తెలుగు సూక్తులు - మంచి మాటలు

తెలుగు సూక్తులు - మంచి మాటలు
 • మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే - సిడ్నీ హరిస్.
 • మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
 • మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.
 • మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
 • మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.
 • మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
 • మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
 • మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
 • మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
 • మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
 • మంచి పనే మంచి ప్రార్ధన.
 • మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.
 • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
 • మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
 • మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
 • మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.
 • మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
 • మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
 • మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.
 • మంచితనానికి మించిన మతమే లేదు.
 • మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
 • మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి - తులసీదాసు.
 • మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.
 • మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.
 • మందగించక ముందు అడుగెయ్ వెనుకబడితే వెనకేనోయ్ - గురజాడ.
 • మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విఱుగుడు మందు.
 • మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.
 • మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.
 • మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.
 • మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
 • మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
 • మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
 • మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
 • మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
 • మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
 • మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.
 • మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
 • మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
 • మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
 • మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.
 • మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది.
 • మనం ప్రేమించే దాన్నిబట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపు దిద్దుకుంటాము.
 • మనం సమాధానంలో భాగం కావాలి కాని, సమస్యలో భాగం కాకూడదు.
 • మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము.
 • మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే.
 • మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి.
 • మనకు జరిగేది కాదు మనలో జరిగే మార్పు గొప్పది.
 • మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడే విషయాలు బాగా అర్థం అవుతాయి. అధికజ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది.
 • మనలను మనం జయించగలగడం మాత్రమే చిరకాలం నిలుస్తుంది. ఈ విజయం ఎలాంటి విచారాన్ని కలిగించదు.
 • మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం.
 • మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తిచూపడానికి అంత ఉత్సాహపడము
 • మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు.
 • మనల్ని మనం మన శత్రువుకంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు.
 • మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించెయ్ - స్వామి ఓంకార్.
 • మనసునిండా నిజాయతీ పెల్లుబకాలే కాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు - పండిట్ మోతీలాల్ నెహ్రూ.
 • మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్ప వాడవుతాడు.
 • మనస్సు గాలిగొడుగు లాంటిది. తెరచినప్పుడే అది పనిచేస్తుంది.
 • మనస్సును చెదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి.
 • మనస్సులో అలజడి ఉన్నప్పుడు ముఖంలో ప్రశాంతత కనిపించదు.
 • మనిషి అనామకునిగా మారటానికి అహంకారం అనేది ప్రధాన కారణమవుతుంది.
 • మనిషి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు.
 • మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహంకారమే.
 • మనిషి నుండి ఎన్నటికీ వేరు చేయలేని ఒకే ఒక్క సంపద విద్య.
 • మనిషి ముసలివాడై చావుకు సిద్దమై ఉన్నా అతని ఆశ మాత్రం అణగదు.
 • మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం.
 • మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మని శుద్ది చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్ధమైన జీవితం కంటే మృత్యువు శ్రేయస్కరం.
 • మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు. దీనర్ధం తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను. అని - అబ్రహన్ హస్ దాయ్.
 • మనిషికి విజ్ఞానం కన్నా మంచిమిత్రుడు లేడు, అఙ్ఞానం కన్నా పరమశత్రువు లేడు.
 • మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వామే అన్ని విషయాలకు మూలం.
 • మనిషిపట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మందిని విచారపడేలా చేస్తుంది.
 • మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్యరూపమే చదువు.
 • మనిషిలో జ్ఞానం అనేది పెరిగేకొద్ది తనలోని అజ్ఞానం తెలిసివస్తుంది.
 • మనుషుల వద్ద లేనిది ఆత్మబలమే కాని శరీర బలం మాత్రం కాదు.
 • మనోబలం లేకుండా గణనీయమైనదేదీ మనం సాధించలేము.
 • మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మవినాశనంతో ముగుస్తుంది.
 • మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది - బ్రౌనింగ్.
 • మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు పోరాటం.
 • మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాలు
 • మాట ఇవ్వటానికి తొందరపడకు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు.
 • మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లడతాయి.
 • మాటలు కాదు మనసు ముఖ్యం.
 • మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం.
 • మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది.
 • మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం.
 • మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది.
 • మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు.
 • మితము తప్పితే అమృతమైనా విషమే.
 • మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు.
 • మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి.
 • మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి - ఇబ్బెన్.
 • మిమ్మల్ని మీరు నిందించికోవడం మహాపాపం.
 • మీ ఆలోచనా సరళి మార్చుకుంటే ఆ మీ జీవన సరళి తానుగా మారుతుంది - డా. నార్మన్ విన్సెంట్ పీలే.
 • మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి.
 • మీ కష్టాలను కాదు మీ దీవెనలను లెక్కపెట్టుకోండి.
 • మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం.
 • మీ కోరికలు అంతులేనివైతే, మీ చింతలూ, భయాలూ కూడా అంతులేనివే - థామస్ పుల్లర్.
 • మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పేముందే మీరు ఒప్పుకోండి.
 • మీ తప్పులు మీ విజయానికి కావల్సిన కొత్త పాఠాలు.
 • మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై వుండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే.
 • మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు.
 • మీతోటి వారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి.
 • మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి.
 • మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన నీతి.
 • మీరు మంచి వారు మాత్రమే కాదు మంచికి కూడా కారకులు.
 • మీరు మీరుగా ఉండండి. పక్షపాత రహితంగా సీదాసాదాగానూ, నిజాయితీతోనూ ఉండండి.
 • మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి.
 • మూగవాడు మాట్లాడగల భాష చెవిటివాడు వినగల భాషే దయ.
 • మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.
 • మూర్ఖుడు  కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క - ఓల్డ్ టెస్ట్ మెంట్.
 • మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేక వంతుడు వెంటనే చేస్తాడు.
 • మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్తపడతారు.
 • మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు.
 • మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది.
 • మేథశక్తిని చూపగానే సరికాదు. హృదయ వైశాల్యం కూడా కనబరచాలి.
 • మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.
 • యదార్థవాది లోకవిరోధి.
 • యధార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు.
 • యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కుడా కీర్తి దక్కుతుంది.
 • యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది - జాన్ మిల్డన్.
 • యౌవనంలో కూడబెట్టు వార్ధక్యంలో వాడుకో.
 • రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం.
 • రాజకీయాల్లో మతం ఉండదు - లెబనీస్.
 • రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం.
 • రూపొందిచబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.
 • రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖం.
 • రేపన్నది సోమరులు ఎక్కువగా పని చేయవలసిన రోజు.
 • రోజుకు 5 ముఖ్యమైన పనులు నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.
 • రోజూ తాను చేస్తున్న పనితో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు.
 • లక్ష్యం పెద్దదైతే త్యాగమూ పెద్దదే కావాలి.
 • లెండి! మేల్కొండి! గమ్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకండి! - స్వామి వివేకానంద.
 • లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు.
 • లోకానికి అవసరమైనవి చేతలే కాని, మాటలు కావు.
 • లోభికి నాలుగు దిక్కులా నష్టం.
 • వంతెనలను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు.
 • వంద ఉదార భావాల కన్న ఒక్క అందమైన పని మిన్న - జేమ్స్ రసెల్ లోవెల్.
 • వయసు మళ్ళిన వారివి వెనుకటి కాలపు గాధలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు.
 • వయసు వివేకం ఈ రెండూ కలిసి సంచరించవు.
 • వయసులో రోజులు పొట్టి, ఏళ్ళు పొడవు, పెద్దయ్యాక ఏళ్ళు పొట్టి, రోజులు పొడవు.
 • వయస్సులో నేర్చుకున్నది రాతి మీద చెక్కిన చెక్కడంతో సమానం.
 • వస్తువ విలువ అవసరాన్ని బట్టితెలుస్తుంది.
 • వస్తువుకాదు వస్తువు పరమైన ఆలోచనే దాన్నిమంచిగానూ లేదా చెడ్డగానూ మారుస్తుంది.
 • వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
 • వాడి అయిన ముళ్ళే తరచుగా నాజూకైన గులాబీని ఇస్తాయి.
 • వాత్సల్యం బుద్దిని మందగిస్తుంది.
 • వాయిదా వేయడం అన్నది కాలాన్ని హరించే దొంగ.
 • వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి.
 • వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.
 • విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం.
 • విజయం అన్నది ఒక మనోభావన, అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది.
 • విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి.
 • విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
 • విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచి పెట్టేవాడు ఎన్నడూ జయించడు.
 • విత్తొకటి నాటిన మొక్కొకటి రాదు.
 • విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది.
 • విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
 • విద్య యొక్క అర్ధం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపచేయడమే.
 • విద్య యొక్క నిజమైన పరమార్ధం ఉత్తమ వ్యక్తిని రూపొందింప చేయడమే.
 • విద్య లేని వారికి కీర్తి లేదు.
 • విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరుయు ప్రతి కూలతలో ఒక అభయస్ధానం.
 • విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం
 • విద్యను పొందడం సులభమే కాని వివేకం పొందడం కష్టతరమైన కార్యం.
 • విద్యాధికుడై, తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి - పుస్తకాల బరువు మోసే మృగం.
 • విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది.
 • వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది.
 • వినయం నీవు ధరించే విలువైన వజ్రం.
 • వినయం ప్రతిష్ఠకు సులభ మార్గం.
 • విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది.
 • విరగడం కంటే వంగడం మంచిది.
 • వివేకవంతులతో సాహచర్యం నిన్నుకూడా వివేకవంతుణ్ణి చేస్తుంది - మినాండర్.
 • వివేకవంతులైన వారెప్పుడూ గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు.
 • వివేకానికి మొదటి అడుగు ఏది అసత్యమో తెలుసుకోవడమే.
 • వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది.
 • విశ్వాసం పరమ బంధువు.
 • విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది.
 • విశ్వాసం, అఖండ విశ్వాసం, మనమీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు.
 • విషయం సమగ్రంగా తెల్సుకోకుండానే తృణీకరించకండి. నిర్ణయించకండి.
 • విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకుని పోవడం మరణం అవుతుంది.
 • వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం.
 • వెయ్యి మంది మిత్రులున్న వ్యక్తి ఒక్కరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువున్న వ్యక్తి అతన్ని ప్రతిచోట కలుస్తాడు.
 • వెలుతురు వైపు చూడడం నేర్చుకో. ఇక నీకు నీలినీడలు కనిపించవు.
 • వేగంగా వాగ్ధానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు.
 • వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు.
 • వేదనలకు కుంగిపోక చేతినిండా పని కల్పించుకుంటే ఆనందసుమం దానంతటదే వికసిస్తుంది.
 • వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడిక గానీ, వేషంకాదు.
 • శక్తి అన్నిటిని జయిస్తుంది. కానీ ఆవిజయాలు కొద్దికాలం మాత్రమే ఉంటాయి.
 • శతృత్వం అన్నది మూర్ఖుల వృత్తి.
 • శాంతంగా ఉండండి. అప్పుడు ప్రతివారిని అదుపు చేయగల్గుతారు.
 • శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు.
 • శాంతిని ఎవ్వరూ దానం చేయరు, ఎవరికి వారు సాధించుకోవాలి.
 • శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలిగిస్తాయి.
 • శోకస్య కారణం మోహం మీలో దుర్గణాలన్నీ మోహాలే. వాటి ఫలితం ధుఃఖం. వాటిని వదిలించుకోండి.
 • శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేనివారి నుండి కూడా మీరు లాభం పొందుతారు.
 • శ్రమ శరీరాన్ని బలపరచినట్లే కష్టాలు మనస్సును బలపరుస్తాయి.
 • శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కాని అతనికి వచ్చే ప్రతిఫలం కాదు.
 • శ్రమవల్ల లభించేది గొప్ప బహుమానం కానే కాదు. శ్రమవల్ల వచ్చే మార్పే గొప్ప బహుమానం.
 • శ్రమించు, అన్వేషించు, గ్రహించు కానీ, లోబడకు.
 • సంకల్పబలం ఉన్న హృదయానికి సంభవం కానిదంటూ ఏదీ ఉండదు.
 • సంఘటనలు కావు కాని వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి.
 • సంతృప్తి పేదవానికి సంపద ఇస్తుంది. అసంతృప్తి ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
 • సంతృప్తి శత్రువులు దాడిచేసి వశపరచుకోలేని కోటలాంటిది. మీలో ఈ సంతృప్తిని బలపరుచుకోండి.
 • సంతోషం అన్నది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది.
 • సంతోషం మనిషి తీరు అవుతుందేకాని మనిషి దగ్గరున్న వస్తువు ఏమాత్రం కాదు
 • సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో మరియు ఎన్నికల్లో ఉంది
 • సంపద ఉప్పు నీటి లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది.
 • సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏమి సాధించలేము.
 • సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది.
 • సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరిసొత్తూ కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు.
 • సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, క్షమ - ఈ ఆరే ఆప్తులైన బంధువులు.
 • సత్యదేవతకు మనం చూపగల భక్తి, ఆ వెలుగులో నడవగలగడమే.
 • సత్యమే జయిస్తుంది కానీ అసత్యం కాదు.
 • సత్యమే సర్వరక్ష దానికి మించిన రక్ష వేరొకటి లేదు.
 • సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.
 • సత్యాన్ని గూర్చిన సిద్దాంతాలు మారిన అసలు సత్యం ఎప్పటికీ మారదు.
 • సత్యాన్ని మించిన ధర్మం లేదు, పరోపకారాన్ని మించిన దైవప్రార్థన లేదు.
 • సమదృష్టి గల మనస్సు అన్ని దు:ఖాలకు ఉత్తమ ఔషధము.
 • సమదృష్టి గల మనస్సు అన్ని దుఃఖాలకు ఉత్తమ ఔషధము.
 • సమన్వయం నుండి నిజమైన ఆనందం పుట్టుకొస్తుంది.
 • సమయాన్ని వ్యర్థం చేయడం చాలా సర్వసాధారణమైన నేరం.
 • సమాజం నేరాన్ని తయారుచేస్తుంది, దాన్ని నేరస్తుడు చేస్తాడు.
 • సరి క్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు.
 • సరిగా ఉండటం కంటే విమర్శించటం అతి తేలిక.
 • సరివారితో స్నేహం చేసి, తక్కువ వారిపై కరుణ చూపి, అధికులతో ఆనందించి, చెడ్డవారికి దూరంగా ఉండాలి.
 • సరైనదేదో తెలుసుకుని దాన్ని చేయకపోవడం అన్నది పిరికితనం అవుతుంది.
 • సర్వేజనా సుఖినో భవంతు అని ప్రార్ధించండి, మనకు ఏది మంచిదో భగవంతుడికి బాగా తెలుసు.
 • సహజత, సరళత జీవితాన్ని తియ్యగా చేస్తాయి.
 • సహనం అందరికి అవసరం. మొదట మనకు అవసరం.
 • సహనం ప్రతిభకు అవసరమైన ముడి పదార్ధం.
 • సహించగలిగిన వ్యక్తే సంపదలను పొందగలడు.
 • సాధించిన విజయం కంటే అభిలాష ఎంతో గొప్పది.
 • సాహసించని వాడు గెలుపును సాధించలేడు.
 • సిద్దమైన వ్యక్తి సగం యుద్దం జయించినట్లే.
 • సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి.
 • సుగుణమే నిజమైన గొప్పదనం.
 • సులభంగా నేర్చుకున్న పాఠాలు సులభంగా మరచిపోబడతాయి.
 • సూర్య కిరణాల లాగా మంచి నడవడిక కాంతిని నలుమూలలా ప్రసరింపజేస్తుంది.
 • సూర్యకాంతి వైపు మీ ముఖాన్ని పెట్టుకోండి, నీడలు మీ వెనుక ప్రక్కపడతాయి.
 • సూర్యుడి వైపు ముఖం చేయండి. అప్పుడు చెడు మీకు కనిపించదు.
 • సోమరి తనం మూర్ఖుల సెలవు రోజు.
 • సోమరితనం, దుబారాగుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు.
 • స్ధిరమైన మీ న్యాయబుద్ది మీ ప్రతి వ్యవహారంపై తన చెరగని ముద్రను వేస్తుంది
 • స్నేహాన్ని క్రమం తప్పకుండా నిరంతరంగా మరమ్మత్తు చేస్తూ ఉండాలి.
 • స్వతంత్రంగా ఆలోచించడాన్నీ, స్వతంత్రంగా బ్రతకడాన్ని నేర్పేదే విద్య.
 • స్వర్గం - నరకం రెండూ మనలోనే ఉన్నాయి.
 • స్వార్ధం చిట్టచివర్లో ఉన్నప్పుడే సేవ ఉత్తమంగా ఉంటుంది.
 • నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.
 • నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
 • నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
 • నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట.
 • నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
 • నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
 • నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
 • నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
 • నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
 • నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
 • నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.
 • నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
 • నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.
 • నిఘంటువులో మాత్రమే విజయం, సాధనకు ముందు వస్తుంది.
 • నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.
 • నిజం కానిది నిజంగా గొప్పది కాదు.
 • నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.
 • నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
 • నిజము నిలకడ మీద తెలియును.
 • నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
 • నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
 • నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
 • నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
 • నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
 • నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
 • నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
 • నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
 • నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
 • నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.
 • నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
 • నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
 • నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
 • నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
 • నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.
 • నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
 • నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
 • నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
 • నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.
 • నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
 • నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.
 • నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీతల్లి తండ్రులను ప్రేమించు.
 • నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.
 • నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి.
 • నీతిగల వానికి నిందాభయం లేదు.
 • నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.
 • నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
 • నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
 • నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.
 • నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
 • నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
 • నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
 • నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
 • న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
 • పంచుకున్న రహస్యం అందరికి తెలుస్తుంది - అర్బిక్
 • పంచుకున్న సంతోషం సంతోషాన్ని రెండింతలుగా పెంచుతుంది.
 • పంతులు లేని బడి, దేవుడు లేని గుడి, మనసులేని మనిషి ఒకటే -బాబా.
 • పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే, మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
 • పగ - ప్రతీకారం - ఈర్ష్య అసూయ - అసహ్యం విజయానికి శత్రువులు.
 • పతకాన్ని గెలుచుకోవడంలో కాదు పందెంలో పాల్గొనడంలోనే గెలుపు ఉంది.
 • పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.
 • పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.
 • పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
 • పనిచేయని వాడికి తినే హక్కులేదు.
 • పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.
 • పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.
 • పనిలేని మంగలి పిల్లి తల గొరిగెనంట.
 • పరిపూర్ణత అనేది ఎప్పుడూ ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.
 • పరిపూర్ణత మానవునకు ఆదర్శం మాత్రమే సిద్దించుకోలేడు. అపరిపూర్ణుడు కాబట్టి. - గాంధీజీ
 • పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడంలోనే మగతనం ఉంది.
 • పరిస్థితులనేవి మన చేతుల్లో లేకపోయినా మన ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.
 • పరిస్థితులు బలహీనుణ్ణి శాసిస్తాయి. కాని అవే వివేకి విజయానికి సాధనాలవుతాయి.
 • పరులకు సౌభాగ్యం సాధించడంలో సాయపడేవాడే ఆదర్శవాది - హెన్రీ ఫోర్డ్
 • పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహా విజేత
 • పవిత్రమైన మనస్సు గలవారికి, ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది.
 • పసిబిడ్డ నింపవలసిన కలశం కాదు. వెలిగించ వలసిన నిప్పు.
 • పాప భీతి, దైవ ప్రీతి, సంఘనీతి అభివృద్ధి పరచుకోవాలి - బాబా.
 • పాపం అనేది వేరే ఒకచోట ఆవిర్భవించదు. చేసే దుష్కర్మలోనే పొంచి ఉంటుంది.
 • పాలల్లో వెన్నవలే, ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఉన్నాడు.
 • పిడికెడు లోకజ్ఞానం తట్టెడు చదువుతో సమానం.
 • పిరికి మాటలు మాట్లాడకండి. వినకండి.
 • పుష్పానికి సుగంధం - మనిషికి వ్యక్తిత్వం.
 • పుస్తక పఠనం వల్ల కలిగే అమితానందం, లాభలు మనకు జీవిత చరిత్రలను చదవటం వల్లే సాధరణంగా మనకు లభిస్తుంది.
 • పుస్తకం విలువను ధరకాదు దాని ఉపయోగం నిర్ణయిస్తుంది.
 • పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు.
 • పూచిన పువ్వులన్నీ కాయలైతే పట్టడానికి స్థలం ఉండదు.
 • పూజ, ఉపవాసాలు ఆత్మబలాన్ని పెంచే ఆధ్యాత్మిక వ్యాయామాలు.
 • పూలలో సువాసన, మనుష్యులలో యోగ్యత అనేవి దాచినా దాగని వస్తువులు.
 • పెరిగే అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కువ అపాయకరం.
 • పెరుగుతున్న వయస్సుతో కాదు. చేసే సత్క్రియలతో జీవితం సార్ధకం అవుతుంది.
 • పైన ఉన్న స్వర్గాన్నీ, క్రింద ఉన్న భూమినీ ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది.
 • పైన సమజాంలో కులమత బేధాలు శాంతిని దూరం చేస్తాయి.
 • పైసాకు కొరగాని పనులతో సతమతమవడం కంటే ఏమీ చేయకుండా ఉండడమే నయం.
 • పొందే ప్రశంస కంటే కూడా చేసే ప్రయత్నమే విలువైనది.
 • పొగిడే ప్రతివాడు, పొగడ్తను వినేవాడి ఖర్చుతో జీవిస్తాడు.
 • పొదుపు చేయగలిగినవాడు వేదనకు గురికాడు.
 • పొరపాటు సహజమే కాని అవివేకి అందులోనే విహరిస్తాడు.
 • పొరపాట్లను సరిదిద్దుకోవడం వివేకానికి గుర్తు.
 • పోరాడక పోవడం కన్నా, పోరాడి ఓడిపోవడమే గొప్పతనం.
 • ప్రకృతిలో బహుమతులు లేవు, దండనలూ లేవు. ఉన్నవన్నీ ఫలితాలే - ఆర్.జి. ఇంగర్‌సాల్.
 • ప్రగతికి తగిన ఉన్నతి, ఉన్నతికి తగిన ఉదారతే ఉత్తమ పురుష లక్షణం.
 • ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.
 • ప్రజలు దుర్బలులు కారు - వారికి లేనిది సంకల్ప బలం -విక్టర్ హ్యూగో
 • ప్రజాసమూహం సానుభూతితో ఆలోచిస్తుంది కానీ వివేకంతో కాదు.
 • ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు.
 • ప్రతి ఒక్కరు చాలాకాలం జీవించాలనుకుంటారే కానీ ఏ ఒక్కరూ ఎదగాలని కోరరు.
 • ప్రతి ధ్వని ఎప్పుడూ ధ్వనిని వెక్కిరిస్తూ ఉంటుంది.
 • ప్రతి పరాజయం విజయాన్ని మరి కాస్త సన్నిహితం చేస్తుంది.
 • ప్రతి మందలోనూ, ఒక మోసగాడు ఉంటాడు.
 • ప్రతి మనిషిలోను దివ్యత్వం గర్భితంగా ఉంది. ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడమే జీవిత పరమావధి.
 • ప్రతికారం ద్వారా పగ నిర్మూలనం కాదు -రాజాజీ.
 • ప్రపంచ శాంతిని, తమ షరతుల ప్రకారం ఆశించే దేశాలే యుద్ధ బీజాలను నాటుతున్నాయి.
 • ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత కష్టమైన విషయం, ఎదుటి మనిషిని అర్ధం చేసుకోవడమే.
 • ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప వస్తువు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు.
 • ప్రపంచంలో ప్రతి మనిషీ ఏదో ఒక విధంగా పనికి వస్తాడు. ప్రతి జీవితానికి ఓ అర్ధం ఓ ప్రయోజనం ఉండి తీరుతాయి.
 • ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
 • ప్రపంచంలోని ఏ వ్యక్తుల విజయాలను తీసుకున్నా, వాటికి కారణం ఆ వ్యక్తుల తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే.
 • ప్రమాదానికి సిద్దపడితే తప్ప ప్రమాదాన్ని దాటలేరు.
 • ప్రలోభాలకు లోనై ఏకాగ్రతను పోగొట్టుకుంటే లక్ష్యాన్ని సాధించలేరు.
 • ప్రవర్తన అనే అద్దంలో ప్రతి ఒక్కరి ప్రతిబింబం కనబడుతుంది. సమయాన్ని పాటించడం అన్న పునాది పైనే మీ వృత్తి ఆధారపడి ఉంటుంది.
 • ప్రశంస అనేది మనిషి ప్రగతికి శత్రువు.
 • ప్రారంభ వస్తువులన్నీ (విషయాలన్నీ) ఉత్తమంగానే ఉంటాయి - లార్డ్ ఛెస్టర్‌ఫీల్డ్.
 • ప్రార్ధన చేసే పెదవులు కన్నా సేవ చేసే చేతులు మిన్న.
 • ప్రార్ధన వల్ల దేవుడు మారడు; ప్రార్ధించే వాడే మారుతాడు.
 • ప్రేమ అనేది అమృతం, దాన్ని పంచి ఇస్తే  అంతా నీవాళ్ళు అవుతారు.
 • ప్రేమ కలిగిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు. ఎందుకంటే - దేవుడే ప్రేమ.
 • ప్రేమ గాఢమైతే తప్పులు పలుచనౌతాయి.
 • ప్రేమ ద్వారా ప్రేరేపింపబడినదీ, చదువు ద్వారా దారి చూపబడినదే మంచి జీవితం.
 • ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును  - గురజాడ.
 • ప్రేమ పొందే వారిని, పంచే వారిని - ఇద్దరినీ బాగుపరుస్తుంది - డా. కార్ల్ మెన్నింజర్.
 • ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.
 • ప్రేమించిన వారే భగవంతుణ్ణి కనుగొనగలిగారు.
 • ప్రేమింపబడడం కంటే కూడా నమ్మకస్తుడిగా ఉండడం అన్నదే ప్రశంసనీయం.
 • ప్రేమే ద్వేషాన్ని దూరం చేస్తుంది కానీ ద్వేషం చేయలేదు  - బుద్ద.
 • బంగారంలోని ప్రతి పోగూ ఎంత విలువైనదో గడచిపోతున్న కాలంలోని ప్రతి ఘడియ కూడా అంతే.
 • బందిపోటు దొంగలకంటే భ్రష్ట సాహిత్యం భయంకరమైనది.
 • బలమే జీవనం, బలహీనతే మరణం.
 • బలమే ప్రధానమైతే తేలును చూసి పులి భయపడవలసిన అవసరం లేదు.
 • బలవంతుణ్ణి బలహీనపరచి, బలహీనుణ్ణి బలవంతుడిగా మార్చలేము.
 • బాకీ లేకుండా, అప్పు ఇవ్వకుండా ఉన్నప్పుడే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.
 • బాగా అలసట పొందినవాడిని కొంచెం పొగడ్త ఉత్సాహపరుస్తుంది.
 • బాగా చెప్పడం కంటే బాగా చెయ్యడమే మెరుగైనది.
 • బాధపడటం అనేది సోమరి లక్షణం దాన్ని వదిలేయండి.
 • బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
 • బాధలలో సుఖమయమైన రోజులను గుర్తు చేసుకోవడానికి మించిన గొప్ప దుఃఖం లేదు.
 • బాధ్యత తెలిసిన వ్యక్తి ఏనాడు ముందుగా నిద్రపోడు, అలాగే ఆలస్యంగా సైతం నిద్రలేవడు.
 • బాధ్యతలే గొప్పతనానికి మనం ఇచ్చే ధర - విన్‌స్టన్ చర్చిల్.
 • బావి లోతుకన్న మనసు లోతు మిన్న.
 • భక్తికున్న గొప్ప సుగుణం మనసును శుభ్రం చేయగలగడమే.
 • భగవంతుడి విషయం భక్తుడికి, భక్తుని విషయం భగవంతునికి మాత్రమే తెలుస్తాయి.
 • భగవంతుడు + కోరిక = మనిషి, మనిషి - కోరిక = భగవంతుడు.
 • భయం అనేది ఒక శారీరికమైన జబ్బు కాకపోవచ్చు. కానీ అది ఆత్మను చంపేస్తుంది.
 • భవిష్యత్తు పై నమ్మకం కలిగి ఉన్న వ్యక్తి భవిష్యత్తు ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.
 • భవిష్యత్తుతో వచ్చిన చిక్కేమిటంటే అది మనం సంసిద్ధులు కాకముందే వస్తుంది.
 • భావం, సాధన ఈ రెండూ చాలా దూరమైనవి.
 • భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది.
 • చక్కగా తీర్చిదిద్దబడిన ఒక మంచి వ్యక్తి జీవితమే ఈ ప్రపంచంలో అతి పరిపూర్ణం అయిన అందమైన వస్తువు.
 • చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
 • చదవకుండా ఉండడం కంటే పుట్టకుండా ఉండడమే మేలు కారణం అజ్ఞానమే దురదృష్టానికి మూలం.
 • చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన.
 • చదివిన పుస్తకాల నుండి జ్ఞానాన్ని పొంది పాఠాలను నేర్చుకోవడమే చదువు ఉద్దేశ్యం.
 • చదువు సారం కంటే కల్పన చాలా ముఖ్యమైనది.
 • చదువుకోవడానికి మనిషి ఎప్పుడూ వృద్దుడు కాడు.
 • చదువులేని ఉత్సాహం గుర్రపుశాల నుండి పరిగెత్తిన గుర్రం లాంటిది
 • చరిత్ర చదవడం కాదు! చరిత్ర సృష్టించాలి.
 • చలువరాతికి శిల్పం ఎలాగో ఆత్మకు విద్య అలాగు.
 • చాలా కొంచెంను గురించి చాలా ఎక్కువ తెలుసుకున్న వ్యక్తి నిపుణుడు.
 • చాలా తక్కువగా తినిన వారికంటే చాలా ఎక్కువగా తిన్నవారే ఎక్కువ మంది చనిపోయారు.
 • చాలామంది ఇతరులకంటే బాగా చేయగలిగిన పని తమ చేతివ్రాతను తామే చదువుకోగలగడమే.
 • చాలామంది సలహాలు తీసుకుంటారు, కానీ వివేకవంతులే దాని నుంచి లాభం పొందుతారు.
 • చింత ఎల్లప్పుడూ చిన్న వస్తువుకు పెద్ద నీడ ఇస్తుంది.
 • చితి శవాన్ని దహిస్తుంది, చింత ప్రాణాన్ని దహిస్తుంది.
 • చిత్తశుద్దిలేని విద్య ప్రమాద భరితమూ, భయానకమూ అవుతుంది
 • చిన్న అవకాశాలే తరచుగా గొప్పసాహస కార్యాలకు ప్రారంభాలు అవుతాయి.
 • చిన్న గొడ్డలి పెట్లు మహా వృక్షాలను కూల్చగలవు.
 • చిన్న చిన్న పనులే విశిష్టతను దారి తీస్తాయి. కానీ విశిష్టత చిన్నది కాదు.
 • చిన్న పని కదా అని అలక్ష్యం చేయకండి. చిన్న విత్తనం నుండే మహావృక్షం ఉద్భవిస్తుందని మరువకండి.
 • చిరునవ్వు ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
 • చీకటిలో మీరు వ్యవహరించే తీరే మీ గుణం.
 • చూస్తున్న పొరుగువాణ్ణి ప్రేమించలేనివాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు?
 • చెట్టు పైకి ఎక్కాలనుకున్నప్పుడు పూలను కాదు, కొమ్మలను పట్టుకోండి.
 • చెడును విస్మరించి, మంచిని స్మరించి సంరక్షించుకోవటం యోగ్యతకు లక్షణం.
 • చెడ్డను నాటితే దక్కేది దుఃఖమే.
 • చెదరిపోయిన మనసు సంపూర్ణంగా దర్శించ లేదు.
 • చెప్పులు కుట్టేవాడు చెప్పులు అందంగా చేస్తాడు. కారణం అతను ఇంకేమి చేయడు.
 • చెసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బును తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.
 • చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.
 • చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
 • చేసిన తప్పును సమర్ధించుకోవడంతో అది రెండింతలు అవుతుంది.
 • చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.
 • జనన మరణాల మధ్యంతర కాలం జీవితం.
 • జాతికి సంపద వెండి, బంగారాలు కాదు - సజ్జనులు.
 • జాలి లేనివారే నిజమైన అంటరానివారు.
 • జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు.
 • జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
 • జీవించడం అన్నది ముఖ్యంకాదు. ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నదే ముఖ్యం.
 • జీవిత పరిజ్ఞానంలేని గ్రంధాలు నిష్ప్రయోజనాలు.
 • జీవితం అంటే గడిచిన ఏళ్ళు కాదు సాధించిన సత్కార్యాలు.
 • జీవితం అనేక సంఘటనల గొలుసు. జీవించడం అనేక అనుభవాల గొలుసు.
 • జీవితం ఎడతెరిపి లేకుండా ప్రవహించే అనుభవాల సారం.
 • జీవితం నాకు ఆలోచించడం నేర్పింది. కానీ ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు.
 • జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
 • జీవితంలో అపూర్వ ఆభరణం వినయం.
 • జీవితంలో విజయాలు సాధించటానికి ఏకాగ్రత, తదేకదీక్ష అత్యంత అవసరం.
 • జీవితంలో సంఘర్షణ లేనప్పుడు కాదు, ఆ సంఘర్షణతో సర్దుకుని పోయినప్పుడే శాంతి లభిస్తుంది.
 • జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
 • జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి.
 • జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
 • జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు.
 • తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
 • తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
 • తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
 • తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.
 • తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద
 • తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
 • తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.
 • తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
 • తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు.కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
 • తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.
 • తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.
 • తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.
 • తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు.
 • తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.
 • తప్పు చేయని వారు ధరణిలో లేరు.
 • తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.
 • తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
 • తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
 • తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.
 • తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు.
 • తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
 • తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
 • తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
 • తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
 • తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
 • తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.
 • తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
 • తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.
 • తీర్మానాలు చేస్తే చాలదు. వాటిని ఆచరణలో పెట్టాలి.
 • తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి వివేకం పెరుగుతుంది.
 • తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
 • తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
 • తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
 • తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
 • తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.
 • తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.
 • తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
 • తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.
 • తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
 • తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
 • తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
 • త్యాగమయ జీవితం మహత్తర జీవితం.
 • త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.
 • దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.
 • దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.
 • దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.
 • దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
 • దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.
 • దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
 • దూరపు కొండలు నునుపుగా తోచు.
 • దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
 • దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.
 • దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది
 • దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
 • దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.
 • దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.
 • దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
 • దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
 • దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
 • దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
 • దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
 • దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
 • ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.
 • ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.
 • ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
 • ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
 • ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
 • ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.
 • ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
 • ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
 • 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
 • అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
 • అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
 • అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చెయ్యకూడదు.
 • అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు.
 • అందం అన్నది సత్యం యొక్క శోభ.
 • అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
 • అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ అందాన్ని పొందుతాడు.
 • అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
 • అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.
 • అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.
 • అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
 • అఙ్ఞానం అనేది అభివృద్దికీ, మార్పుకూ ఎప్పుడూ అడ్డుగోడే.
 • అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
 • అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.
 • అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది.
 • అణుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది.
 • అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి.
 • అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
 • అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు.
 • అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం.
 • అదృష్టం సంసిద్దంగా ఉన్న మనస్సునే వరిస్తుంది.
 • అదృష్టం సాహసవంతులను వరిస్తుంది.
 • అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు.
 • అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసి రాదు.
 • అనవసరమైనదాన్ని వదలివెయ్యడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది.
 • అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు.
 • అనుభవమే అన్ని విజయాలకూ మూలం.
 • అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థాణువుగా ఉంటుంది.
 • అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది.
 • అన్ని సాక్షాలు కంటే ఆత్మ సాక్షం అధికం.
 • అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ - థామస్ కార్ల్
 • అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు.
 • అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే. కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం
 • అన్నింటినీ నమ్మేవాడూ నష్టపోతాడు ఏదీ నమ్మనివాడూ నష్టపోతాడు.
 • అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి.
 • అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు.
 • అపజయం అంచులవరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు.
 • అప్రయత్నంగా సాధించే గెలుపుకంటే, మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
 • అభినందన పొందాలనే వాంచే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక.
 • అభిప్రాయానికి, ఆచరణకి మధ్య ఉన్న విరామం, కాలం.
 • అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది.
 • అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
 • అరకొఱగా ఏ పనినీ చేయవద్దు.
 • అర్హతను సంపాదించండి. ఆ తరువాత కోరికను పెంచుకోండి.
 • అలవాటు మానవ స్వభావాన్ని నియత్రించే చట్టం - కార్లెయిల్.
 • అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలే ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు - ఏ.జి. గార్డెనర్.
 • అవకాశం అనేది రాదు. అది ఇక్కడే ఉంటుంది.
 • అవకాశాలు గ్రుడ్లలాంటివి. ఒకసారి ఒకటే వస్తుంది.
 • అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు. నీవు తప్పు చేస్తే ఒప్పుకో.
 • అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి.
 • అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే, వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది.
 • అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు.
 • అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది.
 • అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది. ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది.
 • అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది.
 • అసూయ ఆత్మకు పచ్చకామర్లు.
 • అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది.
 • అహంకారం అఙ్ఞానానికి అనుంగు బిడ్డ.
 • అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు - మహాత్మాగాంధి.
 • ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది.
 • ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి. ఒకదాన్ని ఆదరిస్తే, తన మిత్రులతో తిరిగి వస్తుంది.
 • ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు. ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు.
 • ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
 • ఆత్మ బలం లోపించిన వ్యక్తిలో శ్రద్ద స్థిరపడదు.
 • ఆత్మ విశ్వాసమే విజయానికి ప్రధమ సూత్రం.
 • ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏపనీ చేయలేవు.
 • ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు.
 • ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి - మనుధర్మ శాస్త్రం.
 • ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనినీ నమ్మడు.
 • ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం.
 • ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు.
 • ఆదర్శవాదికి అందరూ విరోధులే.
 • ఆదర్శాలు నక్షత్రాల లాంటివి. మనం వాటిని చేరలేము. కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం.
 • ఆదర్శాలు లేని మనిషి - ఒక విషాద దృశ్యం వంటివాడు.
 • ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు.
 • ఆనందం సుగంధం లాంటిది. మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు.
 • ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే - హెచ్.జి.
 • ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు.
 • ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పి పుచుతుంది.
 • ఆరాధన భావంతో సేవను చేయండి.
 • ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
 • ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది. నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది.
 • ఆరోగ్యం పరమ ప్రయోజనం.
 • ఆరోగ్యానికి, ఆనందానికి నీతిసూత్రాలే బలమైన పునాదులు.
 • ఆలోచన అనేది - ఒక మొగ్గ, భాష అనేది - చిగురు, కార్యం అనేది - దాని వెనుకనున్న ఫలం.
 • ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది.
 • ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.
 • ఆలోచన, ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది.
 • ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత.
 • ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది.
 • ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం.
 • ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే - ఆస్కార్ వైల్డ్.
 • ఆశ జీవితం జీవితమే ఆశ.
 • ఆశలేని వాని కగచాట్లులేవు.
 • ఆశించడం వల్ల కాక, అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
 • ఆశ్చర్యంలో నుంచే తత్త్వశాస్త్రం పుడుతుంది - సోక్రటీస్.
 • ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు.
 • ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి.
 • ఇచ్చువారికి దేవుడు ఇవ్వకమానడు.
 • ఇచ్చే వస్తువ కంటే కూడా ఆవస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది.
 • ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్ధకమైనది.
 • ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీసొంత తప్పులను గురించి తెలుసుకోండి.
 • ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు.
 • ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి. అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు.
 • ఇతరుల సహకారం తీసుకోండి. ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి.
 • ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా, జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది.
 • ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది.
 • ఇతరులతో పంచుకున్నప్పుడూ తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే - రికార్డా హక్.
 • ఇతరులను అర్థం చేసుకున్న వాడు జ్ఞాని, తనను తాను అర్ధం చేసుకున్న వాడు వివేకి.
 • ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే, వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకొని బాధపడుతున్నామని అర్ధం.
 • ఇతరులను జయించాలనుకోకు. నిన్ను నీవు జయించు. అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది.
 • ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి.
 • ఇతరులు నడచిన బాటలో నడిచేవడు తనకాలి జాడలను వదలలేడు.
 • ఇతురుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు.
 • ఇతురుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు.
 • ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
 • ఈ పని తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి.
 • ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది.
 • ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు.
 • ఈ రోజు దొరికే గుడ్డుకంటే రేపు దొరికే కోడి మంచిది.
 • ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది.
 • ఉజ్వల భవిష్యత్తు పై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం.
 • ఉత్తమ గ్రంధాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం.
 • ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి, నియమంగా జీవించటమే .
 • ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి. లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు.
 • ఉత్సాహం క్రియాశీలతలను వెయ్యి రెట్లు పెంచుతుంది.
 • ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
 • ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు.
 • ఉదార బుద్దితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు.
 • ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస.
 • ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు.
 • ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం.
 • ఉపదేశం తేలిక. ఆచరణ అతి కష్టం.
 • ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం.
 • ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు.
 • ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు. డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు - శామ్యూల్ జాన్సన్.
 • ఎంత పంచుకుంటే అంత పొందగలం.
 • ఎక్కడైతే నిస్వార్ధత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది.
 • ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు.
 • ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం.
 • ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసే వారే గొప్పవారు.
 • ఎదుటి వారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది.
 • ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ.
 • ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి.
 • ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు. మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారన్నదే ముఖ్యం.
 • ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు.
 • ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత.
 • ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ.
 • ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు.
 • ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు.
 • ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.
 • ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు.
 • ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషీ ఒక మహా గ్రంధమే.
 • ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకొన్నవారికి అసలు చీకటనేదే కనిపించదు.
 • ఎవరి పని వారుచేసుకోవడం ఉత్తమ ధర్మం.
 • ఎవరిమీదా ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు.
 • ఏ ఆదర్శాలూ లేనివాళ్ళు తెడ్డులేని పడవలాంటి వారు.
 • ఏ గొప్పవ్యక్తి వ్యర్ధంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత (ఆత్మ) కథలే - థామస్ కార్లెల్.
 • ఏ దేశానికైన ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది.
 • ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్దతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం.
 • ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.
 • ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండ జాగ్రత్తపడాలి.
 • ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం.
 • ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు. ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది.
 • ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు.
 • ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది.
 • ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి.
 • ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు.
 • ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు.
 • ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే.
 • ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే.
 • ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకొంటాడు.
 • ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.
 • ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.
 • ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
 • ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.
 • ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
 • ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.
 • ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
 • ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
 • ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.
 • ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
 • ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.
 • ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.
 • ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
 • ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
 • ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
 • ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.
 • ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.
 • ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది.
 • ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం.
 • ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు.
 • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
 • ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు.
 • ఓర్పుకు మించిన తపస్సు లేదు.
 • కఠినమైన పనులను తేలికగా చేయగల వాడు - విద్యాబోధకుడు.
 • కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు.
 • కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు.
 • కలల స్ధానంలోకి శోకం, క్షోభ వచ్చేవరకు మనిషి వృద్ధుడు కాడు -జాన్ బారీమోర్.
 • కళ్ళద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు.
 • కవి అన్నవాడు ఎప్పుడూ ఆకలితో అలమటించే వాడుగా గాని లేదా భగ్న ప్రేమికుడిగా గాని ఉండాలి.
 • కష్టపడి పనిచేసేవారికి అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.
 • కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
 • కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడమే నిజంగా గొప్పదనం.
 • కష్టాలు మన జీవితాలను మెరుగుదిద్దేందుకే కాని నాశనం చేయడానికి కాదు.
 • కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
 • కార్యశూరుడి వలె ఆలోచించు, అలోచనాపరుడిగా వ్యవహరించు.
 • కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
 • కావలసిన దానికంటే ఎక్కువ వివేకం కలిగి ఉండడం వివేకం అనిపించుకోదు.
 • కావలసిన దానికన్నా ఎక్కువ తీసుకొని దాస్తే మనం దొంగలం.
 • కీర్తి పొందని పుట్టుక నిష్ఫలము.
 • కుంటివాని వద్ద నడక, మూగవాని వద్ద మాటలు నేర్వడం కుదరదు.
 • కుక్కకు ఎముక వేయడం దానం కాదు. కుక్కకున్నంత ఆకలి నీకున్నప్పుడు ఆ కుక్కతో ఎముకను పంచుకోవడం నిజమైన దానం.
 • కృతజ్ఞత అనేది ఒకరిపట్ల చూపవలసిందే కాని ఒకరి నుండి ఆశించవలసింది కాదు.
 • కొద్ది కోరికలతో, చిన్న విషయాలతో తృప్తి పడటమే ఉత్తముని లక్షణం.
 • కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది.
 • కోపం పాపానికి ధూపం. రోషం దోషానికి మూలం.
 • కోపం యమధర్మరాజు లాంటిది.తృష్ణ వైతరణిలాంటిది. విద్య కామధేనువులాంటిది. ఇక సంతృప్తి దేవరాజైన ఇంద్రుడి నందనవనం లాంటిది.
 • కోపానికి కారణమైన గాయంకంటే అణచుకోని కోపం ఎక్కువ హాని కలిగిస్తుంది.
 • కోరిక ముగించిన చోట శాంతి ప్రారంభిస్తుంది.
 • కోరికల యొక్క యదార్థ స్వరూపం దుఃఖం.
 • క్రమబద్దతను పాటించకుండా సంపద, పరాక్రమం లేకుండా విజయం, ఉపకార గుణం లేకుండా పేరు, ఆధ్యాత్మిక ఙ్ఞానం లేకుండా ముక్తి లభించవు.
 • క్రోధాన్ని జయించిన వ్యక్తి అందరినీ జయిస్తాడు.
 • క్షణిక కోపాన్ని అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.
 • గంపెడు చదువుకంటే పిడికెడు లోకజ్ఞానం విలువైనది.
 • గతం త్రవ్వకండి. వర్తమానంలో పనిచేస్తూ భవిష్యత్తు నిర్మించండి.
 • గతం నుండి నేర్చుకోండి, కాని దాని కారణంగా దిగులుపడకండి.
 • గతమే వర్తమానానికి మార్గం.
 • గమ్యం చేరుకోవటం కంటే, నమ్మకంతో ప్రయాణం చేయటమే మేలైనది.
 • గర్వం వినాశనానికి ముందు పోతుంది. అహంకారం పతనానికి ముందు పోతుంది.
 • గుండెలోని భావాలను చెప్పని మాట వట్టి కళేబరం.
 • గుడ్డివాడికి మరో గుడ్డివాడు దారి చూపితే ఇద్దరూ గోతిలో పడతారు.
 • గురి వల్ల గొప్ప విలుకాడు అవుతాడే కాని పొదలో ఉన్న బాణాల వల్ల కాదు - ధామస్ ఫుల్లర్
 • గెలుపు అందవిహీనతను మరుగుపరిచే అరుదైన రంగు.
 • గొప్ప అంశాలు రూపొందేదే కర్మాగారం.
 • గొప్ప అణుకువ గల వ్యక్తి గొప్పకు చేరువవుతాడు.
 • గొప్ప ఆలోచనలను కలిగి ఉన్నవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు.
 • గొప్ప గొప్ప కార్యాలను సాధించటానికి ఉత్సాహమే ప్రధాన కారణం.
 • గొప్ప పనుల సుగంధమే పేరు ప్రతిష్టలు.
 • గొప్పపనలు చేయడానికి కావలసింది ముఖ్యంగా శక్తికాదు - ఓపిక.
 • గొప్పవారి యొక్క గొప్పతనం, వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది.
 • గొప్పవారిలోని గొప్పగుణాలు గుర్తించండి. వాటి గురించి రోజూ కాసేపు మననం చేసుకోండి.
 • గౌరవాలు పొందడం కాదు గొప్ప - వాటికి తగిన అర్హత సాధించడం గొప్ప.
 • ఙ్ఞాన, తప, యోగ మార్గాలకన్న సేవామార్గం మిన్న.
 • ఙ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు. మనలోని అఙ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది.
 • ఙ్ఞానం అమాంతంగా పొంగి పొర్లిపోదు, అది అంచెలంచెలుగ అభివృద్ధి చెందుతుంది.
 • ఙ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేనే లేదు