శృంగారం అనేది అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి

శృంగారం అనేది అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి
శృంగారం అనేది అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి

© Rushivarya | Please Share.. Don't Copy & paste

ప్రేమ, శృంగారము"లను సనాతనధర్మం పవిత్రమైనవిగా భావిస్తుంది. రతీ దేవి, మన్మధుడు అధిపతులుగా ఉంటారు. శృంగారమును తప్పుగా చూడడం, అసభ్యంగా మాట్లాడడం, నీచ భావన కలిగి ఉండడం ఎన్నడూ చేయకూడదు. మనం కూడా ఇటువంటి పవిత్రమయిన కార్యం నుంచి జన్మ పొందామన్న సంగతి మరువకండి.

శాస్త్రాలలో ఒకటైన "కామసూత్ర" ధర్మ, అర్ధ, కామములో "కామమును" కనీస మూడవ ధర్మంగా తెలియజేస్తుంది. కామము అనేది "ప్రేమ, ఆనందం, ఇంద్రియ తృప్తి"ని కలిగి ఉంటుంది. ఇది దంపతుల యొక్క మానసిక ద్రుడత్వానికి, ఆత్మ విశ్వాసానికి, శరీర ఆరోగ్యానికి చాలా అవసరము. శృంగారము అంటే తెలియనివారు ఉండరు, ఏదో చిన్న క్రీడ అని తీసిపారేసే సంఖ్య ఎక్కువ. దేనికైనా ఒక విధివిధానం అంటూ ఒకటి ఉంటుంది అని గ్రహించాలి. "అమెరికా"లో ఒక పరిశీలన ప్రకారం శృంగారాన్ని ఇష్టం వచ్చినట్టు చేసి వైద్యశాలలో మంచానపడ్డ జనాభా సంఖ్య స౦వత్సరానికి లక్షకు పైగా ఉందని తేలింది.

కనుక ఏవిదంగా పాల్గోనాలో, మనుష్యునికి సహజంగా ఉ౦డే కామం ధర్మబద్ధం చేసేవిదంగా మార్గం చూపించే శాస్త్రమే "కామసూత్ర". (Formula to know and perform Kama).

Spirituality:
అణువు నుంచి పుట్టుకొచ్చిన ఈ విశ్వంలో మనం కూడా ఉన్నందువలన మానవ శరీరం కూడా ఒక విశ్వం.. విశ్వం తన ఉనికిని తాను తెలుసుకునేందుకు ప్రాణికోటిలో మానవుని జననం జరిగిందని ఒక మాట Spirtualityలో ఉంటుంది. అంటే మానవ జన్మ అనేది ఎంత అరుదైనదో, ఎంతటి గొప్పదో ఆలోచించండి. అవసరానికి మించి ఆశించడమే జీవితం పతనం అవ్వడానికి కారణం అవుతుంది. అలా ఆశించి కష్టాలు పడడం, జీవితం అంటేనే కష్టం అని చేసే పిచ్చి ప్రచారం వలన మనుష్య జన్మని దూషించే స్థితికి దిగజారడం జరిగింది. విశ్వంలో ఎన్ని ప్రకంపనలు జరిగినా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలానే మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఉండడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

పురుష, స్త్రీకి ఉండే శక్తి (Energy) రెండు విదాలుగా ఉంటుంది ♂ ♀ . కనుక ఇరువురి శరీర ధర్మాలు కొంచం వేరుగా ఉంటాయి. రెండు విశ్వాలు కలిసినప్పుడు జరిగే ప్రకంపనలు మరో విశ్వం పుట్టుటకు కారణం అవుతుంది. అలా రెండు శరీరాలు విశ్వం వలే కలిసనప్పుడు జరిగే కార్యం వలన మరొక విశ్వంలా వేరొక శరీరం పుట్టుటకు కారణం అవుతుంది. దంపతులు కలవడం అనేది సామాన్య బుద్దితో, అశాంతి మనసుతో కాకుండా ఆధ్యాత్మిక ఆనందం (Spiritual Bliss) కలిగే విదంగా కలవాలి. 

Sanatan Dharma (Hinduism):
సమయం, సందర్భం లేకుండా రతిలో పాల్గొనకూడదు అనేది వేదవాఖు. కారణం... శరీరంలో ప్రతికూల చర్యలు జరగడం (Negative Force). కనుక వేదం దానికి కూడా ప్రత్యేకించి ఒక సమయాన్ని నిర్ణయించింది. భాగవత పురాణ ప్రకారం పగటిపూట, అలానే అసురసంధ్య వేల.. అంటే పూర్తిగా వెలుగు కాదు, చీకటి కాదు. (ex: 6 to 7PM) సూర్యుడు అస్తమించినా కూడా ఉండే చిన్న వెలుగు ఉన్న సమయం రాక్షసులు తిరిగే వేల. ఆ సమయాలలో శృంగారం నిషిద్దం. కేవలం రాత్రి పూట మాత్రమే జరగాలి.

లైంగిక శక్తి యొక్క శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే, సాధారణ శృంగారమునకు దూరంగా ఉంటాము. సాదారణము అంటే మనసుకు తోచినట్టు, మలినంతో నిండి ఉన్న మనసు, ఇష్టం వచ్చినట్టు పాల్గొనడం, వ్యసనాలతో కూడి ఉన్న బుద్ది అని అర్దం. ఇద్దరు భాగస్వాముల యొక్క ప్రామాణికమైన స్వచ్ఛతతో శృంగారము యొక్క పవిత్రతలో కలిసి వారి ప్రేమను వారధిగా మార్చి ఇరువురి ఆత్మలను చూసుకునే భావన పొందుతూ శక్తిని Related imageపంచుకోవాలి. శరీరంతో కన్నా ప్రశాంతంగా ఉండే మనసుతో (Spiritual Sex) చేసే శృంగారం ముఖ్యం. 

 

Sex is a quantum Activity... ఇరువురి మనస్సు / శరీరం / ఆత్మలకు మధ్య ఉండే సంబంధం.

లోకంలో ఉండే ప్రతిదీ ఒక శక్తి అని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ప్రాథమిక లైంగిక శక్తిని (basic sexual energy), దాని శక్తిని (Power), అందాన్ని (Beauty), మరియు బలాన్ని (Strength) అన్వేషించాలి. శృంగారం అనేది అంత గొప్ప ఆధ్యాత్మిక అనుభవం. శృంగారం యొక్క గొప్పదనం మనుష్య జన్మకి దొరికిన అరుదైన అవకాశం.

సృష్టిలో శృంగారమును ఊరికినే పెట్టడం జరగలేదు. అది ఆధ్యాత్మిక సాధన. దాని గురించి ఉండే జ్ఞానం విచిత్రం, అద్భుతం!