీలో అమ్మని చూడడం.

ఒక్కోసారి భార్యలో కూడా అమ్మతనాన్ని చూడాలి, ఎందుకంటే భార్య భర్త యొక్క బాగోగులు చూసుకునే విదానం. అందుకే ||భోజ్యేషు మాత || అంటారు.
అలా చూడని వాడు దరిద్రునితో సమానమయ్యే కర్మఫలాన్ని పొందుతాడు అని వేద వాక్కు!

ఒకడు తల్లి అని ఉద్దేశించి అవతలి మహిలని అమ్మా అని పిలిచాడంటే ఆమెలో అమ్మతనాన్ని చూస్తునట్టు. ఆమెలో అమ్మతనం పోగుతుంది. తనుకూడా కుమారుడిలా ఉద్దేశించి మాట్లాడుతుంది.

అలానే, స్త్రీ అంటే ధర్మానికి చిహ్నం. స్త్రీ అంటేనే శక్తి , శ్రుష్టికి మూలం. ఒక స్త్రీ తల్లి స్థానానికి వచ్చాక మనల్ని నవమాసాలు మోసి జన్మని ఇస్తుంది. కనుక భూమికన్నా బరువైనది తల్లి అని వేదం పోల్చింది. అటువంటి స్త్రీ కూడా (భర్తను తప్ప) పరపురుశులతో సన్నిహితంగా ఉండడం, మాట్లాడడం లాంటివి చేయకూడదు. ప్రస్తుతకాలంలో కొన్ని సందర్భాలలో కష్టం కనుక, పరిమితి మించి మాట్లాడకుండా ఉండడం మంచిది!

స్త్రీ, పురుషులు ధర్మాన్ని ఎన్నడూ తప్పకూడదు