నాసదియసూక్తం - విశ్వస్వరూపం (భాగం - 4)

నాసదియసూక్తం - విశ్వస్వరూపం (భాగం - 4)

~ ఋగ్ వేదం   | వైరుధ్యం (Paradox) | విశ్వస్వరూపం (భాగం - 4) | Vedic Science

నాసదీయ సూక్తంలో, శ్లోకానికి నాలుగు పాదాల చొప్పున ఏడు శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకంలోను మొదటి పాదంలో చెప్పదలుచుకున్న ముఖ్యాంశం ఉంటుంది, మిగిలిన మూడు పాదాలలో కొంత వివరణ ఉంటుంది. ఈ శ్లోకాలని అర్ధం చేసుకోటానికి ముందుగా 'సత్' అనే మాటకి 'అసత్' అనే మాటకి ఉన్న విస్తృతార్ధం మనం గ్రహించాలి. “సత్” అంటే సత్వం లేదా అస్తిత్వం. దీనినే ఇంగ్లీషులో 'బీయింగ్' (being) అనిన్నీ 'ఎగ్జిస్‌టెన్స్' (existence) అనిన్నీ అనొచ్చు. తెలుగులో “ఉనికి” అని కాని, 'ఉండటం' అని కాని చెప్పుకోవచ్చు.

సత్ అంటే ఏమిటో చెప్పేను కనుక దీనికి వ్యతిరేకమైన లేక విరుద్ధమైన అర్ధంతో 'అసత్' అనే మాటని వాడదాం. అసత్ అంటే నాస్తిత్వం. సంస్కృతంలో 'న' అంటే లేదు, కాదు అనే అర్ధాలు ఉన్నాయి. కనుక శ్లోకం మొదట్లోనే 'న అసత్, న సత్' అనే ద్వంద్వ విరుద్ధ భావాలతో మొదలు అవుతుంది. అందుకనే దీనిని నాసదీయ సూక్తం అన్నారు.

ఈ నాసదీయ సూక్తం నుంచి ఏడు మంత్రాలు ఏమిటో చూద్దాం: