నలుగురు పాండవులకి "కలియుగం" ఎలా ఉంటుందో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ

నలుగురు పాండవులకి "కలియుగం" ఎలా ఉంటుందో చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ

ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుందో ఒకసారి మాకు చూడాలనివుంది అని కోరారు.
దానికి శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వునవ్వి అయితే చూపిస్తాను చూడండి అన్నాడు. మీ నలుగురూ నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేయ్యండి తరువాత ఆయా దిక్కులకు వెళ్లి ఆ బాణాలను వెదకి వెనకకు తీసుకుని రండి, అలాగే మీకు అక్కడ ఏ దృశ్యం కనిపిస్తుందో అది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి అన్నాడు.
నలుగురు పాండవులు తలో దిక్కుకు బాణాలను వేసారు వాటిని వెతుక్కుంటూ తలో దిక్కుగా వెళ్లారు.
---------------------------

• కొంత దూరం సాగిన అర్జునుడికి తాను వదలిన బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధురమైన గానం వినిపించింది అయన అటు వైపుకు వెళ్లి చూసాడు. అక్కడ ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. ఇక తిరిగి నేరుగా కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.

• భీముడికి తాను వదలిన బాణం దొరికినచోట బాగా నిండుగా నీళ్లున్న బావి, దానిపక్కపక్కనే సగానికి నిళ్ళున్నది, అడుగంటి నిళ్ళున్నది, అసలు పూర్తిగా ఒక్క చుక్క కూడా లేని ఎండిపోయిన బావి కనిపించింది. అన్నీ పక్క పక్కగానే ఉన్నప్పటికీ అలా అంత వ్యత్యాసం వుండడం చూసి ఆశ్చర్య పోయాడు. అక్కడి నుండి తిరిగి నేరుగా కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.

• నకులుడికి తాను వదలిన బాణం దొరికినచోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదూడను ప్రేమతో చర్మం వూడిపోయి గాయాలయ్యేంతగా విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. లేకపోతె ఆ దూడ చచ్చి వుండేది నకులుడికి ఆశ్చర్యమేసింది. కృష్ణుడి దగ్గరకు వెనుదిరిగి బయలుదేరాడు.

• ఇక సహదేవుడికి తాను వదలిన బాణం దొరికినచోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుకుంటూ పోతూ దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి ఏమి అర్థం కాలేదు. ఇక ఆయనా కృష్ణుడి దగ్గరకు వెనుదిరిగి బయలుదేరాడు

• ఆ నలుగురూ శ్రీకృష్ణునిదగ్గరకు చేరుకున్నారు తమకు అక్కడ ఏ దృశ్యం కనిపించిందో చెప్పి, తమకు కలిగిన సందేహాన్ని అడిగారు.
దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు....
-------------------------------

► అర్జునా....కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న కుందేలును పొడచుకు తినటం చుసావుకదా... అదేవిదంగా కలియుగంలో నిరాడంబర జీవనం గడుపుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వారు గొప్ప జ్ఞానులైన వారు తమ ఆహార్యంతో, ప్రవచనాలతో వందలు, వేల సంఖ్యలో అనుచరులను తయారు చేసుకోవటం, ఆశ్రమాలు కట్టుకోవటం, సొమ్ము కూడబెట్టుకోవటం చెప్పేది భక్తి మార్గం... కానీ చేసేది నమ్మక ద్రోహం. భక్తురాళ్లను, అనుచరులను ఇష్టానుసారం వాడుకుంటూ హత్యలు, అత్యాచారాలు చేస్తూ కోయిల కుందేలును పొడుచుకు తిన్న రీతిగా జీవిస్తూవుంటారు.
******

► భీమసేనా.... నిండుగా నీళ్లున్న బావి, దానిపక్కపక్కనే సగానికి నిళ్ళున్నది, అడుగంటి నిళ్ళున్నది, అసలు పూర్తిగా ఒక్క చుక్క కూడా లేని ఎండిపోయిన బావి, అవన్నీ పక్కపక్కనే ఉన్నప్పటికీ వాటి వ్యత్యాసం చూసావు కదా.. అదే విదంగా సమాజంలో మనుషులు అందరూ ఒకటే అన్నట్టు ఉండరు. ఉత్తములు, మధ్యములు, అధములు, నీచులు అనబడే వాళ్ళు పక్కపక్కనే ఒకచోటే జీవిస్తూ ఉంటారు. వారిలో.......

"ఉత్తములు" అంటే మహనీయులు. నిండుబావిలా నీతిగా యదార్ధంగా జీవిస్తూ ఇతరుల కోసం, సమాజం కోసం మేలును కోరుతూ, మేలును చేస్తూ, శీలం ప్రేమ దయ జాలి త్యాగం ధైర్యం కలిగి జీవించేవారు, మరొకరికి ఆదర్శంగా మార్గదర్సంగా జ్ఞానం కలిగి జీవించేవారు, ఇతరులకోసం శ్రమని అనుభవించేవారు, ఇతరులకి సేవ చేసేవారు, సత్యాన్ని ఆచరించేవారు, పవిత్రతను కలిగినవారు, న్యాయాన్ని ధర్మాన్ని అనుసరించేవారు, ఆశయం కోసం జీవించేవారు అయివుంటారు.

"మధ్యములు" అంటే మానవులు. సగం నీరున్న బావిలా తమకోసం తాము జీవిస్తూ, తమ కష్టం మీద వారు ఆదారపడి జీవించేవారు. సమాజానికి కీడైనను, మేలైనను చేయక ఏదో ఒక సేవ చేస్తూ జీవించేవారు. సమాజం యొక్క మనుగడలో ఏదో ఒక పని లేదా వృతి చేస్తూ జీవించేవారు. ఇతరులపై ఆదారపడక కష్టసుఖాలు కలిగి తృప్తి కలిగి జీవించేవారు. ఇతరులకు సహాయము దానము చేసేవారు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటూ, పెద్దల పాట్ల గౌరవం భయం కలిగి ఉండేవారు. చదువు, తెలివి, డబ్బు, ఉద్యోగం.. వీటిపై శ్రద్ధ కలిగి జీవించేవారు. ఇతరులకు విలువనిచ్చేవారు, విదేయత కలిగినవారు, తప్పులను సరిదిద్దుకునే వారు, నమ్మకానికి విలువనిచ్చేవారు, క్రమశిక్షణ మరియు లక్ష్యాన్ని కలిగి ఉండేవారుగా ఉంటారు.

"అధములు" అంటే దుష్టులు! సగానికి తక్కువుగా నీళ్ళు ఉండే బావిలా ఇతరులపై ఆదారపడి ఉంటూ, కాలాన్ని దుర్వినియోగం చేస్తూ, తిండి నిద్ర సుఖాలకోసం ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ, వాటికోసమే బ్రతికేవారు, కష్టపడకుండా సుఖంగా బ్రతకాలనుకునేవారు, బద్దకస్తులూ సోమరిపోతులు, కాలాన్ని డబ్బుకు మత్తుకూ వినియోగిస్తూ అధికారాలకు బానిసలైనవారు, చేసిన మేలుని మరిచేవారు, అసూయ ద్వేషాలతో ఇతరులని ని౦ది౦చేవారు, భాద్యతగా ప్రవర్తి౦చనివారు, స్వార్ధపరులు, ఏపనీ చేయకుండా ఉండేవారు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియనివారు, పిరికివారు, దురాశా అత్యాశ కలిగినవారు, ముందు ఒకలా వెనక ఒకలా ప్రవర్తించేవారు, మోసాలు చేసేవారు, దిగజారుడు కలిగినవారు, ఇతరులను హేళన చేసేవారు, పక్షపాత బుద్దితో ప్రవర్తించేవారు, ఇతరులను అర్ధం చేసుకోకుండా దీనులను బీదలను వ్రుద్దులను వికలాంగులను తక్కువగా చూసేవారు మరియు అసహ్యించుకునేవారు, చేస్తామని చెప్పి చేయకుండా ఉండేవారు, విధేయత లేని వారు, తప్పులు చేసి సమర్దించుకునేవారు, అబద్దాలపై ఆదారాపడేవారు, తమ అవసరాలకోసం ఇతరులను ఇబ్బందికి గురిచేసేవారు, విచ్చలవిడితనము జడత్వము కలిగినవారు, చేడుచేసేవారు, ద్వేషాన్ని నింపుకుని ఉండేవారు అయిఉంటారు.

ఇక "నీచులు"... అంటే పాపులు. పూర్తిగా అడుగంటి చుక్క నీరు కూడా లేని బావి విదంగా, "పుణ్యం" అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, అన్యాయపు తీర్పునిచ్చేవారు, అబద్దపు సాక్ష్యం పలికేవారు, అవినీతిగా అన్యాయంగా అధర్మంగా అక్రమంగా నమ్మకద్రోహాలతో పదే పదే తప్పులు చేస్తూ, చేసిన తప్పులు సమర్దించుకుంటూ, మేలు చేసినవారికి కీడు చేస్తూ, దురాసలు కలిగి స్వప్రయోజనాలకోసం హత్యలు చేస్తూ, తనను తాను మోసం చేసుకుంటూ, సమాజాన్ని ఇతరులను మోసం చేస్తూ, ఇతరుల పట్ల కనికరం లేకుండా కించపరుస్తూ, మాటలు ఒకవిదంగా చేతలు వాటి విరోదంగా చేసేవారు, నైతికవిలువలకు వ్యతిరేకంగా తప్పుడు మాటలను తప్పుడు మార్గాలను తప్పుడు సిద్దాంతాలను తయారుచేసేవారు, వాటిని భోధిస్తూ ఉండేవారు, స్వప్రయోజనాలకోసం ఇతరులను మభ్యపెట్టేవారు, భానిసలుగా మార్చేవారు, కుట్రలు వెన్నుపోట్లు వంచనా వీటిని చేసేవారు, వీరి వద్ద అత్యంత సమృద్దిగా డబ్బులు ఉన్నా.. చూస్తూ కానీ చస్తూ కానీ పేదలకు ఒక్క పైసా కూడా సహాయం చేయరు.
******

► నాకులా.... ఆవు, దూడ చర్మం ఊడిపోయి గాయం అయ్యేంత ప్రేమతో నాకింది చూసావు కదా!! పిల్లలను క్రమశిక్షనతో పెంచడ౦ ఒక క్రమబద్దమైన ప్రక్రియ. క్రమశిక్షణ వల్ల పిల్లలు మంచీ చెడు ప్రవర్తనల తేడాను తెలుసుకుంటారు. పెరిగేకొద్దీ క్రమశిక్షణతో పెరుగుతారు. సమాజంలో మంచి వ్యక్తిగా తీర్చదిద్దబడతారు. || మొక్కై వంగనిది మానై వంగునా!?|| అనే సామెత ప్రకారం చిన్నవయసులోనే మంచి అలవాట్లు నేర్పితే పెరిగే కొద్దీ మంచి పౌరులుగా తీర్చదిద్దబడతారు.

కాని ఆవు, తన అతి ప్రేమ ఎకువై మితిమీరడం వల్ల చుట్టూ ఉన్న జనం దానిని విడదీయకపోతే ఆ దూడ చచ్చిపోయి ఉండేది. అదేవిదంగా, కొంతమంది తల్లితండ్రులు పిల్లలను బాగా గారాబం చేసి చివరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అధోగతి పాలు చేస్తారు. అది తప్పు. తల్లితండ్రులు ఇద్దరూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. పిల్లల పట్ల ప్రేమానురాగాలు ఉండాలి, క్ష్నున్నంగా పరిశీలించాలి, తెలుసుకోవాలి. పిల్లలకు ఇతరులను గౌరవించడం నేర్పించాలి. వాళ్ళు చెప్పేది సరిగ్గా విని తగిన సమాదానాలు చెప్పాలి. వారితో మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించాలి. పిల్లలను ఖటినంగా శిక్షించకూ౦డా దగ్గరకు తీసుకునే తత్వం అలవర్చుకోవాలి. తల్లితండ్రులు ప్రవర్తనా శైలి పిల్లలను క్రమశిక్షణతో పెంచడం, వారి వైకారి, లక్ష్యాలు, నమ్మకాలు పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి.
******

► ఇక సహదేవా... పర్వతం పైనుండి పెద్ద గుండు దోర్లుకు౦తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగినట్టు చుసావుకదా. అదే విదంగా ఈ కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి, కొండ మీద నుండి గుండు దోర్లినట్టుగా పతనం అవుతారు. ఒక్క భగవన్నామమనే హృదయంలో మొలిచిన మొక్క తప్పా, దానిని ఎవరూ కాపాడలేరు ఆపలేరు అని చెప్పారు "శ్రీ కృష్ణ పరమాత్మ" ????