కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో

కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీకృష్ణులవారి మాటల్లో

శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించే ముందు "కలియుగం" గురించి చెప్పిన విషయాలు. అలానే, ఆయన యావత్ మనుష్య జాతికి ఇచ్చిన సందేశం!!

కలియుగం ప్రవేశి౦చగానే మనుష్యులందు రెండు లక్షణములు మొదలవుతాయి. ఒకటి, అపారమయిన కోర్కెలు. రెండు, విపరీతమయిన కోపం.

ఎవ్వరు కూడా తన తప్పుని తాను తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రతీవాడికి కోపమే, ప్రతీవాడికి కోర్కెలే. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తమ ఆయుర్దాయాన్ని వారు తగ్గించేసుకుంటారు. అపారమయిన కోర్కెల చేత, కోపము చేత తిరగడ౦ వల్ల వ్యాధులు వస్తాయి.
కలియుగంలో ఉన్న మనుష్యులకి రాను రాను వేదము ప్రమాణము కాదు. యజ్ఞయాగాదులు చేయకండి. వేదము చేత ప్రోక్తమయినటువంటి భగవన్మూర్తులను పూజించాకండీ. ఇటువంటి మాటలు బాగా రుచిస్తాయి.


రుచించీ, కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణము అని అంగీకరి౦చగలిగినటువంటి స్థితిలో పుట్టినవారు కూడా వదిలేస్తారు. వదిలేసుకుని, తమంత తాముగా "పాష౦డ మతములను" కౌగలించుకుంటారు. కౌగలించుకుని, అభ్యున్నతని విడిచిపెట్టి వేరే మార్గములలోకి వెళ్ళిపోతారు. అలా వదిలి వెళ్ళిపోవడం వలన, సంస్కారం కోల్పోయి, రాను రాను రాను రాను పూజకు చేయాల్సిన ఆచరణ వదిలేసి, సరైన వస్త్రాదరణ పాటించకుండా, దానికి విరుద్దంగా దరించి, ఆచరణము లేని పూజలు ఏముంటాయో, వాటిని చేయడానికి ఇష్టపడతారు. వాటి వల్ల ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంత శుద్ధి ఉండదు. చిత్తశుద్ది ఏర్పడదు. అందువల్ల ఆచరనమును, సంప్రదాయమును విడిచిపెట్టి తిరగడం ప్రారంభం చేస్తారు. అయ్యో! ఈ ఆచారము పాటించడం వలన మన మనస్సుని సంస్కరిస్తుందని తెలుసుకోవడం మానేస్తారు. మానేసి, ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచరము అక్కర్లేదని ప్రచారం అవుతుందో అటు వైపు తొందరగా అడుగు వేస్తారు.

ఎప్పుడూ ఇంద్రియములకు బానిస ఐపోతారు. వాటికి ఎదురు తిరిగి నేను ఎందుకు అనుభవించాలి అని అడిగేవాడు ఉండడు. మనసు కంటితో అనుభావించమంటే బానిసయై తిరుగుతారు. చెవితో వినమంటే వినేస్తారు. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే ఎదురు తిరుగుతారు, సంగాలు కడతారు, కొట్టుకుంటారు, రాజులే ప్రజల సొమ్ముని దోచుకుంటారు, ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ యోగ్యతను బట్టి, వాడి పాండిత్యమును బట్టి, భక్తిని బట్టి గౌరవం ఉండదు. ఎవడికి ఐశ్వర్యము ఉన్నదో వాడికే గౌరవము దక్కుతుంది. ఆచమనం కూడా చేయడం చేతకాని వారే పెద్ద పెద్ద దేవాలయాలకు అధిపతిగా ఉంటారు. పనికిమాలిన వాళ్ళు ఆలయాల నిర్మాణాలకు పూనుకుని, ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని అందించడంలో భంగపాటుకి గురవుతారు.

అందరూ గుళ్ళకి వెళ్ళడమే గాని, అసలు కలియుగంలో వేల్లవలసినటువంటిది భగవంతుడి పాదములను గట్టిగా పట్టుకుని తరించిపోయిన మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమాలు ఉన్నాయి. రమణమహర్షి, రామ కృష్ణ పరమహంస. అటువంటి వాటి దగ్గర మన కాళ్ళు పెట్టాలి. కాని ఆశ్రమాలకి వేళ్ళరు.
సరికదా, హీనమయిన భక్తితో, కోర్కెలు తీరడానికి ఎవరిని పట్టుకుంటే సులువుగా తీరతాయి అన్న ప్రశంలు అడుగుతారు.

ఈ మూర్తిని పట్టుకుంటే కోర్కె తీరుతుంది, ఈ మూర్తిని పూజి౦చానని ఆ మూర్తికి తెలిస్తే కోపం వస్తుందేమో అంటాడు గానీ, ఒక్క మూర్తియే ఇలా ఉంది అని తెలుసుకోరు. ఈశ్వరుడి యందు బేధ బుధి చూపిస్తారు. ఈ జీవితం ఈశ్వరుడు ఇచ్చాడు అని తెలుసుకునే ప్రయత్నం చేసుకోకుండా, ఆయననే దూషించే స్థాయికి సమాజము వెళ్ళిపోతుంది.
----------------------------------------------------------------------

కాబట్టి ఊద్భవా! నీకొక మాట చెబుతున్నాను, జ్ఞాపకం పెట్టుకో...

"ఈ ప్రపంచంలో ఉన్నదంతా డొల్లయే అని నువ్వు తెలుసుకోవడానికి ఒకటి చెప్పేస్తున్నాను..! ఇంద్రయములచేత నీకు ఏది సుఖాన్ని ఇస్తుందో అదంతా డొల్లయే.. అది నీ మనుష్య జన్మని పాడుచేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో."