అయ్యప్పమాల వెనుక అంతరార్ధం

అయ్యప్పమాల వెనుక అంతరార్ధం

"అయ్యప్ప మాల" పుణ్యం కోసం, పాప వినాశనం కోసం వేసుకుంటారు...

దాని వెనుక ఉన్న అంతరార్దం ఏమిటి, మనం ఏమి నేర్చుకోవాలి?
కాని ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి అన్న విషయాలు చూద్దాం!
••••••••••••••••••••••••••••••••
ధనవంతులైనా, మధ్యములైనా, అధములు అయినా, దురలవాట్లు ఉన్నవారైనా సరే ఒకసారి "అయ్యప్ప మాల" వేస్తే నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ, సూర్యోదయానికి ముందు.. అంటేబ్రహ్మ ముహూర్తాన లేచి తల స్నానం చేస్తారు. మాంసము ముట్టరు. 
కాలికి పాదరక్షలు ధరించరు. ప్రతీ ఆడవారిలో "మాతా" అంటూ అమ్మతనమే చూస్తారు. ఇతరులపై తప్పుడు మాటలు, అసూయ, ద్వేశ౦ లాంటివి చూపించరు. మాటలు మితంగా ఉంటాయి.

అంతరార్దం: 
→→→→→→→→→→→→
మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి, ఎల్లప్పుడూ దినచర్య ఎలా పాటించాలి, స్త్రీలతో ఎలా ఉండాలి, మనసు భగవంతుని పట్ల ఎల్లప్పుడూ ఉంచాలి అన్న విషయాలు మనకు నేర్పిస్తుంది. అందుకే ఇదొక "దీక్ష" అని పేర్కొన్నారు పెద్దలు!

వేకువన స్నానం చేయడం:
సూర్యోదయానికి ముందు సమయాన్ని "బ్రహ్మ మూహూర్త్న౦" అంటారు. ఆసమయంలో స్నానం చేసి సంద్యావందనం చేస్తే దినచర్య, మనసు, ఆరోగ్యం బాగుంటుంది...

పాదరక్షలు వేసుకోకపోవడం: "కష్టే ఫల్లి" అన్న మాటను, జీవితంలో కష్ట పడాలి, ఇంద్రియములచే సుఖానికి బానిస అవ్వకూడదు అని గుర్తుచేస్తుంది.

స్త్రీలలో అమ్మతనం: స్త్రీలని గౌరవించడం, భార్యని ఎలా చూసుకోవాలి అని, ఎలా చూడకూడదని తెలియచెప్పటం.

మాంసము తినకపోవడం: "మాంసము"ను భుజించడం వలన బుద్దిని మందగిస్తుంది. అందువల్ల జ్ఞాపక శక్తిని కోల్పోవడం, మనసు పాడవడం, ఏకాగ్రతను కోల్పోవడం జరుగుతుంది. అ౦దుకే "సనాతన ధర్మం" ప్రకారం మాంసము తిన్న వాడు గుడికి మెట్టు కూడా తొక్క రాదు!

భగవన్నామసమరణ: మనస్పూర్తిగా నిత్యం "భాగవన్నామసమరణ" చేసినవాడు అన్నింటా "బ్రహ్మమును" చూసినవాడు అవుతాడు. అప్పుడు వాడు ఇక దేనిపై ద్వేషం పెంచుకుంటాడు? దేనిని అసహ్యించుకుంటాడు? ఇక నోట వెంట మంచిని తప్ప తప్పుని ఎందుకు పలుకుతాడు!? మనసుని శుబ్రం చేసుకుని, భాగంతుడిని ఆహ్వానించి కుర్చోపెట్టుకోవాలి అంటే "భాగవన్నామసమరణ" తప్ప ఇంకొక మార్గం లేదు.

ముడుపులు శిరస్సుపై ధరించడం: ముడుపు శిరస్సుపై బరువు వలే పెట్టుకుని, కాలికి పాదరక్ష లేకుండా కొండ ఎక్కుతారు స్వాములు. అంటే... జీవితంలో ఎంత భార౦ ఉండనీ, ఎంతాక్ కష్టం ఉండనీ... మన కర్తవ్యం అనేది మరవకు అని చెప్పడం. మీ మధ్య చిన్న కష్టం వచ్చినా కొతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది క్షమించరాని పాపం. కన్నా తల్లి తండ్రులు ఏమైపోవాలి? వారికి వయసు పైపడ్డాక ఎవరు చూస్తారు అన్న ఆలోచన చేయలేకపోతున్నారు.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••

ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి:
→→→→→→→→→→→→
మీరు బయట గమనిస్తే... మాల వేసి, ఇంత ఖటిన౦గా దీక్ష చేసి కూడా... ఒకసారి మాల తీసివేసాక, తమ "ప్రవర్తన" మాత్రం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. "మాల" వేస్తే ఏదో పుణ్యం వచ్చేస్తుందిలే అనుకుంటున్నారు తప్పా, అందులో నుంచి ఏమి 
నేర్చుకోవాలి అని మాత్రం గ్రహించలేని స్ధితిలో ఉంటున్నారు జనం. అందుకు ఉదాహరణ, నేను కొంతమందిని చూసాను. పేరుకి మాల వేస్తారు. కాని మాల తీసివేసాక పొగ త్రాగడం, మద్యం సేవించడం, ఆస్తి కోసం కొట్లాటలు, స్త్రీలపై అనకూడని మాటలు, ధనం ఉందన్న గర్వం, సూటిపోటి మాటలు ఇతరులపై విసరడం, సమయాన్ని వృధా చేయడం, తినడానికే బ్రతుకుతున్నాం అన్నట్టు మొదలైనవి చేసి "పాపాన్ని" మరింతగా పెంచుకుంటున్నారన్న విషయం 
తెలుసుకోలేకపోతునారు.

మరి మీరు ఏమంటారు?