ఆ బాలరాముని సేవిస్తున్నాను

ఆ బాలరాముని సేవిస్తున్నాను

|| శుద్దా౦తే  మాత్రుమధ్యే  దశరధపురతః  సంచరంతం  పరం  తం
కాంచీదామానువిద్ధ్ర ప్రతిమణి విలసత్  కింకిణీ  నిక్వణా౦గం
ఫాలే  ముక్తాలలామం  పదయుగనినదం  నూపురం  చారుహాసం
బాలం రామం భజే  హం  ప్రణతజనమనఃఖేదవిచ్చేదదక్షం ||

భావం:
అయోధ్యలో అంతఃపురంలో దశరధుని ఎదురుగా తల్లుల మధ్యలో సంచరిస్తున్నవాడు, మొలత్రాడుకి కట్టిన మణుల ప్రకాశం, మువ్వల ధ్వనితో కూడిన శరీరముతో, నుదుటిపై ముత్యాల తిలకం కలవాడు, అందెల ధ్వనిస్తున్న పాదములు కలవాడు, చిరునవ్వుతోనున్న సుందరమయిన మోముతో ప్రకాశిస్తూ, నమస్కరించేవారి మనస్సులోనున్న బాధను పోగోట్టడంలో సమర్దుడైన బాలరాముని సేవిస్తున్నాను.