చాణక్య నీతులు (భాగం - 3)

చాణక్య నీతులు (భాగం - 3)

చాణక్య నీతులు (భాగం - 3)

25. ఉన్నత వంశంలో జన్మించడం (గుణం తక్కువ వాడికి పదవి అప్పగిస్తే అటు దేశానికి, ఇటు ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఋతువులు సక్రమంగా రావు. తద్వారా వాతావరణ వ్యవస్థ దెబ్బతిని దేశం కరువు కాటకాలు పాలౌతుంది.)
26. దైవభక్తి కలిగి ఉండాలి. (దైవభక్తి గలవానికి తను చేసే పనులను భగవంతుడు చూస్తుంటాడు అనే భావంతో చేడుపనులు చేయడానికి దూరంగా ఉంటాడు)
27. మంచి బుద్ధి కలిగిఉండాలి.
28. బలము కలిగి ఉండాలి. తనను తాను రక్షించుకొనడంతో బాటు ఇతరులను రక్షణ కల్పిస్తాడు)
29. ధర్మతత్పరులైన పెద్దలను కలవడం. (పెద్దలను కలవడం వలన వారి అనుభవముల నుండి సలహాలు స్వీకరించి దేశాన్ని సుస్థిరం చేయగలుగుతాడు)
30. సత్యభాషణ.
31. అనవసరపు వాదనలు చేయకుండా ఉండటం. అతిగా మాట్లాడకపోవడం. (ఈ రెండింటి వలన మీలోని లోటుపాట్లు కనిపెట్టి మీతోబాటు వ్యవస్థకి చేటు చేసే అవకాశం ఉంటుంది)
32. పొందిన మేలు మరచిపోకుండా ఉండాలి.
33. పని పని వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేయాలి.
34. చేసే పని యందు ఉత్సాహం కనబరచాలి.
35. ఎప్పటికప్పుడు కొత్తవిషయాలను తెలుసుకోవాలి. జాతీయ గంధాలు పరిశీలన చేస్తుండాలి.
36. అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండాలి. పాలకునికి మతిమరపుతో చాలా ప్రమాదం.