పురాణం - భాగం 3 || పురాణం లక్షణములు

పురాణం - భాగం 3 || పురాణం లక్షణములు

పురాణం - భాగం 3

|| సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచారితంచైవ పురాణం పంచలక్షణం ||


పురాణముణకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి పస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో 
జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంభ౦దంగా దానిని ప్రతిపాదన చెయ్యగలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేడు. 
------------------------------------------------------------------------------
"అష్టాదశ పురానముల" పేర్లను సాదారణ మనుష్యులకు జ్ఞాపకం ఉండడం కోసం అని మన పెద్దలు తేలిక సూత్రము నొక దానిని ప్రతిపాదించారు.

'మ' ద్వయం 'భ' ద్వయం 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం
'అ' 'నా' 'ప' 'లిం' 'గ' 'కూ' 'స్కా' ని పురాణాని ప్రుధక్ ప్రుధక్.

ద్వయం అంటే రెండు, త్రయం అంటే మూడు, చతుష్టయమ అంటే నాలుగు అని అర్ధం.
------------------------------------------------------------------------------
మద్వయం - 'మ' కారంతో రెండు పురాణములు | మార్కండేయ పురాణము, మత్స్యపురానము.
భద్వయం - 'భ' తో రెండు పురాణములు | భాగవత పురాణము, భవిష్య పురాణము.
భ్రత్రయం - 'బ్ర' తో మూడు పురాణములు | బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, భ్రహ్మవైవర్త పురాణము.
వచతుష్టయం - 'వ' కారంతో నాలుగు పురాణములు | వరాహ, వామన, వాయు, విష్ణు పురాణములు.

అనాపలింగకూస్కా - అన్నప్పుడు ఒకొక్క అక్షరమునకు ఒకొక్క పురాణము వస్తుంది.

అ - అగ్ని పురాణం, నా - నారద పురాణం, ప - పద్మ పురాణం, లిం - లింగ పురాణము,
గ - గరుడ పురాణము, కూ - కూర్మన పురాణము, స్కా - స్కాంద పురాణము

అనేవి మొత్తం పురాణాల పేర్లు...